Sunday, September 18, 2022

మౌనం.....నోటితో మాట్లాడకపోయినా లోపల మనసు మాట్లాడుతూ ఉంటే అది మౌనం ఎలా అవుతుంది?

 మౌనం.....

🌷🌷🌷🌷🌷

మనం మాట్లాడకుండా ఉండటమే మౌనం అనుకుంటున్నాం.. నోటితో మాట్లాడకపోయినా లోపల మనసు మాట్లాడుతూ ఉంటే అది మౌనం ఎలా అవుతుంది.. ఓకనాడు ఓ మహర్షి ఇలా చెప్పారు.. రేడియో శబ్దాన్ని ఎంత తగ్గించినా పూర్తిగా కట్టేసే వరకు అందులోని బ్యాటరీ ఖర్చు అవుతూనే ఉంటుంది. అలాగే మాట్లాడ కుండా ఉన్నా ఆలోచనలతో మన మనోశక్తి ఖర్చు అవుతూనే ఉంటుంది. మనసు ఒక బ్రహ్మరాక్షసి. దానికి ఏదొక పని లేకపోతే అది అశాంతికి గురిచేస్తుంది. అందుకే నిరంతరం నామం, ద్యనం, సత్సంగంతో ఉంటే మనసు అదుపులో ఉంటుంది. మనం నేర్చుకున్నదంతా విన్నదే. రాముడు, రమణుడు గురించైనా విన్నదే కాబట్టి ఇతరులందరిని వారితో పోలిక తెస్తున్నాం. మనం సొంతంగా తెలుసుకున్నదే మనకు బలం. మనశ్శాంతి కోసం చేసుకునే ఆధ్యాత్మిక సాధనలో కేవలం విన్నదానితో వాదులాడుకోవటం వృధా. 

అందుకే శ్రీ రమణ మహర్షి ''తెలియని దైవం గురించి తెలుసుకునే ముందు అసలు 'నేను' అంటే ఏమిటో తెలుసుకో"' అన్నారు. మనం ఏమిటో మనకి తెలిసిన రోజున దైవం ఏమిటో అనుభవంలోకి వస్తుంది...

No comments:

Post a Comment