Sunday, March 15, 2020

ఆరోగ్యమే మహాభాగ్యం


🙏ఆరోగ్యమే మహాభాగ్యం - పత్రీజీ🙏

🔸మనిషికి కావలసినవి....
▪శరీరం ద్వారా సుఖం,
▪మనసు ద్వారా సంతోషం,
▪బుద్ధి ద్వారా శాంతం,
▪ఆత్మ ద్వారా ఆనందం.

🔸మనిషి అంటే శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మల నాలుగింటి సముదాయం.

🔸 నిజానికి మనిషికి ఆరోగ్యమే మహా భాగ్యం.

▪శారీరక ఆరోగ్యం అనేది మానసిక ఆరోగ్యం పైన,
▪మానసిక ఆరోగ్యం అనేది బుద్ధి పరమైన ఆరోగ్యం పైన,
▪బుద్ధి పరమైన ఆరోగ్యం అనేది ఆత్మ పరమైన ఆరోగ్యం పైన పరస్పరం ఆధారపడి ఉన్నాయి.

🔸 ఆత్మ పరమైన ఆరోగ్యమే అన్నింటికీ మూలం. ఏ మనిషి యొక్క జీవితంలో ధ్యానం, ఉండదో వారి జీవితంలో ఆత్మ పరమైన ఆరోగ్యం ఉండదు.

🔸అలాంటి పరిస్థితుల్లో బుద్ధి పరమైన ఆరోగ్యం తద్వారా మానసిక పరమైన ఆరోగ్యం మరియు శారీరక ఆరోగ్యం అనేది ఉండదు.

🔸 నూటికి నూరుపాళ్ళు శారీరక అనారోగ్యం మానసిక ఆందోళనల జనితాలే. శారీరక ఆరోగ్యం లేకపోతే ఎంతటి సంపదలు ఉన్నా వాటిని అనుభవించలేము.

🔸 శారీరక ఆరోగ్యం ఉంటే ఏ సంపదలు లేకపోయినా పర్వా లేదు.

ఆత్మ పరమైన ఆరోగ్యం = ధ్యానం + అహింస

ధ్యానం సర్వరోగ నివారిణి.
ధ్యానం సర్వ భొగ కారిణి.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂

No comments:

Post a Comment