గడ్డి గుడిసెలు - గూన పెంకలు
గడ్డి గుడిసెలు, గూన పెంకలు,
మట్టి గోడలు మాయమాయే..
మోట బావులు పూడిపోయే,
ఊట బావుల ఊసె లేదే..
వరి కల్లం కానరాదే,
వడ్లు ఇంటికి చేరవాయే..
బండి ఎడ్లు ఏడబోయే,
బర్రె తలుగు కానరాదే.
వడ్ల గుమ్ములు ఒరిగిపోయే,
కుడిది గోలెం ఇరిగిపోయే..
మొక్క జొన్న చేనులల్ల,
మంచెలన్నీ కూలిపోయే..
పొద్దు తిరుగుడు చేనులన్నీ,
ఆ పొద్దు కోసం ఎదురు చూసే..
వెదురు షాటలు, పెండ తట్టలు,
పెంట కుప్పల పూడిపోయే..
బడికి పోయే బత్త సంచి,
బుక్కు లెయ్యని ఎక్కి ఏడ్చే..
చెక్క పలుక, సుద్దముక్క,
సూద్దమన్నా లేకపాయే..
మర్రి చెట్టు ఉయ్యాల లేవి,
ఈత పండ్ల జాడలేవి..
మోదుగు పూల హోళీ రంగు,
ఎరుపు తగ్గి ఎలిసి పోయే..
శిర్ర గోనె చెదలు పట్టే,
శిలుక్కొయ్యలు శిధిలమాయే..
మంచినీళ్ల మట్టి కుండలు,
మట్టిలోనే కలిసిపోయే..
తేనెటీగల, గోండ్రు కప్పల,
రాగమేది తాలమేది..
నింగి లోన పిల్లల కోడి,
నిద్రపోయి లెవదాయే..
గడ్డి గుడిసెల గూడు కట్టిన,
బుర్రు పిట్ట ఎగిరిపాయే..
మనిషి ఆడిన కోతి కొమ్మ,
ఇపుడు కోతులొచ్చే ఆడబట్టే..
రచ్చ బండ రంది తోటి,
మంది ఏరని ఎదురు చూసే..
తిరిగిరానీ రోజులన్నీ
తలుసుకుంటూ తల్లడిల్లే..
జ్ఞాపకాలను మది మందిరం లో దాచుకుంటూ సాగిపోతూ.......🖋️_ ( కవి ఎవరో తెలియదు కానీ, అతని రాతతో, సిన్నప్పటి గుర్తులన్నీ యాదికచ్చినయి).🌷🌷🌷🌷🌷🌷
Source - Whatsapp Message
గడ్డి గుడిసెలు, గూన పెంకలు,
మట్టి గోడలు మాయమాయే..
మోట బావులు పూడిపోయే,
ఊట బావుల ఊసె లేదే..
వరి కల్లం కానరాదే,
వడ్లు ఇంటికి చేరవాయే..
బండి ఎడ్లు ఏడబోయే,
బర్రె తలుగు కానరాదే.
వడ్ల గుమ్ములు ఒరిగిపోయే,
కుడిది గోలెం ఇరిగిపోయే..
మొక్క జొన్న చేనులల్ల,
మంచెలన్నీ కూలిపోయే..
పొద్దు తిరుగుడు చేనులన్నీ,
ఆ పొద్దు కోసం ఎదురు చూసే..
వెదురు షాటలు, పెండ తట్టలు,
పెంట కుప్పల పూడిపోయే..
బడికి పోయే బత్త సంచి,
బుక్కు లెయ్యని ఎక్కి ఏడ్చే..
చెక్క పలుక, సుద్దముక్క,
సూద్దమన్నా లేకపాయే..
మర్రి చెట్టు ఉయ్యాల లేవి,
ఈత పండ్ల జాడలేవి..
మోదుగు పూల హోళీ రంగు,
ఎరుపు తగ్గి ఎలిసి పోయే..
శిర్ర గోనె చెదలు పట్టే,
శిలుక్కొయ్యలు శిధిలమాయే..
మంచినీళ్ల మట్టి కుండలు,
మట్టిలోనే కలిసిపోయే..
తేనెటీగల, గోండ్రు కప్పల,
రాగమేది తాలమేది..
నింగి లోన పిల్లల కోడి,
నిద్రపోయి లెవదాయే..
గడ్డి గుడిసెల గూడు కట్టిన,
బుర్రు పిట్ట ఎగిరిపాయే..
మనిషి ఆడిన కోతి కొమ్మ,
ఇపుడు కోతులొచ్చే ఆడబట్టే..
రచ్చ బండ రంది తోటి,
మంది ఏరని ఎదురు చూసే..
తిరిగిరానీ రోజులన్నీ
తలుసుకుంటూ తల్లడిల్లే..
జ్ఞాపకాలను మది మందిరం లో దాచుకుంటూ సాగిపోతూ.......🖋️_ ( కవి ఎవరో తెలియదు కానీ, అతని రాతతో, సిన్నప్పటి గుర్తులన్నీ యాదికచ్చినయి).🌷🌷🌷🌷🌷🌷
Source - Whatsapp Message
No comments:
Post a Comment