*12000 మరణాలను చూసిన వ్యక్తి చెబుతున్న జీవిత సత్యాలు*
కాశీలో మరణిస్తే “మోక్షం” ప్రాప్తిస్తుంది అని హిందువులలో ఒక విశ్వాసం. అందుకోసం జీవిత అంత్యకాలం కాశీలో గడపడానికి వెళుతూ ఉంటారు .
అటువంటి వారికీ వసతిని కల్పించే ముఖ్యమైన మూడింటిలో కాశీలాభ్ ముక్తిభవన్ ఒకటి. మిగతా రెండూ ముముక్షు భవన్, గంగాలాభ్ భవన్ .
1908లో కాశీలాభ్ ముక్తి భవన్ స్థాపించబడింది.
44 సంవత్సరాల పాటు కాశీలాభ్ ముక్తి భవన్ మేనేజరుగా పనిచేసిన భైరవనాద్ శుక్లా ఆ భవనం ఎదుట ఎర్రని గోడల ముందు చెక్క కుర్చీలో కూర్చుని చెప్పిన విషయాలు ఇపుడు నేను మీ ముందు ఉంచబోతున్నాను.
1. Resolve all conflicts before you go
(అంత్య కాలానికి ముందే క్రోధాన్ని విడనాడు):
శ్రీరాం సాగర్ అనే ఒక సంస్కృత పండితుడు ఆరుగురు అన్నదమ్ములలో పెద్దవాడు. చిన్న తమ్ముడు అంటే ఇష్టం. కానీ కాలక్రమంలో ఇద్దరి మధ్య గొడవలు వచ్చి ఇంట్లో అడ్డుగా గోడ కట్టించే వరకూ వెళ్ళింది.
ఆయన తన అంత్యకాలంలో కాశీలాభ్ ముక్తి భవన్ లో మూడవ నెంబరు రూమ్ బుక్ చేసుకున్నారు. తాను ఇంకొక పదహారు రోజులలో చనిపోతాను అని ఆయనకు ముందే తెలుసు. 3 రోజులు గడిచిపోయాయి. 4వ రోజున ఆయన తన తమ్ముడికి కబురు పెట్టాడు.
“40 ఏళ్ల క్రితం నా తమ్ముడితో గొడవపడిన విషయం నన్ను కలిచివేస్తోంది. నేను సుఖంగా మరణించలేను . నాలో ఉన్న క్రోధం పోవాలి” అన్నాడు .
తమ్ముడు 16వ రోజు నాటికి వచ్చాడు. తమ్ముడిని చూడగానే అన్న కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. తమ్ముడి చెయ్యి తన చేతిలోకి తీసుకుని తమ్ముడి తల నిమురుతూ “ఆ గోడ పడగొట్టేయ్యి” అన్నాడు. అన్నదమ్ములిద్దరూ భోరున విలపించారు. తమ్ముడి చేతిలో ప్రశాంతంగా ప్రాణాలు వదిలాడు అన్న .
భైరవనాద్ శుక్లా ఇలా అంటున్నారు “ఇటువంటి కధలు నేను ఎన్నో చూశాను. ఇక్కడకి వచ్చే వాళ్ళు బోల్డంత లగేజీతో వస్తారు. అందులో ఏదీ కూడా తీసుకువెళ్ళలేరు. జీవితంలో ఘర్షణలు లేకుండా ఎవరూ ఉండరు. కానీ వాటిని ఎంత తొందరగా పరిష్కరించుకుంటే అంత మంచిది. అంత సంతోషం పొందుతారు”
2. Simplicity is the truth of life
(సాధారణంగా జీవించడం) : చనిపోతాము అని తెలిసిన దగ్గరనుండి చెత్త తిండి తినడం మానేస్తారు చాలామంది. అప్పటికి కానీ చాలామందికి తాము సింపుల్ జీవితం గడిపి ఉండవలసింది అని అనిపించదు.
“సింపుల్ జీవితం అంటే తక్కువ ఖర్చుపెట్టడం.
ఎక్కువ ఖర్చు పెట్టడం కోసం ఎక్కువ సంపాదించాలి అనుకోవడం. ఎక్కువ తాపత్రయపడటం కన్నా తక్కువలో సంతృప్తి పొందడం నేర్చుకుంటే ఆనందంగా జీవించవచ్చు” అంటారు భైరవనాద్ శుక్లా.
3. Filter out people’s bad traits
(ప్రజలలో ఉన్న చెడు లక్షణాలను మాత్రమే చూడకు):
భైరవనాద్ శుక్లా ఇలా అంటారు “ప్రతీ మనిషిలోనూ మంచీ చెడూ రెండూ ఉంటాయి . మనం ఎదుటివ్యక్తిలోని చెడును మాత్రమే చూసి మంచిని పట్టించుకోము. వారిలోని మంచిని గుర్తిస్తే మనం వారితో స్నేహం మాత్రమే కాదు, వారిని ప్రేమించడం కూడా నేర్చుకోగలం”
4 Be willing to seek help from others
(ఇతరుల సహాయం పొందడం కూడా నేర్చుకో) :
మనం శక్తివంతులుగా తయారు కావడం మంచిదే కావచ్చు . ఎంత శక్తిమంతుడైనా అన్నీ తానే చేసుకోలేడు. ఆ విషయంలో తాను ఇతరులకు సహాయపడడంతో పాటు ఇతరుల సహాయం అర్దించే ధైర్యం కూడా ఉండాలి.
భైరవనాద్ శుక్లా 80 లలో జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకుంటున్నారు. ఒక రోజు వర్షం కురుస్తూ ఉంటే కొందరు యువకులు ఒక ముసలామెను తీసుకుని వచ్చారు. వాళ్ళు ఆమెను జాయిన్ చెయ్యడానికి కావలసిన దరఖాస్తు నింపకుండా వెళ్ళిపోయారు.
తర్వాత పోలీసులు వచ్చారు. ఆమెను తీసుకుని వచ్చినవారు నక్సలైట్లు అని చెప్పారు పోలీసులు. మర్నాడు వాళ్ళు వచ్చినపుడు నేను అడిగాను “మీరు ఒకేసారి చాలా మందిని షూట్ చేసి చంపగలిగినపుడు ఆ ముసలామెను కూడా అలా చెయ్యొచ్చు కదా! మీరె ఆమెను సమాధి చెయ్యొచ్చు కదా! నేను అబద్ధం చెప్పే పరిస్థితి ఎందుకు కలిగించారు ?”
అందులో ఉన్న ఆమె మనుమడు మోకాళ్ళపై కూలబడి అన్నాడు. “మాలో ఎవరమూ ఆమె మోక్షం పొందే విధంగా ఆమెకు సహాయపడలేము. ఇక్కడ ఉంటే ఆమె తప్పక మోక్షం పొందుతుంది అందుకే ఇక్కడకు తీసుకువచ్చాము. మమ్మల్ని క్షమించండి”
5 Find beauty in simple things
(చిన్న చిన్న విషయాలలో అందం ఉంది):
మా ముక్తిభవన్ లో ప్రతీ రోజూ మూడు సమయాల్లోనూ భజనలు జరుగుతూ ఉంటాయి. కొందరు ఆ భజనలలో ఎంతో ఆనందంతో కీర్తనలు పాడతారు. దారిన పోయే వారు కూడా ఆ ఆనందం పంచుకోవడం కోసం కొంత సేపు అక్కడ చేరుతారు. కానీ కొందరు అది తమ ఏకాంతానికి ఆటంకం అనుకొంటారు.
6. Acceptance is liberation
(సమస్యలనుండి పారిపోకు):
కొందరు తాము ఉన్న స్థితిని అంగీకరించలేరు. ఇలా అంగీకరించలేక పోవడం వారిలో నిరాశ నిస్పృహలను కలిగించి ఒత్తిడి పెంచుతుంది. నీవు ఉన్న స్థితిని నీవు అంగీకరిస్తే సమస్యల నుండి నీవు బయట పడడం నేర్చుకోగలవు. లేదంటే నీవు చీకటిలోనే ఉంటావు. సమస్యను నీవు గుర్తిస్తే పరిష్కారం కోసం అన్వేషించగలవు, దానిని ఎదుర్కోగలవు . అపుడు నీవు శక్తి మంతుడవు అవుతావు
7.Accepting everyone as the same makes service easier
(అందరి పట్ల సమభావంతో ఉండు):
ముక్తి భవన్లో చేరిన ప్రతీ ఒక్కరినీ ఒకే విధంగా కాకుండా వారి కులమూ, మతమూ, డబ్బూ, సాంఘిక, ఆర్ధిక స్థితి గతులను బట్టి నేను చూడడం మొదలు పెడితే వారికీ నాకూ కూడా శాంతి ఉండేది కాదు. ఎదుటి వ్యక్తులను సమభావంతో నీవు చూసిననాడు నీకు ప్రశాంతత ఉంటుంది. నీ పని నీవు చక్కగా చెయ్యగలుగుతావు .
8. If/When you find your purpose, do something about it
(నీ లక్ష్యాన్ని నువ్వు గుర్తించు. సాధించే ప్రయత్నం చెయ్యి):
నీ జీవిత లక్ష్యం ఏమిటి అనేది గుర్తించడం మంచిది. చాలా మందికి ఏమి చెయ్యాలో తెల్సు కానీ ఏమీ ప్రయత్నం చెయ్యకుండానే జరిగిపోవాలి అనుకుంటారు.
9. Habits become values
(నీ మంచి అలవాట్లు విలువలుగా మారతాయి):
మంచి అలవాట్లను చేసుకో! అది నీకు మంచి విలువలను నేర్పుతుంది. మంచి అలవాట్లను అభ్యాసం చేతనే నేర్చుకోవాలి. సత్యమూ, దయా, సానుభూతీ, నిజాయతీ ఇవేవీ నీ ప్రయత్నం లేకుండా వాటంత అవి రావు.
10. Choose what you want to learn
(నీవేమి నేర్చుకోవాలో నీవే నిర్ణయించుకో):
ఈ ప్రపంచంలో ఎంతో విజ్ఞానం ఉంది. అందులో నీవు ఏది కావాలి అనుకుంటున్నావో దాన్ని ఎంచుకో! పెద్దవారి సూచనలు పరిగణనలోకి తీసుకో. ఇక్కడకి వచ్చిన వారు ఆఖరు దశలో ఉంటారు. నడవలేరు, మాట్లాడలేరు. అపుడు వారిలోకి వారు వెళ్ళడం మొదలు పెడతారు. వారి అనుభవాలలోనే వారు కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటారు. నేర్చుకున్నదానిని నెమరు వేసుకుంటూ ఉంటారు.
11. You don’t break ties with people; you break ties with the thought they produce
(నీవు ప్రజలతో సంబంధాలు తెంచుకోకు , వారు రగిలించిన ఆలోచనలతో సంబంధం తెంచుకో):
నీవు ప్రేమించిన వ్యక్తులు, నీకు ఆప్తులు అయిన వ్యక్తులు నీతో అన్ని విషయాలలోనూ ఏకీభవించకపోవచ్చు. మీ మధ్య భేదాభిప్రాయం ఆలోచనలలోనే తప్ప వ్యక్తులతో కాదు. నీవు నేర్చుకోవలసినది వారిపై ప్రతీకారభావం కాదు. వారి పట్ల కఠిన హృదయం కాదు.
12. 10 percent of what you earn should be kept aside for dharma
(నీ సంపాదనలో పది శాతం దానం కోసం కేటాయించుకో):
ధర్మం అంటే మత సంబధం కాదు. మంచిని చెయ్యడం. ఒక పది శాతం సంపాదన ఇందుకు కేటాయించుకో! చాలామంది జీవిత అంత్య కాలంలో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. వృద్ధాప్యం వలన వారికి కలుగుతున్న అసౌకర్యాలు ఇతరులకూ కలుగుతున్నాయని తెలుసుకుని అవి తొలగాలని కొంత సహాయ పడుతూ ఉంటారు.
ఎవరైతే ఆప్యాయతను పొందుతూ ఉంటారో, అపరిచితుల ప్రేమను పొందుతారో, వారు ప్రశాంతంగా ప్రాణం విడువగలుగుతారు.
నీవు సంపాదించినదంతా నీవే అనుభవించాలి అనుకోకు. కొంత ఇతరులకు మిగుల్చు
ఇది ప్రతీ ఒక్కరూ చదవవవలసిన పోస్ట్. ఒరిజినల్ ఇంగ్లీష్ లో చాలా బావుంది
-- రాఘవానంద్ ముడుంబ
No comments:
Post a Comment