Monday, December 13, 2021

నేటి జీవిత సత్యం. 🌷దాతృత్వం.

నేటి జీవిత సత్యం. 🌷దాతృత్వం.☘️🌹

🌟దానం చేయడం, చక్కగా మాట్లాడడం, ధీరుడుగా ఉండడం, ఉచితానుచితాలను తెలుసుకొని ప్రవర్తించడం అనేవి సహజ గుణాలుగా రావలసినదే గాని, అభ్యాసం వల్ల వచ్చేవి కావు.

⛳పుణ్యం కొద్దీ పురుషుడు - దానం కొద్దీ బిడ్డలు అని , అన్ని దానములలో అన్నదానము మిన్న అనీ తెలుగు సాహిత్యంలో ఎన్నో సామెతలు మనకు కనిపిస్తున్నాయి.

💦శిబి చక్రవర్తి, రంతి దేవుడు, దాన కర్ణుడు మొదలైన రాజుల, ఇతర కథల్లోనూ దాన ప్రాధాన్యం కనిపిస్తుంది. పురాణ కథల్లో అన్నింటిలోనూ దానాదుల ప్రత్యేకత ఉంది.

🌻అదే విధంగా వేరు వేరు మాసాలలో చేసే దానాల విషయాన్ని కూడా పురాణాలు ప్రత్యేకంగా చెపుతున్నాయి. మనం నిత్యం చేసే నోములు, వ్రతాలలోనూ కూడా చేయాల్సిన దానాదులను వాయన రూపాల్లో ధర్మ శాస్త్ర గ్రంథాలు చెపుతూ ఉన్నాయి.

🌹సామాజిక జీవనంలో వ్యక్తి మనుగడ సాధించే ప్రతి సందర్భంలోనూ ఇవ్వడానికే ప్రాధాన్యమివ్వాలని భారతీయ ధర్మ శాస్త్రాలు నిర్దేశించిన విధానాన్ని అధ్యయనం చేయాలి.

🌷దాచుకుంటే రోగం, వదలుకుంటే త్యాగం అనే భావంతో దాన గుణానికి అందరూ ప్రాధాన్యం ఇచ్చారు.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment