*శుభోదయం* 🙏
*సీజన్ మారుతోంది.. గొంతు నొప్పి, దగ్గు, జలుబు రావొద్దంటే.....
ఇది సీజన్ మారే సమయం. కనుక ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సీజన్ మారే సమయంలో గొంతు నొప్పి, దగ్గు, జలుబు బాగా వస్తుంటాయి. ఇది జ్వరానికి దారి తీస్తుంది. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ సీజన్‌లో కొన్ని చిట్కాలను పాటించాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. సీజన్ మారే సమయంలో చాలా మందికి ముందుగా గొంతు నొప్పి వస్తుంది. తరువాత దగ్గు, జలుబు వస్తాయి. కనుక గొంతులో ఏదైనా తేడాగా ఉందంటే వెంటనే గోరు వెచ్చని నీళ్లను తాగడం ప్రారంభించాలి. అలాగే హెర్బల్ టీలు, చికెన్ సూప్, కూరగాయల సూప్ వంటివి తాగాలి. దీంతో గొంతు నొప్పి తగ్గుతుంది. దగ్గు, జలుబు రాకుండా ఉంటాయి.
2. ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి సేవిస్తే సీజనల్ వ్యాధులు రాకుండా ఆపవచ్చు. అలాగే రోజుకు మూడు సార్లు గొంతులో గోరు వెచ్చని ఉప్పు నీటిని పోసి పుక్కిలించాలి. దీంతోనూ గొంతు సమస్యలు రావు.
3. ఉదయాన్నే పరగడుపునే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను దంచి ఒక టీస్పూన్ తేనెతో కలిపి తినాలి. ఈ రెండింటిలో ఉండే యాంటీ వైరల్ గుణాలు శ్వాస కోశ సమస్యలను రానియ్యవు. అలాగే రోజుకు మూడుసార్లు అర టీస్పూన్ చొప్పున తులసిరసం సేవించాలి. పాలలో కలిపి తాగవచ్చు. ఇది కూడా దగ్గు, జలుబు రాకుండా నిరోధిస్తుంది.
4. ఈ సీజన్‌లో చల్లని పదార్థాలను అస్సలు తినరాదు. అలాగే స్వీట్లను కొద్ది రోజులు మానేయాలి. సీజన్ పూర్తిగా మారేవరకు తిండి విషయంలో జాగ్రత్తలు వహించాలి.
5. విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను, కూరగాయలను తీసుకోవాలి. దీంతో శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే బాదంపప్పు, పిస్తా, వాల్ నట్స్, కోడిగుడ్లు, గుమ్మడికాయ విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి కూడా ఇమ్యూనిటీని పెంచుతాయి. ఈ క్రమంలో ఈ సీజన్‌లో దగ్గు, జలుబు, గొంతు సమస్యలు రాకుండా ముందుగానే అడ్డుకట్ట వేయవచ్చు.
No comments:
Post a Comment