Thursday, September 15, 2022

నేను ఉన్నాను అని నాకు ఎప్పుడు ఎలా తెలుస్తుంది???.

 నేను ఉన్నాను అని నాకు ఎప్పుడు ఎలా తెలుస్తుంది???.
    ఈ క్రింద వివరించిన విధంగా జరిగితేనే తెలుస్తుంది.లేకుంటే తెలియదు.
  1)బయట ప్రపంచంతో ఆరు జ్ఞానేంద్రియాల ద్వారా (మనస్సు  అనే ఇంద్రియంతో కలిపి) సంపర్కం లోకి రావాలి.
2) అప్పుడు సుఖ లేదా దుఃఖం కర సంవేదనలు కలగాలి. 
3)అలా కలిగిన సంవేదనలు నాకు కలిగినవి అని సొంతం చేసుకోవాలి.
 4)అలా  కలిగించిన సంవేదనల కారణం అయిన ప్రపంచం  వేరు  అవ్వాలి.
  5) అప్పుడు నేను ఉన్నాను అని నాకు తెలుస్తుంది.
    నిద్ర లో పైవేవి మొత్తంగా సంభవించవు కనుక నేను లేను.శరీరక ,మానసిక వ్యవస్థ భౌతికంగా వుంటుంది.కాని దీనిని కలిగి వున్నాను అనే నేను అన్న భావన, బ్రాంతి జన్మించదు.

No comments:

Post a Comment