భారత దేశం ఎన్నో అద్భుతాలకు నెలవు. ముఖ్యంగా ఉత్తరాన్న ఉన్న హిమగిరులను మన దైవంగా భావిస్తాం. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగానది పుట్టింది కూడా ఇక్కడే. ఆ పరమ శివుడు కొలవైన కైలాశ పర్వతం మన దేశ పరిధిలో లేకున్నా.. ఎంతో మంది భారతీయులు ఆ పరమేశ్వరుడి దర్శనం కోసం అక్కడి వెళ్తుంటారు. అయితే, అక్కడ కేవలం కైలాశ పర్వతమే కాదు.. కంటికి కనిపించని ఓ రహస్య నగరం కూడా ఉందనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. అదే శంబళ నగరం. విష్ణు పురాణాలను చదివినవారికి ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. దీని గురించి అందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. 'కలి' ఆగడాల నుంచి 'కల్కి' అవతారం చాలించేవరకు ప్రతి ఒక్క ఘటన ఈ శంబళ నగరం కేంద్రంగానే చోటుచేసుకున్నాయి.ఇంతకీ శంబళ అంటే ఏమిటీ? ఈ నగరం ఎక్కడ ఉంది? దీన్ని ఎవరు నిర్మించారు? విష్ణు పురాణాలకు, ఈ నగరానికి సంబంధం ఏమిటీ?
హిట్లర్ ఈ నగరంపై ఎందుకు మనసుపడ్డాడు? ఆ నగరం ప్రత్యేకత ఏమిటీ? ఇప్పటికీ ఆ నగరం రహస్యంగానే ఎందుకు ఉంది? దీన్ని చూసిన వ్యక్తులు ఏం చెప్పారు?
ఆ నగరంలో ఏం ఉన్నాయి? తదితర ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి ఈ కథనాన్ని చివరి వరకు మిస్ కాకుండా చదవండి. ఈ నగరం గురించి తెలుసుకొనే ముందు మనం ఒకసారి విష్ణు పురాణాల్లోని కలి ప్రభావం, కల్కి అవతారాల గురించి తెలుసుకోవాలి. శంబళ అనేది సంస్కృత పదం.
టిబెట్‌లో దీన్ని షాంగ్రిల్లా అని అంటారు హైందవ పురాణాల్లో దీన్ని సిద్ధశ్రమంగా పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టపం అని కూడా అంటారు. త్రివిష్టకం అంటే సంస్కృతంలో స్వర్గం. శంబళలో కూడా దేవతలు తిరుగుతారనే ఉద్దేశంతో దీన్ని భూలోక త్రివిష్టపం అని పిలిచేవారు.
ఆ పేరే ఇప్పుడు అనేక రకాలుగా మార్పులు చెంది టిబెట్‌గా మారింది. టిబెట్ మన ఇండియాకు ఉత్తర దిక్కున ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని 'రూప్ ఆఫ్ ది వరల్డ్' అని కూడా అంటారు. ఎత్తైన పీఠభూములు గల ఈ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువ నివసిస్తుంటారు.
దీని సరిహద్దులోని చైనా భూభాగంలో ఉన్న కైలాశ పర్వతం, మానస సరోవరం సమీపంలోనే రహస్య నరగం శంబళ ఉంది. దీన్ని కేవలం కొంతమంది మానవులు మాత్రమే వీక్షించగలరు, ప్రవేశించగలరు. వారికి ఎలాంటి లక్షణాలు ఉండాలనేది మున్ముందు చూద్దాం. ఇప్పుడు..
ఈ నగరం ఎలా ఏర్పాటైందనే విషయాన్ని తెలుసుకుందాం. అగస్త్యుడు, వశిష్టుడు, మార్కండేయ, జమదాగ్ని, విశ్వమిత్రుడు, అవ్వద్ధామా వంటి మహారుషుల నుంచి నేటి అచ్చుతానంద, విశుద్దానంద, మౌనస్వామి తదితర యోగులు, రుషులు ఇక్కడే తప్పసును ఆచరించారు. అంతేకాదు, అత్యంత పవిత్రమైన శంబళ నగరాన్ని కనులారా వీక్షించారు. మన పురాణాల్లో శ్రీరామయణ బాలకాండలో విశ్వ మిత్రుడు రామలక్ష్మణులను యాగం కోసం అడవులకు తీసుకెళ్తూ..
సిద్దాశ్రమానికి తీసుకెళ్తాడు. వారితో తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదిస్తాడు. మహాభారతంలో పాండవులు సైతం ఈ రహస్య ప్రాంతానికి చేరినట్లు ఆధారాలు ఉన్నాయి. పూర్వం ఒక రాజు రుషులతో మహా యాగం నిర్వహించి వారికి అనేక బంగారు ఆభరణాలు, వేదికలు, మండపాలను దానమిస్తారు.
రుషులు వాటిని ధరించలేరు కాబట్టి.. రహస్యంగా ఒక ప్రాంతంలో దాచిపెట్టాలని నిర్ణయించుకుంటారు. ఇందుకు పరమశివుడిని ప్రార్థించి ఒక ప్రాంతంలో దాచిపెడతారు. శివుడి అనుగ్రహం లేకుండా అక్కడికి ఎవరూ చేరలేరు.
అయితే, ధర్మరాజు శివుడు ఆశీస్సులు పొంది రుషులు దాచిన ఆ రహస్య ప్రాంతానికి చేరుకుని సంపదను పొందుతాడని పురాణాల్లో పేర్కొన్నారు. విష్ణు పురాణంలోని కల్కీ అధ్యయనంలో శంబళ గురించి వివరించారు. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత కలి ప్రవేశిస్తుంది. ఆ కాలంలో అధర్ముడు, అసత్య అనే దంపతులకు అంబుడు, మాయ అనే కుమారుడు, కుమార్తె జన్మిస్తారు.
ఆ అన్నా చెల్లెల్లు పెద్దవాళ్లై ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు. ఫలితంగా క్రోదా, హింసా అనే పుత్రుడు, పుత్రిక పుడతారు. వారు కూడా తమ తల్లిదండ్రుల్లాగానే ఒకరినొకరు పెళ్లి చేసుకుని కలి అనే పుత్రుడికి జన్మనిస్తారు. అతడే..
కలియుగానికి అధిపతి అవుతాడు. ఇతడి ఆధీనంలో ఉన్న కలియుగంలోనే మనం జీవిస్తున్నాం. 'కలి'కాలంలో అధర్మం, అన్యాయాలు పెచ్చుమీరుతాయి. నూనె కారుతున్నట్లుగా ఉండే నల్లని శరీరం, కాకి వంటి కడుపు, నల్లని సొరంగం వంటి నోరు, ఎర్రని మిడిగుడ్లతో ఉండే కలి శరీరం నుంచి నిత్యం అశుద్ధపు దుర్వాసన వస్తుంది.
జూదం, మద్యపానం, స్త్రీలతో సంపర్కం వంటి అవలక్షణాలతో కలి లోకాన్ని పాలిస్తుంటాడు. కలి పాలన వల్ల లోకమంతా పాపులతో నిండిపోతుంది. దైవాన్ని చిన్నచూపు చూస్తారు. నాస్తికులు పెరిగి దైవారాధన అంతరించిపోతుంది.
ఎవరితై కిరాతకమైన బుద్ధులతో ఉంటారో.. వాళ్లలోకి కలి ప్రవేశించి నిచమైన పనులు చేయిస్తుంటాడు. అలా నాలుగు పాదాలుగా మానవ లోకం పాపాల పుట్టగా మారి.. ప్రజలు క్షుత్ర పూజలతో ప్రతికూల శక్తులను పూజించడం మొదలుపెడతారు.
దీంతో దేవతలు శ్రీమహా విష్ణువును ఆశ్రయించి లోకాన్ని రక్షించాలని వేడుకంటారు. ఈ మేరకు శ్రీవిష్ణువు దేవతాలకు ధైర్యం చెబుతూ.. భరతవంశంలో శంబళ అనే నగరంలో జన్మిస్తానని చెబుతాడు. ఆ నగరంలో విష్ణుయశుడు, సుమతి అనే పవిత్రమైన దంపతులకు పుత్రుడిగా జన్మిస్తానని చెబుతాడు.
లక్ష్మీ దేవి సింహళ ద్వీపంలో పద్మావతిగా అవతరిస్తుందని పేర్కొంటాడు. ఇచ్చిన మాట ప్రకారం విష్ణుయశుడు, సుమతిలకు నాలుగు చేతులతో మహావిష్ణువు జన్మిస్తాడు. పవిత్ర గంగా ప్రక్షాళనతో ఆ నాలుగు చేతులు రెండు చేతులవుతాయి. మృత్యుంజయుడైన మార్కండేయుడు కల్కీ అని నామకరణం చేస్తాడు.
ఉపనయనం తర్వాత కల్కీ తండ్రి వద్ద సెలవు తీసుకుని.. శాస్త్ర విద్య, వేదాలు నేర్చుకోవడానికి ప్రయాణమవుతాడు. మార్గ మధ్యలో పరశురాముడు కనిపించి కల్కీని మహేంద్ర గిరికి తీసుకెళ్తాడు. అక్కడ 64 నాలుగు విద్యలను కేవలం 4 నాలుగు నెలల్లోనే నేర్చుకుంటాడు కల్కీ.
అనంతరం కల్కీ బిల్వోదక క్షేత్రానికి చేరకుంటాడు. అక్కడ శివుడిని ప్రార్థించి సాక్షాత్కరం పొందుతాడు. ఈ సందర్భంగా శివుడు కల్కినీ తన ఒడిలో కూర్చొబెట్టుకుని జన్మ రహస్యం చెబుతాడు. కలికాలంలో పాపాలను అంతం చేయడానికి ఈ అవతారంలో జన్మించావని చెప్పడంతంతోపాటు దివ్యశక్తులు గల గరుడ అశ్వాన్ని బహూకరిస్తాడు.
అనంతరం రత్నపు పిడికిలి గల కడ్గాన్ని అందిస్తాడు. ఈ నేపథ్యంలో కల్కీ సింహళ ద్వీపానికి చేరుకుని పద్మావతిని పెళ్లి చేసుకుంటాడు. అక్కడి నుంచి శంబళకు తిరుగు ప్రయాణమవుతాడు. అప్పటికి శంబళ నగరం రూపురేఖలు మారిపోయాయి.
ఎత్తైన భవనాలు, ఉద్యానవనాలతో అలరారుతుంది. సరస్సులు, సరోవాలతో ఎంతో అందంగా అహ్లాదకరంగా కనిపిస్తుంది. ఒకప్పుడు చిన్న గ్రామంలో ఉండే ఆ ప్రాంతాన్ని విశ్వకర్మ నగరంగా తీర్చిదిద్దడంతో శంబళ సర్వంగా సుదరంగా తయారువుతుంది. అయితే, పాపుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాదు.
దీంతో కల్కీ అక్కడ అధర్ములను సంహరించి ధర్మ సంస్థాపన చేస్తాడు. ఈ నేపథ్యంలో దేవతలు శంబళకు వచ్చి కల్కిని దర్శించుకుంటారు. తిరిగి వైకుంఠానికి రావాలని ప్రార్థిస్తారు. దీంతో కల్కీ సత్యయుగ స్థాపన చేసి గంగానది తీరంలో కల్కీ అవతారం చాలిస్తాడు.
విష్ణువుగా వైకుంఠానికి చేరుకుంటాడు. ధర్మానికి కేంద్రం మారిన శంబళ అప్పటి నుంచి సాధారణ మానవులకు కనిపించకుండా అదృశ్యమవుతుంది. కలి ప్రభావం వల్ల పాపులుగా మారే మానవులకు ప్రవేశం లభించదు. ఈ నగరాన్ని చూడాలంటే..
ఆ మానవుడు ఎంతో స్వచ్ఛమైన మానవుడై ఉండాలి. సత్యం, ధర్మం, అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే శంబళ నగరాన్ని చూసే భాగ్యం దక్కుతుందని పురాణాల్లో పేర్కొన్నారు. అందులో చెప్పినట్లే కొందరు సాధారణ వ్యక్తులు శంబళ నగరాన్ని చూసి రావడం గమనార్హం. ఎప్పటికీ అదృశ్య రూపంలో ఉండే ఈ మాయ ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులభమైన పనికాదు.
మానవ శరీంలో ఉండే సుశుమ్న నాడీ తెరుచుకున్నవారికి మాత్రమే శంబళ నగరంలోకి ప్రవేశం లభిస్తుంది. ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యం. కొందరు ఈ జన్మలో పుణ్యకార్యాలు చేసినా.. పూర్వ కర్మల వల్ల శంబళకు వెళ్లే దారి కనుగోలేరు.
చిత్రం ఏమిటంటే.. ఈ సైన్స్ యుగంలో కూడా కొందరు శంబళలోకి ప్రవేశించి.. అక్కడి అద్భుతాలను చూసి వచ్చారు. ఇందుకు వారి వద్ద తగిన ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
మరి శంబళ నగరాన్ని చూసిన ఆ వ్యక్తులు ఎవరో చూసేద్దామా! 1889లో జన్మించిన ఆనందమయి హిమాలయాల్లో సుమారు 20 నుంచి 25 అడుగుల ఎత్తు గల మనుషులను చూశామని చెప్పడం గమనార్హం. వారంతా 5 వేల ఏళ్ల నాటి ద్వాపర యుగానికి చెందిన మనుషులని పేర్కొన్నారు. రష్యాకు చెందిన హెలీనా హిమాలయల్లోని అతి రహస్యమైన ప్రదేశాల అన్వేషణలో భాగంగా ఆమె శంబళకు చేరుకున్నారు.
ఆనందమయి చెప్పినట్లే ఆమె ద్వాపర యుగం నాటి మనుషులను చూశానని తెలపడం గమనార్హం. ఈ విషయాన్ని ఆమె రాసిన ఐసీస్ అన్‌వీల్డ్(ISIS Unveiled), ది సీక్రెట్ డాక్టరినే (The Secret Doctrine)లో రాశారు. వారితో ఉన్న కొన్ని ఫొటోలను కూడా ఆ పుస్తకంలో ప్రచురించారు. ఈ పుస్తకాలను మీరు ఆన్‌లైన్ పోర్టల్‌లో కూడా కొనుగోలు చేయొచ్చు.
తమిళనాడులోని కుర్తలానికి చెందిన మౌనస్వామి కూడా శంబళ సిద్ధాశ్రమంలో తపస్సు చేశారు. 1974లో నికోలస్ రోరిట్చ్ అనే ఒక రష్యా పరిశోధకుడు శంబళ నగరంపై అధ్యయనాలు చేసి పలు రహస్యాలను తెలుసుకున్నాడు. ఆయన పరిశోధనల ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారాయి. దీంతో శంబళ నగరం గురించి జర్మనీ నియంత అడల్ఫ్ హిట్లర్‌కు కూడా సమాచారం అందింది.
అల్టిమా తులే అనే టీమ్‌ను హిట్లర్ హిమాలయాలకు పంపి పరిశోధనలు చేయించాడు. అయితే, వారి శ్రమ ఫలించలేదు. శంబళ నగరాన్ని కనుగొనలేక వెనుతిరిగారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ శంబల నగరాన్ని చూసిన వ్యక్తుల్లో ఒకరు వడ్డిపర్తి పద్మాకర్.
1980లో ఆయన హిమాలయాల్లోని ఓ గుహలో కఠోర తపస్సు చేస్తున్నప్పుడు విపరీతమైన మంచు తుఫాన్ ఏర్పడిందని, ఆ వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్న సమయంలో ఓ సుమారు 20 అడుగుల ఎత్తైన వ్యక్తి తన తలను పట్టుకుని జనావాసాలు ఉన్న ప్రాంతంలో వదిలి వెళ్లిపోయాడని ఆయన తెలిపినట్లు సమాచారం. దివ్యదృష్టి గల వ్యక్తులకు శంబళలోకి ప్రవేశం సులభమని, ఇది కేవలం యోగసాధానతోనే సాధ్యమని పురాణాల్లో పేర్కొన్నారు. అయితే, ఇప్పటివరకు వెళ్లిన వ్యక్తులు కేవలం శంబళ నగరంలో మనుషులను మాత్రమే చూసి వచ్చినట్లు తెలుస్తుంది. అసలైన రహస్య నగరంలోకి అడుగుపెట్టడం వారికి సాధ్యం కానట్లు సమాచారం.
శంబళ నగరం మానస సరోవరం, కైలాశ పర్వతానికి అతి సమీపంలో అదృశ్య రూపంలో దాగి ఉంది. ఎంతోమంది భక్తులు అక్కడ తాము దేవతలను చూశామని చెబుతుంటారు. ముఖ్యంగా పూర్నిమ నాడు మానస సరోవరానికి దేవతలు దిగివస్తారని, ఆ సమయంలో ఆకాశంలో దివ్యకాంతులు కనిపిస్తాయని చెబుతుంటారు. టిబేట్ బౌద్ధకాల చక్రం, భారతీయ పురాణాల ప్రకారం..
శంబళ నగరం చుట్టూ ఎనిమిది రేకుల కమలం ఆకారంలో పర్వతాలు ఉంటాయి. మధ్యలో స్పటిక శ్రీచక్రం ఉంటుంది. దాని చుట్టూ గొలుసుకట్టుగా పర్వతాలు ఉంటాయి. శంబళ రాజధాని పేరు కలాపా.
స్పటిక శ్రీచక్ర భవనంలో ఒక భూగ్రమం నమూనా ఉంటుంది. అది తిరబడిన పిరమిడ్ తరహాలో ఉంటుంది. అందులోకి వెళ్లేందుకు కొన్ని సొరంగాలు ఉంటాయి. అందులో కోటి సూర్యకాంతుల కాంతితో సమానమైన చింతామని అనే దివ్యమణి ఉంటుంది.
అది దాదాపు పనస కాయ సైజులో గణీభవించిన పాదరసంలా గడ్డకట్టినట్లుగా ఉంటుంది. సప్తరస దాతువులతో ఏర్పడిన ఈ మణి గురించి రష్యా పరిశోధకుడు నికోలస్ కూడా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఈ మణికి అర్థ చంద్రాకారంలో ఒక ముఖం ఉంటుంది. పెదవులు తెరిచినట్లుగా ఒక ద్వారం ఉంటుంది.
సిద్ధ రుషులు దానికి నిత్యం శివ, విష్ణు మంత్రాలతో అర్చన చేస్తారు. ఆ మణి కోరిన వరాలు ఇస్తుందని ప్రతీతి. భవిష్యత్తులో దాన్ని కల్కీ భగవానుడు ధరిస్తాడని పురాణాల్లో ఉంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే..
ఈ సృష్టి పుట్టిన రోజు నుంచి అనేక కాలాల వరకు వివిధ రుషులు లిఖించిన గ్రంథాలన్నీ ఇక్కడ భద్రంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న తాళపత్రాలు మొత్తం 18 సంపుటాలుగా విభజించి భద్రపరిచినట్లు సమాచారం. టిబెట్ బౌద్ధ సన్యాసులు సైతం శంబళి నగరం గురించి చెబుతుంటారు. మణి పద్మహం అనే మంత్రాన్ని వీరు నిత్యం జపిస్తారు.
అయితే, శంబళి నగరం నిజంగానే ఉందా? దాన్ని చూశామని చెబుతున్నా వ్యక్తుల వాదనతో ఏకీభవించా అనేది ప్రత్యక్షంగా చూస్తేగానీ చెప్పలేం. శంబళి నగరం అనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీనే

No comments:
Post a Comment