Saturday, April 4, 2020

గురుగ్రహ-దోష నివారణకు హయగ్రీవస్తోత్రం

శ్రీనివాససిద్ధాంతి9494550355


గురుగ్రహ-దోష నివారణకు హయగ్రీవస్తోత్రం..

జాతకంలో గురుగ్రహ దోషం ఉన్నవారు మరియు గురుగ్రహ అనుగ్రహం కొరకు ప్రతిరోజు హయగ్రీవ స్తోత్రం చదివితే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది.భక్తి బావనలు, ఉన్నత విద్య,విదేశి విద్య కలగాలంటే గురుగ్రహ అనుగ్రహం ఉండాలి.గురుగ్రహానికి అధిదేవత హయగ్రీవుడు.

సకల విద్యాధి దేవతయైన శ్రీమన్నారాయణుడు ‘హయగ్రీవుని’గా అవతరించాడు.సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుండి విద్యాశక్తిని సముపార్జించారని ‘హయగ్రీవ స్తోత్రం’లో దేశికాచార్యులు పేర్కొన్నారు.హయగ్రీవోపాసన వాక్‌శక్తిని, విద్యాశక్తిని, జ్ఞానశక్తిని సిద్ధింపచేస్తుంది.

జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్
ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే

జ్ఞానం, ఆనందం, మూర్త్భీవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారము.

హయగ్రీవుని పూజించడంవల్ల విద్య, ఐశ్వర్యం, అధికారం, ఆయువు మొదలైనవన్నీ లభిస్తాయి. విద్యార్థులు హయగ్రీవుని పూజించడంవల్ల చదువు బాగా వస్తుంది.పిల్లలున్న ఇంట హయగ్రీవ పూజ పిల్లలకు విద్యాటంకాలు తొలగించి, ఉన్నత విద్యను అందిస్తుంది.

హయగ్రీవస్తోత్రం

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం |
నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః||

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ |
తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్మా ప్రవాహవత్||

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోధ్వనిః |
వి శోభతే చ వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వనిః||

ఫలశ్రుతి :
శ్లోకత్రయ మిదం దివ్యం హయగ్రీవ పదాంకితం |
వాదిరాజయత్రిప్రోక్తం పఠతాం సంపదాంప్రదం||

శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల్లో హయగ్రీవావతారం ఎంతో విశిష్టమైనది. హయగ్రీవస్వామిని ఆరాధిస్తే అనంత జ్ఞానం లభిస్తుంది. ఆ స్వామి అనుగ్రహం ఉంటే దక్కనిదేదీ ఉండదు... అని వివరించే కథా సందర్భం ఇది. ఇది నారద మహా పురాణం పూర్వభాగం బృహదుపాఖ్యానంలో సనత్కుమార విభాగ అంతర్గతంగా గల తృతీయపాదంలో ఉంది. హయగ్రీవుడిని ఏ మంత్రాలతో ఉపాసించాలి? ఎంత జపం, ఎలా చేయాలి? దానివల్ల ఉపాసకుడు పొందే లాభాలేమిటి? అనే విషయాల్ని సనత్కుమార మహర్షి ఇలా వివరించాడు.

‘ఓం విష్ణవే సురపతయే మహా బలాయస్వాహా’ అనేది హయగ్రీవ స్వామికి సంబంధించిన మంత్రం. దీనికి చంద్రుడు ముని. విరాట్‌ ఛందస్సు. దధివామనుడు దేవత. తారము బీజం, స్వాహా శక్తి. ఈ మంత్రాన్ని సద్గురువు వద్ద స్వీకరించి అంగన్యాస, కరన్యాస పూర్వకంగా గురువు చెప్పిన పద్ధతిలో చేయాలి.

ముత్యాల కాంతితో ఉండే రత్నభూషణాలు కలిగినవాడు, చంద్రస్థుడు, తుమ్మెదల వంటి ముంగురులు కలవాడు, పవిత్ర జలంతో నింపిన కుంభాన్ని, దధ్యోదన(పెరుగన్నం) పాత్రను ధరించిన హయగ్రీవస్వామిని మంత్రజప సమయంలో ధ్యానించాలి. ఈ మంత్రాన్ని మూడులక్షల సార్లు జపించాలి. ఆ తర్వాత జపం చేసిన సంఖ్యలోని పదోవంతులో నేయి కలిపిన పాయసాన్నం, దధ్యోజనంతో యథావిధిగా హోమం చేయాలి. తరువాత స్వామి మూర్తి ఉంచిన పీఠాన్ని పూజించాలి. ఇలా పూజించేటప్పుడు మూలమంత్రంతో మూర్తిని సంకల్పించాలి. ఆ తర్వాత పీఠం మీద ఉన్న పద్మదళాలు, కేసరాలతోను పూజించాలి. కేసరాల్లో షడంగాలను దిక్కుల వైపునకు ఉన్న పద్మదళాల్లో వాసుదేవుడిని, సంకర్షుడిని, ప్రద్యుమ్నుడిని, అనిరుద్ధుడిని, దళాల కోణాల్లో శాంతిని, శ్రీని, సరస్వతిని, రతిని అర్చించాలి. అష్టదళాల్లో ధ్వజాన్ని, గరుత్మంతుడిని, కౌస్తుభాన్ని, వనమాలిని, శంఖ, చక్ర, గద, సారంగ ధనుస్సుల్నీ పూజించాలి. పద్మదళాల అగ్రభాగాల్లో కేశవాదులను, దిక్పాలకుల్ని ఆ తర్వాత వారి అస్త్రాల్ని సంకల్పించి పూజించాలి.

అష్టదిగ్గజాలైన ఐరావతం, పుండరీకం, వామనం, కుముదం, అంజనం, పుష్పదంతం, సార్వభౌమం, సుప్రతీకం అనే గజాల్ని, వరుసక్రమంలో ఆ గజాల పత్నులైన అభ్రం, కపిల, పింగళ, అనుపమ, తామ్రకర్ణి, శుభ్రదంతి, అంగన, అంజనావతి అనే గజాలను పూజించాలి. ఇలా మంత్ర జపాన్ని చేస్తే మనోభీష్టాలు నెరవేరతాయి. హయగ్రీవస్వామిని ఉపాసించటానికి చాలా మంత్రాలు ఉన్నాయి. వాటి జప విధానం, వాటితో చేసే హోమద్రవ్యాలు, హోమాల గురించి సద్గురువులను, పండితులను అడిగి తెలుసుకొని ఉపాసన, హోమాల్ని చేయాలి. వీటిని సక్రమమైన తీరులో చేసినప్పుడు ఉపాసకుడు శాస్త్ర జ్ఞానాన్ని, సంపదలను, మంచి వాక్‌శుద్ధిని పొందుతారని, సర్వ వేద ఆగమ వ్యాఖ్యాతగా ప్రసిద్ధికెక్కుతారని సనత్కుమార మహర్షి వివరించాడు

మీ జాతకమును తెలుసుకొనుటకు ఈ క్రింది నెంబర్ ను సంప్రదించండి.

లక్ష్మీ లలిత వాస్తుజ్యోతిష నిలయం.
స్వర్ణ కంకణ సన్మానిత.
జ్యోతిషరత్నశ్రీనివాస సిద్ధాంతి
9494550355

No comments:

Post a Comment