Sunday, December 6, 2020

మన ప్రయాణం... మనదే

జీవితంలో
మనతో ఒకడు
పోరాడాలనుకుంటాడు ,

మోసం చేయాలనుకుంటాడు

ముంచాలనుకుంటాడు

తొక్కాలనుకుంటాడు

పోల్చుకుంటాడు

వెటకారం చేస్తాడు

అవమాన పరుస్తాడు

చెడు ప్రచారం చేస్తాడు

ఎదుగుదలను ఓర్వడు

ద్రోహం చేస్తాడు

వెన్నుపోటు పొడుస్తాడు

నటిస్తాడు

తక్కువ చేసి మాట్లాడుతాడు

బలం గురించి కంటే బలహీనత గురించే మోగిస్తాడు

జాలి చూపిస్తున్నట్లు ఉంటాడు

డబ్బుతో పోలుస్తాడు

మన నష్టంతో
సంతోష పడుతాడు

డప్పు కొడుతాడు

చాప్టర్ క్లోజ్ అంటాడు..

చేతకానిది ఎందుకు చేయాలి అంటాడు

అలాగే కావాలి అంటాడు
ఇలా.......

ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో సందర్భాలు ,ఎన్నో సంఘటనల మధ్య నుండి జీవితం దూసుకుపోవాలి ...

నువ్వు వారి మాటలకు అక్కడే ఆగితే ...

నువ్వో దద్దమ్మవి, వాడు అక్కడే ఉంటాడు ...

నువ్వే చేరే చోటకి చేరు.

చెయ్ సవాల్!.....దీనమ్మ జీవితం ...

చావో ... రేవో

నీతో ... నీ లక్ష్యంతో
వాడి గురించి సమయం వృధా చేయకు

మన ప్రయాణంలో వాడొక గడ్డి పరకతో సమానం

ఇలాంటి వారు ఎందరో వస్తారు పోతారు

మన ప్రయాణం... మనదే
ఎందుకంటే

ఈ జీవితం మనది. వాడిది కాదు......

వాడు సరదాకు బ్రతుకుతాడు.......

మనం సచ్చాక కూడా బ్రతకాలి.

*అదే జీవిత పరమార్థం.......🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment