Tuesday, December 29, 2020

జీవిత సత్యాలు

మ్తెడియర్ ప్రెండ్స్ . ప్రతి ఒక్కరూ గుర్తుంచు కోవాల్సిన జీవిత సత్యాలు.

మనిషికి సుఖపడ్డ క్షణాలు కొన్ని రోజులే గుర్తుంటాయి.. కాని ఆనంద క్షణాలు జీవితాంతం గుర్తుంటాయి..

నువ్వు ఎదిగేటప్పుడు నిన్ను తోక్కేవాళ్ళు ఉంటారు , నువ్వు ఎదిగాక నిన్ను మొక్కేవాళ్ళు ఉంటారు . కానీ! నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకు ఒక రూపం వచ్చేలా నిన్ను చెక్కేవాళ్ళు కూడా ఉంటారు , వాళ్ళని మీ జీవితంలో ఎప్పటికి మర్చిపోకు ..... వాళ్ళు ఏమీ ఆశించరు.. నీ బాగు తప్ప..

స్పర్శ... చిరునవ్వు..
ప్రేమతో కూడిన మాటలు..
నిజాయితీ కల్గిన ప్రశంస..
నేనున్నాను అనే భరోసా..
వీటిని మనం తక్కువగా
అంచనా వేస్తాం..కానీ వీటిని మనం అవసరమైనప్పుడు మనకు కావలసినవారికి అందించగలిగితే..అవి వారి జీవితాన్ని మార్చివేసే శక్తి కలిగి ఉంటాయి.



మనల్ని అర్థం చేసుకునే వారికి,
మన రూపంతో అవసరం లేదు.?
మన మనస్సుతో పని.!
మనల్ని బాధపెట్టేవారికి,
మన మనస్సుతో అవసరం లేదు.?
వారి అవసరంతోనే పని.!!
మన స్నేహం కోరేవారికి,
మన స్తోమతతో అవసరం లేదు.?
మన వ్యక్తిత్వంతో పని.!
మనల్ని దూరం పెట్టేవారికి,
మన ఆలోచనలతో అవసరం లేదు.?
వారి స్వార్థంతోనే పని.!!

బ్రతకడానికి...
వంద వేషాలు వెయ్యక్కర్లేదు.?
దిగజారిపోవాల్సిన పనిలేదు.!
డబ్బు కోసం పాకులాడాల్సిన పనిలేదు.!!
మన జీవితం పట్ల,
మనకు పూర్తి గౌరవం ఉంటే,
సంతృప్తి ఉంటే...
జీవితం ఎప్పుడూ, సంతోషంగానే ఉంటుంది..




👏👏👏👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment