*(పాపాలు - నివారణోపాయాలు)*
పొరుగు వ్యక్తి: అయ్యా! మేం పాపులం. మా గతి ఏమిటి?
శ్రీ రామకృష్ణులు: భగవన్నామ గుణ కీర్తనలు చేస్తే దేహపు పాపాలన్నీ ఎగిరిపోతాయి. దేహమనే వృక్షంపై పాపాలనే పక్షులు వాసన చేస్తాయి. భగవన్నామ కీర్తన, చేతులతో చప్పట్లు కొట్టడం లాంటిది. చేతులతో చప్పట్లు కొట్టగానే చెట్ల మీద పక్షులు ఎగిరిపోయేట్లు, భగవన్నామగుణ సంకీర్తనమనే చప్పట్లకు పాపాలన్నీ పలాయనమవుతాయి.
No comments:
Post a Comment