H62.i.i. 2-9. 031022-8.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*చదివేముందు… సున్నితంగా కళ్ళు మూసుకోండి... మంచి పని చేయడం ద్వారా మీ హృదయంలో కలిగిన ఆనందాన్ని అనుభవించండి...!*
ఇప్పుడు చదవడం ప్రారంభించండి...
*నిరుపేదల సేవే గొప్పది*
➖➖➖✍️
ఇది పురాతన కాలంలో, గురుగోవింద్ సింగ్ గారి కృప, కీర్తి విస్తృతంగా వ్యాపించి ఉన్నప్పటి సంఘటన.
ఒకసారి, గురు గోవింద్ సింగ్ ఆనంద్ పూర్ వచ్చారని తెలుసుకున్న ఒక వైద్యుడు, ఆయన దర్శనం కోసం అక్కడికి చేరుకున్నాడు. అతను గురువుగారిని దర్శించుకుని, ఆయన మాటలను అనుసరించాలని నిర్ణయించుకున్నాడు. వెళ్లి పేదలకు సేవ చేయమని గురువుగారు అతడిని ఆదేశించాడు.
స్వగ్రామానికి తిరిగివచ్చిన తర్వాత రోగుల సేవలో నిమగ్నమయ్యాడు. ఆ సేవ ద్వారా అనతికాలంలోనే ఊరంతా పేరు ప్రఖ్యాతులు పొందాడు, ఇది ఈవిధంగా కొన్నాళ్ళు కొనసాగింది.
చాలా కాలం తర్వాత, అకస్మాత్తుగా ఒకసారి గురుగోవింద్ సింగ్ స్వయంగా వైద్యుని ఇంటికి వచ్చారు. తన ఇంట్లో గురువుగారిని చూసి చాలా సంతోషించాడు, కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటానని గురువుగారు చెప్పడంతో, ఆయనకి ఎలా స్వాగతం పలకాలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు.
అప్పుడు అకస్మాత్తుగా ఒక వ్యక్తి పరుగున వచ్చి: "వైద్యుడుగారు, నా భార్య ఆరోగ్యం క్షీణిస్తోంది, దయచేసి తొందరగా రండి, లేకపోతే చాలా ఆలస్యం అయిపోతుంది" అన్నాడు.
అది విన్న వైద్యుడు కంగారు పడ్డాడు. ఒకవైపు, మొదటిసారిగా తన ఇంటికి వచ్చిన గురువు, మరోవైపు నిరుపేద రోగి.
చివరికి, వైద్యుడు కర్మకు ప్రాధాన్యత నిచ్చి, గురువు అనుమతి తీసుకొని, రోగి చికిత్స కోసం వెళ్ళాడు.
సుమారు రెండు గంటల చికిత్స, సంరక్షణ తర్వాత రోగి పరిస్థితి మెరుగుపడింది. ఆపై వైద్యుడు ఇంటికి తిరిగి బయలుదేరాడు.
ఇంటికి నడుస్తూ, గురువుగారికి సమయం లేదు, ఈపాటికి వెళ్ళిపోయి ఉంటారు అని బాధగా అనుకున్నాడు.
అయినప్పటికీ, వైద్యుడు పరుగుపరుగున ఇంటికి చేరుకున్నాడు.
ఇంటికి చేరిన అతను చాలా ఆశ్చర్యపోయాడు, గురువుగారు అతని కోసం వేచి ఉన్నారు.
అది చూసిన వైద్యుని హృదయం ఆనందంతో నిండిపోయి, కళ్లలో నీళ్లతో, గురువుగారి పాదాలపై పడ్డాడు.
గురుగోవింద్ సింగ్ అతన్ని కౌగిలించుకుని, *"నువ్వు నా నిజమైన శిష్యుడివి. పేదవారికి సహాయం చేయడమే అన్ని సేవల్లో ఉత్తమమైన సేవ"* అని అన్నారు.
ప్రపంచంలోని ఇతర సేవలు, దానం,జపం, తపస్సు అన్నీ మనకోసం మనం చేసుకుంటాం. అయితే మొట్టమొదటగా పేదవారికి, ఆపన్నులకు సేవ చేయాలి.
♾️
ఒక ఉదాత్తమైన పని చేసినప్పుడు, దాని నుండి మీకు లభించే ఆనందాన్ని ఇతరులతో పంచుకోండి. అప్పుడు చైతన్యం నిరంతరం విస్తరిస్తుంది. ✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment