రేమండ్ కంపెనీ వ్యవస్థాపకుడు విజయ పత్ రేమండ్స్ చరిత్ర ప్రతి తల్లి తండ్రులకు ఒక గుణపాఠం కావాలి... Heart touching story... Read fully
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే' అని కార్ల్ మార్క్స్ ఏనాడో చెప్పాడు. అది నిజమేనని నేటి సమాజం నిరూపిస్తోంది
పిల్లలను గుడ్డిగా ప్రేమించే తల్లిదండ్రులకు ఈయన జీవితం ఓ గుణపాఠం.
మానవ సంబంధాల్లో ఆర్థికపరమైన అంశాలకే మనుషులు ప్రాధాన్యం ఇస్తున్నారు. మనీ మాయలో తోటివారినే కాదు కుటుంబసభ్యులను కూడా మర్చిపోతున్నారు.
మనిషిలో పెరుగుతున్న స్వార్థం, డబ్బుమీద పెరుగుతున్న మోజు కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి.
తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, కొడుకులు, కూతుళ్లు డబ్బుకిస్తున్న ప్రాధాన్యత ప్రేమానురాగాలకు ఇవ్వకపోవడం వారి మధ్య అగాధాన్ని పెంచుతోంది.
అసలు డబ్బు పిచ్చి ఏ రేంజ్ లో ఉందంటే.. కన్నవారినే రోడ్డున పడేసే దుస్థితి వచ్చింది.
ఇలాంటి ఘటనే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వస్త్ర పరిశ్రమలో ఒకప్పుడు రారాజుగా వెలిగిన రేమాండ్స్ వ్యవస్థాపకుడు విజయ్ పథ్ సింఘానియా ఇప్పుడు వీధినపడ్డారు. కొడుకు బయటకు గెంటేయడంతో బిచ్చగాడిలా మారారు.
రేమాండ్ వస్త్ర సామ్రాజ్యాన్ని స్ధాపించి. రెండు దశాబ్దాలకు పైగా దుస్తుల రంగంలో ఆ బ్రాండ్‌ను తిరుగులేకుండా నిలిపిన పారిశ్రామిక దిగ్గజం విజయ్‌పథ్ సింఘానియా(80). వేల కోట్ల ఆస్తులు సంపాదించిన ఈయన.. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు.
తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక రోడ్డున పడ్డారు. కోట్ల రూపాయల వ్యాపారంతో తులతూగిన విజయ్ పథ్ సింఘానియాకు ఈ కష్టాన్ని తెచ్చిపెట్టింది మరెవరో కాదు ఆయన పుత్రరత్నమే.
వ్యాపారాన్నంతా కైవసం చేసుకుని తండ్రిని వీధిన పడేశాడు కొడుకు. తండ్రి కనీస అవసరాలను తీర్చేందుకు కూడా డబ్బు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారట. వెయ్యి కోట్ల రేమండ్ సంస్థను, 36 అంతస్థుల భవనాన్ని విజయ్‌పథ్ సింఘానియా తన కొడుకుకు ఇచ్చారు. ఆస్తి మొత్తం రాయించుకున్న తర్వాత.. తండ్రిని ఇంట్లో నుంచి గెంటేశాడు.
చేతిలో చిల్లిగవ్వ లేక అద్దె ఇంట్లో విజయ్ సింఘానియా నానా అవస్థలు పడుతున్నారు.
విధిలేని పక్షంలో కోర్టును ఆశ్రయించారు. 80ఏళ్ల వయసులో ఆయన పడుతున్న ఈ కష్టాన్ని చూసి ఇరుగుపొరుగు వారు ఆవేదన చెందుతున్నారు.
తనకు రావాల్సిన ఆస్తి, డబ్బును ఇప్పించాలని రేమండ్ దిగ్గజం విజయ్ పథ్ సింఘానియా కోర్టును వేడుకుంటుననారు.
ఎనిమిది పదుల వయసులో హాయిగా పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకోవాలి. ఆనందంగా జీవించాలి. అలాంటిది. విజయ్ సింఘానియా.. కుమారుడు గౌతమ్ సింఘానియాతో ఆస్తి కోసం పోరాడాల్సి రావడం బాధాకరం.
రూ. 1041 కోట్లను కొడుక్కు రాసిచ్చిన సింఘానియా.. ఇప్పుడు వృద్దాప్యంలో తనను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
వేల కోట్ల ఆస్తిని తీసుకున్న కొడుకు గౌతమ్.. ఇప్పుడు వృద్ధుడైన తండ్రికి కనీసం కారు, డ్రైవర్ లేకుండా చేసేశారని న్యాయస్థానానికి విన్నవించారు విజయ్ సంఘానియా తరపు న్యాయవాది.
తనకున్న విలువైన షేర్లు, ఇతర ఆస్తులన్నింటిని కొడుకు గౌతంకు ఇచ్చినా.. ఎందుకు పట్టించుకోవడం లేదనే చర్చ సాగుతోంది.
రేమాండ్ కంపెనీ పేరుతో 36 అంతస్థుల భవంతి ముంబైలో ఉంది. కానీ విజయ్ పథ్ అద్దె ఇంటిలో ఉంటున్నారు.
విజయ్‌పథ్ సింఘానియాకు నెలకు రూ.7లక్షల చొప్పున కంపెనీ నుంచి రావాల్సి ఉందని ఆయన న్యాయవాదులు చెప్పారు. అంతేకాదు, కంపెనీ ఖర్చులతో ఆయనకు ప్రత్యామ్నాయ నివాస వసతి కల్పించాల్సి ఉందన్నారు. ఈ నెల 18 నాటికల్లా దీనిపై సమాధానాన్ని దాఖలు చేయాల్సిందిగా రేమాండ్స్ సంస్థను కోర్టు కోరింది. 22న దీనిపై తదుపరి విచారణ జరుగుతుంది.
కొడుకుల కోసం సంపాదించి పెట్టిన రేమాండ్ అధిపతి.. చివరకు అదే డబ్బు కోసం కోర్టులకు వెళ్లడం ఆశ్చర్యమే.
ఎంత కొడుకులు, కూతుళ్ల మీద ప్రేమ ఉన్నా.. ప్రాణం విడిచే వరకు కొంత మొత్తం ఉంచుకోవాలనేది రేమాండ్ అధిపతి జీవితాన్ని చూస్తే అర్థమవుతోంది.
👏

No comments:
Post a Comment