Wednesday, October 5, 2022

భగవంతుని అనుగ్రహము మూలాన కర్మఫలం కుదించబడి వేగముగా కర్మఫలం నుండి విముక్తులం అవుతాం.

 041022a0856. 051022-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀654.
నేటి…

              ఆచార్య సద్బోధన:
                 ➖➖➖✍️


మానవుడు కర్మ బద్ధుడు. పొలములో ఎట్టి విత్తనము జల్లుతామో అట్టి పంటనే పొందడం జరుగుతుంది. 

పాప కర్మలు చేస్తూ పుణ్యమును ఆశించడం మూర్ఖత్వం.

కర్మల ఫలాలను మార్చుకోవడం గానీ, తొలగించుకోవడం గానీ కుదరదు! 

కేవలం అనుభవించి వదిలించుకోవడం తప్ప మరో మార్గం లేదు.

అయితే కర్మ ఫలాన్ని మార్చలేక పోయినా మనలో ఉండిన దానవత్వాన్ని దైవత్వముగా మాత్రం మార్చుకోవచ్చు.

స్మరణ, భజన, ధ్యానము, సేవలు వంటి సాధనల ద్వారా మనలో దైవత్వం చేరిన వెంటనే పాప కర్మలు చేయడం కట్టడి అవుతుంది.

భగవంతుని అనుగ్రహము మూలాన కర్మఫలం కుదించబడి వేగముగా కర్మఫలం నుండి విముక్తులం అవుతాం.  

ఊరికే ఏదీ రాదు! ఊరికే ఏదీ పోదు!! లేచి సాధన చేయాలి.✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖ 

No comments:

Post a Comment