Sunday, December 6, 2020

చారుపై ఇలా చర్చిం....చారు!!

చారుపై ఇలా చర్చిం....చారు!!

వేడిగా ఉన్న చారుని ఏమంటాం?
వేడిచారు కదా! దాన్ని కాస్త సరదాగా ఏడిచారు 😳అందామా?
అలానే ఇంకొన్ని....సరదాసరదాగా😀😀

చారుని పిలవాలంటే ఎలా పిలవాలి...
సింపుల్
దా ..చారు😜😜

చారు చల్లగా ఉంటే...
కూల్ +చారు...కూల్చారు😎

రెండు రకాల చారు ఉంటే...
దో+ చారు...దోచారు 😄

చారు లో ఒక టాబ్లెట్ వేస్తే...
పిల్ +చారు...పిల్చారు😋

చారు కి ఫోన్ చెయ్యాలంటే ...
కాల్ +చారు...కాల్చారు😃

చారులో కొంచం నూనె వేస్తే ...
తేల్ + చారు...తేల్చారు😉

చారుని కేకలేస్తే...
అరి+చారు...అరిచారు😐

చారులో పొడి వేస్తే...
పొడి+చారు...పొడిచారు😮

చారుతో యుద్ధం చేస్తే వార్+చారు👉వార్చారు

మడి కట్టుకుని చారు పెడితే మడి+చారు...మడిచారు😌

ఇలా చాలా రకాల గూఢా చారులున్నాయన్న మాట😂😂

చారుల్లో ఇన్ని రకాలున్నాయని మాకోసం పొందుపరి"చారు". ధన్యవాదాలు.

Source - Whatsapp Message

No comments:

Post a Comment