Friday, September 9, 2022

కాబట్టి దానం చేసిన ప్రతి సందర్భంలోనూ పుణ్యమే వస్తుంది అని అనుకోకూడదు

 దానం చేసిన ప్రతి ఒక్కరికి పుణ్యం వస్తుంది అనుకోవటం అవివేకం 

సపాత్ర దానం చేసిన వారికి మాత్రమే పుణ్యం లభిస్తుంది 

అపాత్ర దానం చేసిన వారికి పుణ్యం లభించకపోగా , కొన్ని సందర్భాలలో పాపం తగులుకుంటుంది

అది ఎలాగా 

అంటే మీరు చేసిన దానం పొందిన వారు పాప కార్యములు చేస్తే ఆ పాపములో సగం మీకు లభిస్తుంది 

అలాగే మీరు చేసిన దానం పొందినవారు పుణ్యకార్యములు చేస్తే ఆ పుణ్యములో సగం మీకు లభిస్తుంది

ఉదాహరణకు 

మీరు ఒక వ్యక్తికి భోజనం పెడితే ఆ భోజనం తినడం వలన వచ్చిన శక్తితో అతను పుణ్యకార్యము చేస్తే ఆ పుణ్యంలో సగం మీకు లభిస్తుంది 

అతను పుణ్యకార్యము కాక , ఆ భోజనం వలన వచ్చిన శక్తితో పాపకార్యము చేస్తే ఆ పాపములో సగం మీకు లభిస్తుంది

కాబట్టి మనం గమనించవలసినది ఏమిటి అంటే దానం చేసిన ప్రతి సందర్భంలోనూ పుణ్యమే వస్తుంది అని అనుకోకూడదు

No comments:

Post a Comment