Thursday, September 15, 2022

🎻🌹🙏 స్వర్గం కావాలా నరకం కావాలా? నిర్ణయం మనదే....!!

 🎻🌹🙏 స్వర్గం కావాలా నరకం కావాలా? నిర్ణయం మనదే....!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, ఈ రోజు ఏదైనా మంచి విషయాలు చెప్పండి అన్నాడు, కాసేపు ఆలోచిస్తే ఈ విషయాలు స్ఫురించాయి.. 

🌸స్వర్గానికి ప్రవేశం ఉచితం, నరకానికి వెళ్లాలంటే బోలెడు డబ్బు ఖర్చుపెట్టాలి, అన్నాను..

🌿ఆశ్చర్యంగా!!
అతను నా వంకచూసి అదెలా? అన్నాడు, నేను చిన్నగా నవ్వి, ఇలా అన్నాను, జూదం ఆడటానికి డబ్బు కావాలి, మత్తు పానీయాలు త్రాగడానికి డబ్బు కావాలి, సిగరెట్ త్రాగడానికి డబ్బు కావాలి, పాపాలతో పయనించడానికి డబ్బుకావాలి, ఇలా ఇంకా, ఇంకా ..

🌸కానీ, ప్రేమను పంచడానికి డబ్బు అవసరం లేదు, దేవుణ్ణి ప్రార్థించడానికి డబ్బు అవసరం లేదు, సేవచేయడానికి డబ్బు అవసరం లేదు, అప్పుడప్పుడు ఉపవాసం (ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం కోసం) ఉండడానికి డబ్బు అవసరం లేదు,

🌿 క్షమించమని అడగడానికి డబ్బు అవసరం లేదు, మన చూపులో కరుణ, సానుభూతి, మానవత్వం చూపడానికి పెద్దగా డబ్బు ఆవసరంలేదు ..

🌸దేవుణ్ణిపై నమ్మకం ఉండాలి, మనపై మనకు ప్రేమ, విశ్వాసం ఉండాలి, ఇప్పుడు చెప్పండి ..

🌿డబ్బు ఖర్చు చేసి నరకాన్ని వెళ్ళడానికి ఇష్టపడతారా ? ఉచితంగా లభించే స్వర్గం సుఖభోగాలకు ఇష్టపడతారా ? ఆలోచించండి ..

🌸సత్సంగత్వే నిస్సంగత్వం !
నిస్సంగత్వే నిర్మోహత్వం !!
నిర్మోహత్వే నిశ్చలతత్వం !
నిశ్చలతత్వే జీవన్ముక్తి: !!

🌿సత్పురుషులు ..మార్గదర్శనం
సత్సంగత్యం ..సహవాసం
సత్ప్రవర్తన ..జీవించడం
మించి, ఈ  భౌతిక  ప్రపంచంలో  ఇంకొకటి,  మరొకటి  లేదు ....🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments:

Post a Comment