Tuesday, September 13, 2022

 🍏రేపేదో జరగ బోతుందని ఇప్పటినుండే చింతించకు.చివరి క్షణం వరకు మంచిగా జీవిస్తుంటే ఏక్షణం లోనైనా అద్భుతాలు  జరగ వచ్చు. ఎవరికి తెలుసు..!!

🍏జీవితం లో అద్భుతాలు జరగాలి ,జీవితమే అద్భుతంగా ఉండాలి అనుకుంటే దానికి తగిన విధంగా మన ఆలోచనలను, మనల్ని మనం మలచుకోవాలి..!!

🍏ఇప్పుడు నీకు ఉన్న భాధ నీపరిస్థితులకంటే ఎక్కువగా వాటిని చూసే విధానం సరిగా  లేకపోవటం వల్లే వస్తూ ఉంటుంది.సరి చూసు కోవాలి..!!

🍏అతిగా విమర్శ చేస్తూ కాలం గడపకు.ఎందుకంటే .తిరిగి తిరిగి అదే ఆలోచూస్తూ కూర్చుంటే ఎదో ఒకరోజు అదే నీజీవితం లోకి వస్తుంది..!!

🍏నిన్ను కోల్పోయే త్యాగాలు చేయనక్కర లేదుఎవరికోసమూ.అందరికీ వీలైనంత సహాయమూ, సహకారమూ చేస్తే అదే పదివేలు..!!

🍏ప్రపంచానికి ఇప్పుడు ఎక్కువగా అవసరమన్నది పరిస్థితులలో మార్పుకాదు. చైతన్యం లో మార్పు.మిగిలింది అదే చూసుకుంటుంది..!!
.
🍏అతిగా ఆలోచించడం కూడా ఒక రకమైన జబ్బే.మెల్లగా ప్రయత్నించి ఈ విచిత్ర జబ్బునుండి కూడా బయట పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది..!!
.
🍏మిమ్మల్ని మీరు ఇస్ట పడడమే విజయం.మీరు ఏది చేసారో, ఎలా చేసారో మీకు నచ్చడమే అసలు విజయం అంటే..!

🍏మండుతున్న చెట్టు మీద ఏపక్షీ వాలదు. అలాగే కోపంతో రగిలిపోయే వారికి సుఖ సంతోషాలు ఎన్నడూ ఉండవు..!!

No comments:

Post a Comment