Sunday, December 6, 2020

మంచి మాటలు ....

01:11:2020 --:ఆదివారం --: ఈ రోజు AVB మంచి మాటలు ....

ఇదే నా లైఫ్,,, నేను ఒక్కరికి భయపడి బతకను, నేను ఒక్కరికి తక్కువచేసి మాట్లాడను, నన్ను చులకనగా చూసే వారి దగ్గర నేను ఉండను, నన్ను అభిమానించే వారిని వదులుకోను, మరణాన్ని అయినా ఎదురిస్తాను కానీ, నాకు విలువలేని చోట మాత్రం నిలబడను,,


మనల్ని చూసి ఊర కుక్కలు మోరిగాయి అంటే దాని అర్థం మనం దొంగలం అనికాదు,, మొరగడం వాటి స్వభావం,, అట్లాగే, మనల్ని కొంతమంది వెదవలు విమర్శిస్తే మనం చెడ్డవారిమి అని కాదు, వాళ్ళు మన ఎదుగుదలను చూసి ఓర్వలేని నీతిలేని సన్నాసులు అని అర్థం,,,



ఏదైనా సరే నేను ఒక్కడిని ఏమి చెయ్యగలను అనే నిరాశ మనిషిలోపల ఉండకూడదు, చిన్న చిన్న నదులు కలిసి సాగితేనే మహా నదులు ఏర్పడతాయి, ఒక్కొక్కనీటిచుక్క కలిస్తే కుంభవృష్టి వర్షం అవుతుంది, వేల మైళ్ళ గమ్యమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుంది, గుర్తుంచుకోండి,,,


దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం మాత్రమే కాదు, ప్రతివారి గుండెల్లో ఉన్న మానవత్వం కూడా దైవంతో సమానం,,

మనిషిలా పుట్టి.., కొన్నాళ్ళు మనిషిలానే పెరుగుతున్నాం... కానీ, మెల్లి మెల్లిగా మంచి అనే కంచెను తెంచుకుని... మరమనిషిలా మారిపోతున్నాం... మనలోని మనిషి నుండి వేగంగా పారిపోతున్నాం..!
మంచి నుంచి దూరంగా జారిపోతున్నాం.!!
నలుగురికి వెలుగు నివ్వకుండానే ఆరిపోతున్నాం.!!!

ఎందుకంటే...
మనం ఎదుగుతున్నాం..!
మనం మనకే అందనంతగా...
మనం ఎదుగుతున్నాం..!



ఎవడో ఎగతాళి చేసాడని నీ జీవితం అంతటితో ఆగిపోకూడదు, నిన్ను ఎగతాళి చేసినవాడు నీ ఎదుగుదలను చూసి కుళ్ళి కుళ్ళి ఏడ్చే విధంగా ఉండాలి నీ లక్ష్యం,,


జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు..!! కానీ, మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకొని బతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు,,గుర్తుంచుకో,,,,_
సేకరణ :-✒️ AVB సుబ్బారావు
📞 9985255805*

Source - Whatsapp Message

No comments:

Post a Comment