Monday, December 13, 2021

*💎70 యేళ్ళ భారతావని...!*⛳ *..అసలైన కలెక్టర్!*

💎70 యేళ్ళ భారతావని...!
..అసలైన కలెక్టర్!
🕉️🌞🌎🏵️🌼🚩

October 4, 2018 !
అది తమిళనాడులోని 'చిన్నమనై కెన్పట్టి' అనే ఓ చిన్న ఊరు… పేదరికం తాండవించే ఊరు… ఆ ఊరవతల ఓ చిన్న గుడిసె… మరీ చిన్న గుడిసె… దాని ముందు ఓ కారు వచ్చి ఆగింది… !

ఒకాయన నీలిగళ్లచొక్కా టక్ చేసుకుని, కళ్లద్దాలు పెట్టుకుని ఉన్నాడు… బెల్టు బూట్లు…కారు దిగి ఆ ఇంటి తలుపు అనబడే ఓ తడిక తీసుకుని లోపలకు తలవంచి వెళ్లాడు…

మసిబారిన గోడల పక్కన ఓమూలన గాజుకళ్లతో ఓ ముసలామె కనిపించింది. 'ఎవరెవరు ఉంటారు ఇంట్లో' అన్నాడు ఆదొరబాబు…

ఆమెకు అధికార్లను చూస్తేనే వణుకు… భయంభయంగానే చెప్పింది… ‘అయ్యా, నా పేరు రంగమ్మాళ్… ఆయన పేరు రామన్… మా ఆయన… ఇప్పుడే ఎటో పోయాడు…’ అన్నది బెరుకుబెరుకుగా.

ఆమె వయస్సు 80 ఏళ్లు… ఆయన వయస్సు 82…

'ఏందయ్యా..? అనడిగింది ఆమె ఆ దొరబాబును. ఆపక్కనే ఉన్న ఓచాపను తీసుకుని, కింద నేలమీద పరుచుకుని కూర్చున్నాడు,పరిచయంచేసుకున్నాడు- ‘అమ్మా, నా పేరు అంబళగన్… నేను ఈ జిల్లాకు కలెక్టర్ను…’ అన్నాడు.

ఆమె మొహంలోఅంతులేని ఆశ్చర్యం! ఊళ్లో పట్వారీ తో మాట్లాడటానికే ఆమెకు భయం… అలాంటిది కలెక్టరే ఈ గుడిసెకి వచ్చాడు, ఏంతప్పు జరిగింది? అవును ఏం తప్పు జరిగింది... ? ఒక కలెక్టర్ అలాంటి గుడిసెల్లోకి అడుగు పెట్టడమే ఆయన చుట్టూ తిరిగేప్రభుత్వ ఉద్యోగులు,అధికార్లదృష్టిలో పెద్దతప్పు!

ఎంతసేపూ ఏ ఫైల్ మీద సంతకం చేస్తే ఎన్ని కోట్లు మవస్తాయో ఆలోచించని
ఆ కలెక్టర్ ధోరణే వాళ్లకు అంతుపట్టని తప్పు…!

అక్కడికి దగ్గరలోనే ఉండే 'మాకన్ కురిచి' అనే ఊరికి మాస్ కంటాక్ట్ ప్రోగ్రామ్ కింద వెళ్లాడు ఆ కలెక్టర్… !

అలా మధ్యాహ్నం అయిపోయింది… అధికార్లు బ్రహ్మాండమైన భోజన ఏర్పాట్లు చేసిపెట్టారు… కానీ అవన్నీ రెఫ్యూజ్ చేసి, ఇదుగో, ఇలా ఓగుడిసెకు వచ్చాడు! చాప మీద బైఠాయించాడు…

డ్రైవర్, తనతో వచ్చిన దఫేదార్, ఆ ఊరిపట్వారీ,ఏరియా గిర్దావర్,తాలూకా తహసిల్దార్ అందరూ గుడిసె బయటే నిలబడ్డారు…

ఆమె గురించి అడిగాడు… ఇద్దరు కూతుళ్లు… ఎక్కడో ఉంటున్నారు… ఆ గుడిసెలో ఆ ఇద్దరే… జీవనసంధ్యలో ఒకరికొకరు…!

పనిచేసే బలంలేదు,కేవలం ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యం పథకం ఆసరాగా బతుకుతున్నారు…! వాళ్లో వీళ్లో సాయం చేస్తే మిగతా సరుకులు… అంతే… !

అవును, మన దేశంలో ఇలాంటి వాళ్ల సంఖ్య కోట్లల్లో ఉంటుంది.. చేదునిజం!

‘ఏం వండుకున్నావమ్మా…నాకూ కాస్త పెడతావా..?’ అనడిగాడు ఆ కలెక్టర్.

ఆమె మొహంలో మరింత ఆశ్చర్యం… ‘ఇంకా వండుకోలేదయ్యా..!’ అన్నది .

'ఏం..?' అనడిగాడు కలెక్టర్…

'ఇంట్లో సరుకులు లేవ'ని చెప్పలేక అలా నిర్వేదంగా కలెక్టర్ మొహంవంకచూస్తూ వుండిపోయింది…

కలెక్టర్ ఎక్కడికి వెళ్లినా తన ఇంటి నుంచే మధ్యాహ్న భోజనం తీసుకెళ్తాడు క్యారియర్లో…

డ్రైవర్ను కేకేసి కార్లోంచీ అది లోపలకు తెప్పించుకున్నాడు… ఆమెను ఓవిరిగిన చెక్కపీట మీద కూర్చోమన్నాడు… అరిటాకులు పరిచాడు… ' ఈరోజు నాతో భోజనం చేయి' అన్నాడు…ఇదంతా కలా అనుకుంటున్నది ఆమె…

అవును మరి, ఆమె ఊహించని, ఊహించలేనిదే కదా అది…

ఆమెతో పాటు భోజనం చేస్తూ..... అడిగాడు 'మీకు వృద్యాప్య పెన్షన్లు వస్తున్నాయా..?'

లేదయ్యా… ఆఫీసుల చుట్టూ తిరిగి చేసిపెట్టేవాడు లేడు,మాకు ఓపిక లేదు, పైరవీలకు డబ్బు కూడా లేదు’ అన్నది-ఉన్నదున్నట్టుగా

బయట నిలబడిన తహసిల్దార్ ను లోపలకు పిలిచాడు… అప్పటికప్పుడు ఓదరఖాస్తు అతనితోనే నింపించాడు… ఆమె వేలిముద్ర తీసుకున్నాడు… కింద కలెక్టర్ సంతకం…! 'వచ్చే నెల నుంచి ఆమె ఇంటికి పెన్షన్ అందాలి'. అని చెప్పాడు…

ఒక ఇంట్లో ఒకరికే పెన్షన్…! మరి ...
ఆ ముసలాయనకు ఎలా..? ఏ పథకం కింద ఏం ఇవ్వవచ్చో చూసి, తనకు ప్రపోజల్ పంపించాలని చెప్పాడు..… అంతేకాదు ఆతాలూకాలో పెండింగ్ లో ఉన్న పెన్షన్ల దరఖాస్తులను వెంటనే క్లియర్ చేసి, ఫైనల్ సంతకం కోసం కలెక్టరేట్ కిపంపించాలని ఆదేశించాడు

ఆమెతో మాట్లాడుతూనే భోజనం చేశాడు.'సరేనమ్మా మాఅమ్మతోకూర్చుని భోజనం చేసినట్టుగా ఉంది...' అంటూ నమస్కరించి, వెళ్లిపోయాడు…

ఆమె ఇప్పటికీ నమ్మలేకపోతున్నది… ఈరోజు ఏం జరిగింది…?

ఇలాంటి అధికారులు ఇంకా రావాలి! ప్రభుత్వ పథకాలు ప్రజల కు చేరాలి!!

ధన్యవాదాలు సార్!!!

డెబై సంవత్సరాల స్వాతంత్ర్య భారత దేశంలోఇలాటి కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయంటే ఎవరు కారణం?ఒక్కసారి ఆలొచిద్దాము .
వజ్రాయుధంలాంటి ఓటును సమర్థ వంతంగా ఉపయోగించి సమర్థులకు ఓట్టేద్దాము! ప్రజలను ఆశీంచేస్థాయి నుంచి శాసీంచే స్థాయి కి చేరుద్దాం!!!*

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment