Monday, December 21, 2020

పూజ మన మనసును బాగు చేసుకునే సాధనమే గానీ....

🙏పూజ🙏

✍️ మురళీ మోహన్

🤘పూజ మన మనసును బాగు చేసుకునే సాధనమే గానీ దైవాన్ని ఆకట్టుకునే ప్రయత్నం కాదు. ఇరవై ఏళ్ళుగా పూజలు చేస్తున్నా ఫలం లేదని కొందరు అంటుంటారు. అంటే ఇరవై ఏళ్ళ అశ్రద్ధ వారిలో ఉందని అర్థం. భగవంతుని అనుగ్రహానికి క్షణకాలం స్మరణ చాలు.

పిల్లవాడికి జబ్బు చేస్తే ఏడుకొండల వాడిని ఒక క్షణం పాటు మొక్కుకుంటాం. అక్కడ దేవుని రూపంతో గాని, స్మరించే కాలంతో గానీ పని లేకుండానే కోరిక నెరవేరుతుంది. పిల్లవానికి జబ్బు తగ్గిన తర్వాత కృతజ్ఞత కోసం తిరుపతి వెళ్తున్నాం కానీ ముందు తిరుపతి వచ్చి మొక్కుకుంటేనే కోరిక తీరుస్తానని దేవుడు చెప్పటంలేదు.

క్షణంలో అనుగ్రహించే దైవానికి గంటల కొద్దీ పూజ ఎందుకు అని అనుమానం వస్తుంది.. ఒక రూపంపై మనసు నిలిపే శిక్షణ కోసం విగ్రహం ఎలా అవసరమైందో, మనకి ఓర్పు, సహనం, ఏకాగ్రత నేర్పేందుకు పూజ కూడా అంత అవసరమైంది. అంటే క్షణకాలం వచ్చి పోతున్న భగవత్ స్మరణ, ఎక్కువ సేపు నిలిపేందుకే పూజ అవసరం.

పూజ మనసు బాగుచేసుకొనే సాధన...🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment