మేడం బ్లావేత్స్కీ ఎన్నో గొప్ప మహిమలు చేసింది. ఒకసారి ఆమె తన శిష్యులతో ఎడారిలో ప్రయాణంచేస్తున్న సమయంలో చీకటి పడింది. ఈ చీకటి రాత్రి ఎడారిలో చలిలో ఎక్కడ ఉండాల్రా దేవుడా! అని వారంతా భయపడుతున్న సమయంలో ఆ ఎడారిలో ఒక పెద్ద భవనాన్ని సృష్టించింది బ్లావేత్స్కీ. అందరూ తెల్లవార్లూ ఆ భవనంలో హాయిగా ఉన్నారు. తెల్లవారిన తరువాత చూస్తే భవనం లేదు ఏమీ లేదు. మళ్ళీ ఎడారిలో అందరూ నిలబడిఉన్నారు. మరి రాత్రంతా విశ్రాంతినిచ్చిన భవనం ఎక్కడికి పోయింది? ఇలాటి మహిమలు ఎన్నో చేసి చూపింది ఆమె. ఒక ఆవును సృష్టించి తానే పాలు పితికి తాగమని అందరికీ ఇచ్చేది. కాసేపటి తరువాత చూస్తే ఆవూ ఉండదు ఏమీఉండదు. మరి ఆ కాసేపు ఆవు ఎక్కణ్ణించి వచ్చేదో ఎవరికీ తెలిసేది కాదు. పాలు తాగినట్లు చారికలు కనిపిస్తూనే ఉండేవి. ఈ సంఘటనలను ఎలా వివరించగలం? ఇలాటి మహిమలు ఎన్నో ఆమె చేసింది. ఇవన్నీ నేటి బాబాల మహిమలకంటే చాలా రెట్లు గొప్పవి.
భట్టాచార్య
🌺🌸🌼🚩🕉🚩🌼🌸🌺
No comments:
Post a Comment