Friday, March 10, 2023

పరమాత్మను దర్శించాలి, అంటే ఎక్కడకో వెళ్ళి దర్శించనక్కరలేదు.

 🕉పరమాత్మను దర్శించాలి, అంటే ఎక్కడకో వెళ్ళి దర్శించనక్కరలేదు. దర్శించడానికి,చూడడానికి,
ఆయన ఒక పదార్థం కాదు. చూడబడే వస్తువు కాదు. నీవు గుడిలో దర్శించేది నీవు ( శిల్పి )తయారు చేసిన విగ్రహాన్ని మాత్రమే..ఆ విగ్రహంలో నీవే ( బ్రాహ్మణులు) ప్రాణ ప్రతిష్ట చేసి దేవునిగా ఆ విగ్రహానికి ఒక రూపం ఇచ్చి పేరు పెట్టీ దేవునిగా కొలుస్తూ చూస్తున్నావు. ఒక్క విగ్రహం లోనే నీవు దేవుని చూడడం నేర్చుకున్నావు.కానీ దేవుని చూడడానికి ఎక్కడికో వెళ్ళనక్కరలేదు.నీవు ఉన్న ప్రదేసంలో,నీవు ఉన్న ఈ క్షణంలో దైవాన్ని చూడవచ్చు.

నీవు భౌతికంగా చూసే గుడిలో నీ నేత్రాలకు విగ్రహం,చుట్టూ ఉండే మనుష్యులు చెట్లూ, గోడలు కనిపిస్తాయి . దేవుడు అక్కడ మాత్రమే ఉంటాడు , అని నీ అభిప్రాయం.దేవుడు అక్కడే కాదు నీవు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు. భగవానుడు చెప్పాడు నేను ప్రతీ చోట, ప్రతీ ఒక్క జీవిలో ఉన్నాను, అని.కానీ నీవు చూసే నీ భౌతిక నేత్రాలకు దైవం యొక్క తన నిజ దర్శనం నీకు కనబడదు. నీవు దైవాన్ని చూద్దాం నేర్చుకోలేదు.దేవుని విగ్రహాన్ని చూడడం నేర్చుకున్నావు.

కస్తూరి మృగము అడవిలో ఎక్కడ నుండో మంచి సుగంధం వాసన వస్తుంది, అని అడవినంతా తిరుగుతుంది.కానీ ఆ సువాసన వస్తుంది, తన కడుపులో నుండి అన్న విషయం తనకి ఎప్పటికీ తెలియకున్నట్లు, ప్రస్తుతం అందరూ దైవాన్ని చూడడానికి ఎక్కడెక్కడికో తిరిగాడుతుంటారు.

సముద్రంలో ఉన్న నీరు బయటికీ వచ్చి సముద్రాన్ని వెదికినట్లు ,దైవం నుండి వచ్చిన ఈ జీవి పరమాత్మ నుండి వచ్చిన తాను పరమాత్మను ఎక్కడని దర్శిస్తాడు? 

బంగారం నుండి తయారైన బంగారపు వస్తువు తానే బంగారంలో ఉన్నాను, అన్న విషయం ఆ బంగారపు వస్తువుకు తెలియదన్నట్లు, దైవాన్ని చూడడానికి ఎక్కడెక్కడికో తిరుగుతుంటారు.

మహా వృక్షము నేను మహా వృక్షాన్ని అనుకుంటుంది, నిజానికి తనను తాను చూసుకోవడం తనకు తెలియదు .తాను ఇంకొక చోట మరలా మోలవాలి,అంటే ఎలాగో దానికి తెలియదు. ఒక విత్తనం ద్వారా మొలకెత్తి ఈ రోజు మహా వృషంలా ఎదిగాను , తానే విత్తనము అని, విత్తనంలోనే తాను ఉన్నాను అని,తన ఫలమైన తానే ఎండి పోతే తనే  ఒక విత్తనంగా , మరియు ఎన్నో విత్తనాలుగా  మరతాను అని ఆ మహా వృక్షానికి తెలియదు. అలాగే ఆ పరమాత్మ నుండి వచ్చిన ఈ జీవికి తాను ఆ పరమాత్మ నుండి ఉద్భవించిన ఆత్మ స్వరూపాన్ని అని తెలియడం లేక ఎక్కడెక్కడికో దైవం కోసం తీరుగాడుతుంది.తిరిగి , తిరిగి అలసిపోయి ఎప్పుడో ఒకప్పుడు తెలుసుకుంటుంది తానే తన నిజ స్వరూపం అని.

మట్టి , తాను ఒక వస్తువు రూపం దాల్చి ,తనకు తన యజమాని పెట్టిన పేరుని తలుచుకుంటూ తాను ,తన పేరే నిజమని తలుస్తూ, తాను ఒక మట్టిని  అన్న విషయం ఆ మట్టి కుండకు తెలియనట్లు ,

 ఈ ఆత్మకు జీవత్వం వచ్చి శరీరం దాల్చి ఈ శరీరానికి ఒక రూపం కల్పించుకుని,ఒక నామం పెట్టించుకుని ఆ నామంతో పిల్పించుకుని ఆ నామమే తన ఉనికని ఆ నామమే తాను అనుకుని బ్రమాలో పడి తన యొక్క బృహం మరచి తనకోసం తానే తెలుసుకోవడం మరచి , దైవం అంటే ఎక్కడో బయట ఉంటుందని,తనని తానే ఒక విగ్రహ రూపంలో చూసుకోవడానికి ఎక్కడెక్కడికో తిరుగుతుంది. తిరిగి , తిరిగి విగ్రహాన్ని చూసి ఆ విగ్రహంలో దైవాన్ని చూసి మురిసిపోతుంది.కానీ ఆ విగ్రహంలో ఉన్నది తానే అని తెలియని మాయలో తాను ఉన్నాను అన్న సత్యం తనకు తెలియరాకున్నది

ఎప్పుడైతే తాను తిరగడం ఆపి తన భౌతిక నేత్రాలను మూసి తన మనో నేత్రం కూడా మూసి తన జ్ఞాననేత్రంతో చూస్తుందో , దర్శిస్తుందో,తనయొక్క తన తత్వాన్ని అనుభూతి చెందుతుందో అప్పుడు తనను బ్రహ్మం అని తాను గుర్తిస్తుంది. తాను దైవత్వంతో ఉన్నానని ,లోపడ , బైట అనేది  లేనే లేదు అని ,ఉన్నది అంతా ఒక్కటే అని, ఉన్నదంతా దైవమయమని , ఉన్నది అంతా దైవత్వమే అని  , కనిపిస్తున్నది,కనిపించది అంతా దైవమే అని, తానే దైవత్వంలో ఉన్నానని, దైవత్వమే తనలో ఉన్నది అని , తానే దైవం అని తనకి మారుగా వేరే ఏదీ లేదని తెలుస్తుంది. ఉన్నది అంతా తానే అని తెలుస్తుంది అనగా గుర్తిస్తుంది.

🕉🙏 

No comments:

Post a Comment