Sunday, October 16, 2022

మనసు శూన్యస్థితికి చేరాలంటే ఏమి చెయ్యాలి ?

 💖💖💖
      💖💖 *"358"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼

*"మనసు శూన్యస్థితికి చేరాలంటే ఏమి చెయ్యాలి ?"*
***************************

*"ఏకాగ్రతను అలవర్చుకోవాలి. మనసుకు కుదురు రావటం అంటే మనకు కుదురు రావటమే. మనమూ మనమనస్సు విడివిడిగా లేవు. నేను కదలకుండా ఉన్నానంటే నా మనసు కదలకుండా ఉందని అర్ధం. నేను కదులుతున్నానంటే నా మనస్సు చంచలంగా ఉందని అర్ధం. మనసు అంటే మనకి ఏర్పడిన జ్ఞాపకాల సమూహం. ఆ జ్ఞాపకాలు గుర్తుకురావటమే మనం నిరంతరం చేస్తున్న ఆలోచన. బాబాను స్మరిస్తుంటే షిరిడీ గుర్తుకు వస్తుంది. షిరిడీ గుర్తుకు రాగానే అక్కడ హోటల్లో తిన్న ఆహారం గుర్తుకు వస్తుంది. ఇలా సాగుతున్న ఆలోచనలన్నీ జ్ఞాపకాలే. నిజానికి మనం కళ్ళు ముసుకున్నా కనిపించేవన్నీ బయట చూసినవే. మనకి చూడటం, వినటం ప్రవృత్తిగా ఉంది. జ్ఞాని మనసు నివృత్తిలో ఉంటుంది. కాబట్టే జ్ఞాని కళ్ళు మూసుకుంటే శూన్యం ఉంటుంది. అలాంటి శూన్యస్థితి కలిగే వరకూ మనసుకు ఏకాగ్రత అలవరుస్తూ వెళ్ళటమే సాధన. మనశ్శాంతి కోసం మొదలైన సాధన పరిణామంలో దైవం కోసం పడే తపనగా మారుతుంది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
          🌼💖🌼💖🌼
                🌼🕉️🌼
           

No comments:

Post a Comment