Friday, March 13, 2020

మనస్సును కదిలించే ఆదిశంకరుల మాతృ పంచకం

మనస్సును కదిలించే ఆదిశంకరుల మాతృ పంచకం

🙏 కాలడి లో ఆది శంకరుల తల్లి ఆర్యా౦బ మరణశయ్యపై వుంది. తనను తలుచుకున్న వెంటనే ఆమె దగ్గరకు వచ్చి ఆమెకు ఉత్తరక్రియలు చేశారు. ఆ సందర్భం లో శంకరులు చెప్పిన ఐదు శ్లోకాలు "మాతృపంచకం" గా ప్రసిద్ధమైనవి.

1 .ముక్తామణిస్త్వం నయనం మమేతి
రాజేతి జీవేతి చిరం సుతత్వం
ఇత్యుక్తవత్యా స్తవవాచి మాతః
దదామ్యహం తండులమేవ శుష్కం.
తా:--అమ్మా! నీవు నా ముత్యానివిరా! నా రత్నానివిరా! నా కంటి వెలుగువురా నాన్నా! నువ్వు చిరంజీవిగా వుండాలి. అని నన్ను ప్రేమగా పిలిచిన నీ నోటిలో ఈనాడు కేవలం
యిన్ని శుష్కమైన బియ్యపు గింజలు వేస్తున్నాను. నన్ను క్షమించు.

2 . అంబేతి తాతేతి శివేతి తస్మిన్
ప్రసూతి కాలే యాదవోచ వుచ్యై :
కృష్ణేతి గోవింద హరే ముకుందే
త్యహో జననై రచితోయమంజలి.

తా:--పంటిబిగువున నా ప్రసవకాలములో వచ్చే బాధను ఆపుకోలేని బాధను "అమ్మా!
అయ్యా! శివా! కృష్ణా! హరా! గోవిందా!" అనుకుంటూ భరించి నాకు జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను.

3 . అస్తాం తావదియం ప్రసూతి సమయే
దుర్వార శూలవ్యథా నైరుచ్యం
తను శోషణం మలమయీ శయ్యాచ
సంవత్సరీ ఏకస్యాపినగర్భభార భరణ క్లేశస్య
యస్యాక్షమః దాతుం నిష్కృతి
మున్నతోసి తనయ:తస్యై జననై నమః

తా:-- అమ్మా! నన్ను కన్న సమయం లో నువ్వు ఎంతటి శూల వ్యథను అనుభవించావో కదా! శరీరం కళను కోల్పోయి శుష్కించి వుంటుంది. మలముతో శయ్య మలినమైనా
ఒక సంవత్సరకాలం ఆ కష్టాన్ని ఎలా సహించావో కదా!ఎవరూ అలాంటి బాధను భరించలేరు.ఎంత గొప్ప వాడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా?నీకు నమస్కారం చేస్తున్నాను

4 . గురుకులముపసృ త్యస్సప్న కాలేతు దృష్ట్వా
యతిసముచితవేషం ప్రారుదోత్వముచ్చె:
గురుకుల మథ సర్వ౦ ప్రారుదత్తే సమక్షం
సపది చరణ యోస్తే మాతరస్తు ప్రణామః

తా:--కలలో నేను సన్యాసి వేషం లో కనబడేసరికి బాధపడి, మా గురుకులానికి వచ్చి ఏడ్చావు. ఆ సమయం లో నీ దుఃఖం అక్కడివారందరికీ బాధ కలిగించింది. అంత గొప్ప దానివైన నీ పాదాలకు నమస్కరిస్తుంన్నాను.

5 . న దత్తం మాతస్తే మరణ సమయే
తోయమపివా న్యథా నా నో దత్తా మరణ దివసే
శ్రాద్ధ విధినా న జప్త్యా మాతస్తే మరణ సమయే
తారకనామ మనురాకాలే సంప్రాప్తే మయి కురు దయాం
మాతురు తులామ్

తా:--అమ్మా! సమయం మించిపోయాక వచ్చాను నీ మరణ సమయంలో కొంచెం నీళ్లు
కూడా నేను గొంతులో పొయ్యలేదు. శ్రాద్ధ విధిని అనుసరించి "స్వధా ను" యివ్వలేదు
ప్రాణము పోయే సమయము లో నీ చెవిలో తారకమంత్రాన్ని చదవలేదు. నన్ను క్షమించి, నాయందు దేనితో సమానము కానీ దయ చూపించుము తల్లీ! 🙏

No comments:

Post a Comment