Friday, October 21, 2022

సాపేక్ష చలనం అంటే నిశ్చలమే

 *సాపేక్ష చలనం అంటే నిశ్చలమే*
మనస్సు నిశ్చలంగా వుండాలి అని మనం కోరుకుంటాం, ఎందుకంటే మనస్సు నిశ్చల స్థితి లోనే శాంతంగా వుంటుంది.
     నిశ్చలం అంటే కదలకుండా వుండటం కాదు. కదులుతూ వుండటం. అవును కదులుతూ వుండటం.
       మన చుట్టూ ప్రపంచం కదిలిపోతూ వుంది. అదే వేగంతో మన మనస్సు కూడా
 కదిలితేనే  సాపేక్షంగా నిశ్చలంగా వున్నట్లు. లేకుండా కదలక పోయినా  చలిస్తూ వున్నట్లే.
  ఉదా. మన కంటి ముందు దృశ్యం (సంఘటనలు, విషయాలు) కదిలిపోతూ వుంది.
మన చూపు కూడా కదిలిపోతూ వుండాలి.
 అలా కాక కదిలిపోతూ వున్న దృశ్యాలలో ఏదో ఒక దృశ్యం మీద మన  కన్ను నిలబడి పోతే  
మనం కదిలినట్టే. ఇది సాపేక్ష ప్రభావం.
  ఇట్లు
భూమాత లేని భూమి

No comments:

Post a Comment