నేటి మంచిమాట.
ఒడిపోతామని అనిపించినా, గెలవడానికి చేసే ప్రయత్నం
గెలుపు కంటే గొప్పది.
ఒకరి ఆకలి దేహానికి,ఒకరి ఆకలి ఆత్మకి.. ఒకేసారి భార్యగా, తల్లిగా
దేహాత్మల ఆకలి తీర్చి రెండు పాత్రలకు న్యాయం చేసేది
ఒక స్త్రీ మాత్రమే
ఆకలికి తినాలిగా అనుకుంటే ఏదైనా ఒకటే..జీవించడానికి తినాలి అనుకుంటే ఆరోగ్య వంతమైన ఆహారం తీసుకుంటాం.
ఏదైనామన చిత్తం మీదే
ఆధారపడి ఉంటుంది.
ఆలోచించి మాట్లాడే మాటల్లో
అబద్దాలు ఉంటాయోమో కానీ,ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి.
క్షమార్పణ అడగటం, క్షమించడం రెండూ రాగల్గితే,జీవితంలో సగం విజయం సాధించినట్లే.
ఉషోదయం చెప్తూ మానస సరోవరం 👏
No comments:
Post a Comment