Monday, September 12, 2022

మంచి మాటలు(04-09-2022)

04-09-2022:- ఆదివారం
ఈరోజు AVB మంచి మాటలు
తెలియని దానిని తెలుసు కోవాలని ప్రయత్నిస్తే ఆక్షణంవరకే నీవు తెలివి తక్కువ వాడిగా ఇతరులు అనుకోవొచ్చు .
కానీ
తెలియని దానిని తెలిసినట్టు నటిస్తే జీవితాంతం తెలివి తక్కువ వాడిగానే మిగిలిపోతావు..

మనలో ఉన్నప్పుడు మాత్రమే ఇతరులు గుర్తించగలిగేవి,ఎంత నటించిన రానివి, జ్ఞానం, మంచితనం మరియు హుందాతనం, మనల్ని ఎవరైనా పొగుడుతుంటే అది మనల్ని కాదు మనం సాధిస్తున్న విజయాలను అని గుర్తించాలి...

మనం ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మౌనం అన్నది అతి సురక్షితమైన నీతి.

అసూయా ద్వేషాలు మానసిక రోగాలు, అవి మనిషి ఎదుగుదల ను ఆపివేస్తాయి..

సంతోషం, సహనం, శాంతం అనే మూడు గుణాలు ఎదుగుదలకు ఉపయోగపడుతాయి...

హృదయం కూడ భూమి లాంటిదే,
ద్వేషం అనే మొక్కను నాటితే విషం చిమ్ముతూ పెరుగుతుంది,
ప్రేమ, విశ్వాసం అనే విత్తనాలను నాటితే సమాజానికి పనికివచ్చే మొక్కలను ఇస్తుంది..

మొక్కుబడితో చేసే పనులు ప్రయోజనం చేకూర్చవు, మనసు పెట్టి చేసే పనులు ఫలితం తప్పక చేకూరుస్తాయి...

సేకరణ ✍️ AVB సుబ్బారావు

No comments:

Post a Comment