290922e1901.HF333.300922-8.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
ఇటువంటి పరిస్థితిలో మనం ఏమి చేస్తాం?
స్నేహబంధం!
➖➖➖✍️
ఒకసారి తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి పార్కులో నడుస్తూ, మాట్లాడుకుంటూ ఉదయపు గాలిని ఆస్వాదిస్తున్నారు.
వారిద్దరూ పార్కులో చాలా సేపు నడుస్తూ దూరం వచ్చేసారు.
అకస్మాత్తుగా తండ్రి, "బాబూ, ఆగు!" అన్నాడు.
కొడుకు - "ఏమైంది నాన్నా? ఎందుకు ఆగమన్నావు?"
తండ్రి - "అంత ముఖ్యమైన విషయమేమి కాదు కానీ, ఇప్పుడు ఇంక మనం ముందుకు వెళ్లద్దు."
"ఎందుకు నాన్నా?", అని కొడుకు ఆశ్చర్యంగా అడిగాడు.
"ఎదురుగుండా ఒక ముసలాయన మనవైపు వస్తున్నాడు చూసావా?" ఆ రోడ్డు వైపు చూపిస్తూ అడిగాడు తండ్రి.
"ఆ, చూస్తున్నాను, అతను మన వైపే వస్తున్నాడు," అన్నాడు కొడుకు.
"అతను నా స్నేహితుడు. అతను నా దగ్గర డబ్బు తీసుకున్నాడు కానీ తిరిగి ఇవ్వలేకపోతున్నాడు. మేం ఎప్పుడు కలిసినా, ‘డబ్బు తిరిగి ఇవ్వడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నానని’ చెప్తున్నాడు. డబ్బులు సమకూర్చలేకపోతే మరొకరి దగ్గర అప్పు చేసయినా నాకు ఇస్తానంటున్నాడు. అతను నాతో అలా మాట్లాడినప్పుడల్లా అతని కళ్ళు సిగ్గుతో నిండిపోతాయి. ఇది చాలా కాలంగా జరుగుతోంది, కానీ ఇప్పుడు నా స్నేహితుడికి ఆ ఇబ్బంది కలిగించడం నాకు ఇష్టం లేదు!” అన్నాడు తండ్రి.
దానికి కొడుకు, “నాన్నా, మీ స్నేహితుడిని ఇబ్బంది పెట్టకూడదనుకుంటే, మీకు అతని వద్ద ఆ డబ్బు తీసుకోవడం ఇష్టం లేదు కాబట్టి, మీరు అతనికి ఇచ్చిన డబ్బును బహుమానంలా స్వీకరించమని చెప్పవచ్చు కదా?"
కొడుకు మాటలు విని తండ్రి ఇలా అన్నాడు, "నేను నా స్నేహితుడితో ఈ విషయం ముందే చెప్పాను, నాకు డబ్బు తిరిగి ఇవ్వక్కరలేదు, ఈ డబ్బును మీరు బహుమతిగా స్వీకరించండి అని నేను చెప్పాను. కానీ నా స్నేహితుడు అది విని చాలా బాధపడ్డాడు. చాలా బాధగా, బరువెక్కిన హృదయంతో ఇలా అన్నాడు, 'నేను బిచ్చగాడిని కాదు, మీ స్నేహితుడిని, మీరు నాకు అవసరమైనప్పుడు డబ్బు ఇచ్చారు. నా వద్ద ఉన్నప్పుడు, డబ్బు సమకూరిన వెంటనే నేను మీకు డబ్బు తిరిగి ఇస్తాను. నేను మీ స్నేహితుడిగానే ఉండాలనుకుంటున్నాను, నేను బిచ్చగాడిని అవ్వదల్చుకోలేదు!”అన్నాడు.
"ఇప్పుడు నాకు అతనిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అతనిని ఆ స్థితిలో చూసి నేను ఇబ్బంది పడటం నాకు ఇష్టంలేదు. అందుకే మనం ఇటువైపు వెళ్లకుండా, వేరే మార్గంలో నుండి వెళ్దాం" అని అన్నాడు.
కొడుకు, "నాన్నా, మీరు చాలా మంచివారు. సాధారణంగా అప్పుతీసుకున్నవారు అప్పిచ్చినవారి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు, అప్పిచ్చినవారిని తప్పించుకుని తిరుగుతారు. అప్పుతీసుకున్నవారు సిగ్గుపడతారు, అప్పిచ్చినవారు కాదు. కానీ మీరు మీ స్నేహితుడిని ఇబ్బంది నుండి రక్షించాలనుకుంటున్నారు. నేను మీ గురించి గర్వపడుతున్నాను నాన్నా! నేను కూడా మీలాగే ఎదగాలని కోరుకుంటున్నాను!" అన్నాడు.
దయగల, ఉదార హృదయం ఇతరులకు మొదటి స్థానం ఇస్తుంది. అపరిచితుల వల్లనైనా కలిగే అసౌకర్యం లేదా మనం చేసే త్యాగం గురించి ఆలోచించదు, ఎందుకంటే ఇతరులకు సహాయం చేయడం అనేది మానవుల అసలైన లక్షణం.
♾️♾️♾️♾️♾️
మనల్ని మానవులుగా మార్చే రెండు ముఖ్యమైన లక్షణాలు ఏమిటంటే, ఇతరుల పట్ల ఔదార్యం, ఇతరుల పట్ల దయతో, కరుణతో కూడిన మన వైఖరి.✍️
బాబూజీమహరాజ్ కి నమస్కారములతో
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
No comments:
Post a Comment