Sunday, April 19, 2020

ఒక దేశ అధ్యక్షుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎం జరుగుతుందో తెలపడం కోసమే ఈ పోస్ట్...

ట్రంపు నోటికి ఓ గుడ్డముక్క అవసరం !!

సమస్యను పరిష్కరించటం చేతకానప్పుడు,

సమాధానం చెప్పుకోవటానికి కూడా వీలు కానంత వైఫల్యం కమ్ముకొచ్చినప్పుడు

చేతులు రెండూ జోడించి,
తల వినమ్రంగా కిందికి దించుకొని...

దేశానికి మనసారా క్షమాపణలు చెప్పుకోవటం కనీసంలో కనీసం ధైర్యవంతుడి లక్షణం!
బాధ్యత కూడా !!


అమెరికా అధ్యక్షుడు తక్షణం చేయాల్సిన పని అది.

కానీ, తప్పును ఒప్పుకొని లెంపలు వేసుకుంటే అతడు ట్రంప్ ఎందుకు అవుతాడు?

అందుకనే
అడ్డదిడ్డంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మీద ఎగురుతున్నాడు.

తన వదరుబోతు తనంతో అమెరికా ప్రజలను కోవిడ్ 19 బలిపీఠం మీదకు ఎక్కించి
అదంతా WHO వైఫల్యంగా ఇప్పుడు నోరు పారేసుకుంటున్నాడు.

ఏ సాధారణ వైద్యుడిని అడిగినా

ఇప్పుడు చాలా దేశాలు పాటిస్తున్న
"ముక్కులు మూసుకోండి .. తలుపుల వెనకాల దాక్కోండి " అని సలహా ఇస్తారు.


ఇది ఆనుపానులు తెలియని కొత్త వైరస్ కాబట్టి, దానికింకా విరుగుడు మందు దొరకలేదు కాబట్టి

కనీస ఆరోగ్య సూత్రాల ప్రకారం పాటించాల్సిన కనీస జాగర్త అది!

మరి పేరెన్నిక గన్న పెద్ద దేశం అధిపతికి ఆపాటి జ్ఞానం ఎందుకు లేదు?

అసలు ఎవరి సలహా అయినా వినే కనీస జ్ఞానం ట్రంప్ కి ఉందా ?
కనీస విచక్షణ ఉందా?

లేదు.

ఆ కనీస జ్ఞానం కనీసంగా కూడా లేదు.
అందుకనే
అతగాడి హయాంలో కాస్త జ్ఞానం ఉన్న అనేకమంది
అతడి సలహా బృందాల నుంచి తప్పుకొని వెళ్లిపోయారు!

అమెరికాలో కరోనా కలకలం మొట్టమొదట బయటపడింది జనవరి రెండోవారంలో !

దాదాపు అదే సమయంలో ఏడు కిలోమీటర్ల అడ్డుగోడ దాటుకొని అందాల బొమ్మల్ని ఆస్వాదిస్తూ
ఇండియా లో పర్యటించి
లక్షల మంది ఘనంగా ఆహ్వానం పలికిన గొప్ప సభలో కూడా పాల్గొన్నాడు!

అసలు ఆ సభకు లక్షల జనం కన్నా తగ్గితే ఊరుకునేది లేదని కూడా శ్వేతసౌధంలో నుంచి గట్టిగా హూంకరించాడు!

ఆ తరువాతి కాలంలో "విపత్తు ముంచుకొస్తుంది స్వామీ" అని సొంత దేశంలోని విజ్ఞులు విన్నవించబోతే
ససేమిరా అలాంటిదేమీ లేదన్నాడు.
లాక్డౌన్ అవసరం లేదన్నాడు.
మాస్కులు "మీరు కట్టుకుంటే కట్టుకోండి ..
నేనసలు కట్టుకోను" అన్నాడు.

అమెరికాలో లక్షల మంది చచ్చిపోతారని ముందే ప్రకటించిన
తానో దద్దమ్మ అని చాలామంది చేత అనిపించుకున్నాడు ..

ఇప్పుడు చైనా మీదా, ప్రపంచ ఆరోగ్య సంస్థ మీద నెపం నెట్టేసి

తాను చేతకానితనం నుంచి బయటపడాలని బడుద్దాయితనం ప్రదర్శిస్తున్నాడు !

అహంకారీ ..
ఓ చిన్ని వైరస్ గురించి తెలీలేదా ?
నీ కళ్ళ ముందే మూడు నెలల పాటు
రోగంగా, ఘోరంగా, మృత్యువుగా, కట్టడి చేయాల్సిన అనుభవంగా,
చాలా చాలా బహిరంగంగా
నీ మీడియా ఏజెన్సీల వార్తలుగా, ప్రత్యేక కథనాలుగా
పుంఖానుపుంఖంగా సమాచారం లోకం మొత్తంగా ప్రవహిస్తుంటే

గర్వంతో, కండకావరంతో, అహంకారంతో, అజ్ఞానంతో
కళ్ళు మూసుకొని ....

ఇప్పుడు నట్టింట దారుణాతి దారుణంగా చావుకేకలు వినిపిస్తుంటే
ఇప్పుడు కళ్ళు తెరిచావా?

మంచిది !
ఇప్పటికైనా తెరుచుకున్నందుకు సంతోషం !

కానీ, ఇకనైనా వాగాడంబరం కట్టిపెట్టు ..
ఏమి చేయాలో అది చెయ్యి ..
బెదిరింపులూ అదిలింపులూ నిన్ను రక్షించలేవు.

కాస్త
చేతులొగ్గి ప్రార్థించు .. అర్థించు ..

అప్రమత్తం అయిన దేశాల సలహాలు తీసుకో !
నీ చుట్టూనే ఉన్న వైద్యుల మాట విను. తలకెక్కించుకో !

కొద్దికాలం మీ అంతర్జాతీయ లాభాల రాబందుల మాట వినటం మానెయ్యి !

విన్నావంటే
వాళ్ళు నీచేత శవపేటికలు తయారు చేపిస్తారు !
ఇప్పుడు అవసరం, అవి కాదు !
కాస్త జ్ఞానం .. కాస్త వైద్యం .. కాస్త మానవత్వం కావాలి !!

ఎవరినో నిందిస్తూ సమయం వృథా చేయకు ట్రంప్ !

ముందు నీ చేతులు కడుక్కో ...
ముఖ్యంగా నీ వాగుడు నోటికి అడ్డంగా ఓ గుడ్డముక్క కట్టుకో !!


ఇది సేకరణ...!!

No comments:

Post a Comment