Thursday, November 5, 2020

వాగ్భూషణం

వాగ్భూషణం....

ప్రియ వాక్య ప్రదానేన ౹
సర్వే తుష్యన్తి జంతవ:౹
తస్మా త్తదేవ వక్తవ్యం ౹
వచనే కా దరిద్రతా? ౹౹

మనిషికి భగవంతుడు ప్రసాదించిన అపురూప వరం మాట.

మంచి మనసుతో ఆప్యాయంగా, ప్రియంగా మాట్లాడిన మాటలే ఆప్తులకు, ఆత్మీయులకు వరాల మూటలై మరింత సన్నిహితం చేస్తాయి.

నెయ్యానికి, వియ్యానికి, సిరులు పండడానికి కారకము లవుతాయి.

మాటలు పరుల ఉల్లాలను పల్లవింపజేస్తాయి. హృదిని, మదిని పరవశింపజేస్తాయి.

ఆ మాటే ఒకింత కటువైతే, కయ్యానికి కాలుదువ్వుతూ, అందరినీ దూరం చేస్తుంది కూడ.

కావున ప్రేమగా, మృదువుగా మాట్లాడాలి. భగవద్దత్తమైన మాటలకు దరిద్రం లేదు గదా!

"మధుర భాషణమున మర్యాద ప్రాప్తించు" అన్నాడు కరుణశ్రీ.

"వాగ్భూషణం భూషణం"అన్నాడు భర్తృహరి.

మహనీయుల మాట మౌనం అనే మూసలో పోసిన బంగారంలా ఉంటుంది.

అందుకే వారి మాటలకు ఎంతో విలువ సమకూరుతుంది.

అదుపులేకుండా వాగడం మహాతప్ఫు . మాటను తక్కెడలో పెట్టి తూచినట్లు మాట్లాడమంటారు విజ్ఞులు.

కటువుగా, అతిగా మాట్లాడేవారి పట్ల ఎవ్వరికీ గౌరవం ఉండదు. చెడ్డ మాటలు వెలువడకుండా ఉండాలంటే దానికి మౌనమే సరైన మందు అంటారు తత్త్వవేత్తలు.

‘ఎదుటివారు మనల్ని అర్థం చేసుకొనేందుకు ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడండి. అధిక ప్రసంగం తగదు’ అంటూ రామకృష్ణ పరమహంస తనను కలిసేందుకు వచ్చిన భక్తజనంతో చెబుతుండేవారు.

మాటకు ప్రాణం సత్యం. ఇది యుగాల పూర్వమే హరిశ్చంద్ర చక్రవర్తితో నిరూపితమైంది.

సత్యవచనం కారణంగానే ఆయన పేరు సత్యహరిశ్చంద్రుడని శాశ్వతంగా నిలిచిపోయింది.

మాటల్లో అబద్ధాలు దొర్లకూడదు. అబద్ధం మాట్లాడి నోరు కడుక్కోవడం కన్నా మౌనంగా ఉండటమే ఉత్తమం అన్నది జ్ఞానుల ఉవాచ.

మాట ప్రభావం అద్భుతం.
అది మనిషి మనసుకు అద్దం పట్టగలదు. అడ్డంగా నిలువగలదు.

కొంపలు కూల్చగలదు. కుటుంబాలను రక్షించగలదు.

శిశిరంలో వసంతాన్ని సృజియించగలదు. పెదవి వదిలితే పృథివి దాటిపోగలదు.

ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్నయినా వెనక్కి మళ్ళించవచ్చునేమోగాని- పెదవి దాటిన మాటను బ్రహ్మదేవుడైనా వెనక్కి మళ్ళించలేడు. మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలని పెద్దలు హెచ్చరించి మరీ చెబుతుంటారు. సందర్భశుద్ధి కలిగిన మాటకే విలువ, మన్నన ఉంటుంది.

మాట, దాని అర్థం ఎలా పెనవేసుకొని ఉంటాయో మహాకవి కాళిదాసు

వాగర్దావివ సంపృక్తౌ వాగర్దప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ...

అంటూ శ్లోకరూపకంగా వివరించి చెప్పాడు.

ఔచిత్యం అనే తక్కెడలో పెట్టి తూచినట్లు మాట్లాడటం ఓ కళ. నోటికి వచ్చినట్లు వాగడం ఓ రోగం. చెడ్డ మాటలతో చెడు ఫలితమే వస్తుంది. మంచి చేకూరదు.

రామాయణంలో మంథర మాటలకు చెవొగ్గిన కైకేయి ఆ తరవాత ఎంత పశ్చాత్తాపం చెందిందో తెలియనిది కాదు.

తీయని మాటలతో మన వెనకాలే గోతులు తీసేవారు ఎంతో మంది ఉంటారు.

మాటతీరు మనిషి సంస్కారానికి సూచిక. కార్యసాధనకు పనిముట్టు. ఆకర్షణకు అద్భుత మంత్రం. అందుకే మనిషి మంచి మాటతీరును అలవరచుకోవాలి.

మన మాటతీరు ఎదుటివారికి కంటిలో నలుసులా, పంటి కింద రాయిలా బాధపెట్టే విధంగా ఉండకూడదు.

మంచి గంధం పూసినంత హాయి కలిగించాలి.

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది.
మంచి మాటకు మన్నన ఉంటుంది ....

Source - Whatsapp Message

No comments:

Post a Comment