👌 ...ఏష ధర్మః సనాతనః👌
41. సమన్వయమే సనాతనం
✍️ పూజ్యగురువులు శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు.
🌹💫🌈💫🌈🕉️🕉️💫🌈💫🌈🌹
🙏 సమన్వయమే సనాతనం 🌹
💫 సత్య ప్రతిపాదనలో అనేక సిద్ధాంతాలు ఉంటాయి. “పుఱ్ఱెకో బుద్ధి” అని నానుడి. ఒక్కొక్కరి ఆలోచన, అనుభవం ఒక్కొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాయి.
💫 సత్యానుభవం అందినవాడికి ఏ రాద్దాంతమూ ఉండదు. రామకృష్ణ పరమహంస చెప్పినట్లు “పువ్వులో మాధుర్యాన్ని ఆస్వాదించే వరకే తుమ్మెద రొద. అసలు 'ఆస్వాదన' అనే అనుభవస్థితిలో మౌనమే.” అనంతకాలంలో ఎందరో మహానుభావులు సత్యానుభవం కోసం సాగించిన అన్వేషణలో తలో మార్గాన్ని ఆవిష్కరించారు. ఏ మార్గాన సాగేవానికి ఆ మార్గపు సమగ్ర అవగాహన ఉంటుంది. అలా ఏర్పడిన భిన్న మార్గాలలో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. కొన్ని లోపాలుండవచ్చు కూడా. నిజమైన సత్య దృష్టి ఉన్నవాడు వాటన్నిటినీ సమన్వయించే ప్రయత్నం చేస్తాడు. సనాతన ధర్మం ఈ సమన్వయాన్నే ప్రబోధిస్తూ వచ్చింది.
"నృణామేకో గమ్యః త్వమసి పయసా మర్ణవ ఇవ”
💫 “నదులన్నిటికీ సముద్రంవలె, అన్ని మార్గాలకు గమ్యమవు నీవే" అని పరమసత్యాన్ని పరమశివునిగా సంభావించి చెప్పాడు పుష్పదంతుడు.
💫 “సర్వ దేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి" అని పరమ సత్యాన్ని కేశవునిగా సంభావించాడు మరో మహాత్ముడు. ఈ రెండింటిలో 'రుచి' భేదమే తప్ప పరతత్త్వ భావనలో భేదం లేదని గ్రహిస్తాడు వివేకి. ఆ వివేకాన్ని అందించిన వారిని ప్రపంచం శిరసున ధరించింది.
🙏 ఆదిశంకరులు, శ్రీరామకృష్ణపరమహంస, వివేకానంద, రమణమహర్షి వంటి వారంతా ఏ మార్గాన్ని నిరసించలేదు. (ఒక్క దుర్మార్గాన్ని తప్ప). అన్ని మార్గాల గొప్పతనాన్ని సమన్వయించారు. విడదీసేవాడు జగద్గురువు కాడు.
💫 ఒక తోటలో కొందరున్నారు. అది పున్నమి రాత్రి. అందులో కొలను ఒడ్డున తలవంచి కూర్చున్నవాడు “చంద్రుడు కొలనులో ఉన్నాడు" అంటాడు. చెట్ల కొమ్మల్లోంచి చంద్రుని చూసేవాడు “ఆ కొమ్మల్లో చంద్రుడు ఉన్నాడు” అని అభిప్రాయపడతాడు. అక్కడ ఒక మేడపై నిల్చున్నవాడు "ఆకాశంలో చంద్రుడున్నాడు" అంటాడు. అసలు చంద్రుడిపై చేరినవాడు చంద్రుని స్థానాన్ని మరోలా భావిస్తాడు. కానీ వీరందరూ ఒకే చంద్రుని దర్శిస్తున్నారన్నది నిజం. ఎవరు ఉన్న స్థాయిలో వారి అనుభవం. ఎవరి దర్శనాన్నీ కాదనలేం. ఎవరి దర్శనానికి వారి నిదర్శనం ఉంటుంది.
💫 యుగయుగాలుగా ఎన్ని సిద్ధాంతాలు వచ్చినా వేటి దారిన అవి కొన్ని వర్గాలను తయారు చేశాయి. అన్నింటినీ కాదని తన బుద్ధితో ఒకే సిద్ధాంతం కిందికి ప్రపంచాన్ని తెద్దామని ప్రయత్నించిన ప్రతివాడు - మరో కొత్త సిద్ధాంతాన్ని తేగలిగాడే కానీ, అందరినీ ఒక వాదం కిందికి తేలేకపోయాడు. ఇది సృష్టి నైజం.
💫 విశాల జగతినీ, అనంతకాలాన్నీ గమనిస్తూ వెళితే ఈ విషయం అనుభవమౌతుంది. ప్రతి అభిప్రాయానికీ, తద్వారా ఏర్పడిన వాదానికీ వాటి పరిమితులు వాటి కుంటాయి. అన్ని వాదాలకీ అనుయాయులుంటారు.
💫 అదీ మంచిదే. వారి ద్వారా ఆ వాదాలు అనేక విధాల వ్యాఖ్యలు పొందుతూ కొత్త స్వరూపాలు తీసుకుంటుంటాయి. ఇలాంటి స్థితిలో ఏది పద్ధతి? ఈ ప్రశ్నకు ఒకటే సమాధానం.
✅ సమన్వయం, సామరస్యం. ఈ రెండింటితోనే శాంతి సాధ్యం.
✅ “నాది గొప్ప సిద్ధాంతం” అనే విశ్వాసం మంచిదే. కానీ “నాదే గొప్ప” అంటేనే ప్రమాదం. తనది తాను ఆచరిస్తూ ఇతరుల భావాలను గౌరవిస్తూ, ఆ దర్శనంలోనూ విశిష్టత ఏముందో పరిశీలించి గ్రహించే ప్రయత్నం సత్యాన్వేషికి కర్తవ్యం. అన్నిటికన్నా విలువైన మానవజీవితానికి వారి వారి స్థాయిలలో ప్రయోజనం చేకూర్చే లక్షణం ప్రతి పథంలోనూ ఉంది.
💫 ఆ సమన్వయ సామరస్య హృదయాన్ని సాధిస్తే విభిన్న రాగాలకు వేదికగా విశ్వవీణ మధుర సంగీతాలు వినిపిస్తోందని ఆస్వాదిస్తాం - విభిన్న సిద్ధాంత కుసుమాలతో విశ్వవనం విలసిల్లుతోందని భావిస్తాం. ఆ ఏకత్వమే మన లక్ష్యం.
🌹💫🌈💫🌈🕉️🕉️💫🌈💫🌈🌹
సేకరణ

No comments:
Post a Comment