*🕉️🙏మహాభారతంలోని ఓ కథ…🕉️🙏*
*🕉️🙏అభిమానమే బంధన*🕉️🙏
*ఈరోజు మనం - ఎన్నో పూజలు, భజనలు, సాధనలు, చేస్తుంటాము, అయినా సాధనలో ముందుకు వెళ్లలేకపోతాము, దీనికి కారణం ఏమిటి?*
*ప్రతివారి మనసులో ఉన్న ఒకే ఒక్క ఆలోచన..!*
*దానికి సంబంధించిన…మహాభారతం లోని ఒక చిన్న సంఘటన చూద్దాం..!*
*ఒకానొక సమయంలో రాధ తన చెలికత్తెలను తీసుకొని మధుర నుండి బృందావనానికి బయలుదేరి పడవలో వెళ్లాలని సంకల్పంతో...*
*తెల్లవారక మునుపే లేచారు,గుంపంతా పడవలో కూర్చున్నారు. వంతుల ప్రకారం ఒకరి తరువాత మరొకరు తెడ్లు వేసుకుంటూ నడుపుతూ ఉన్నారు...*
*చాలాసేపు చేసారు ఈ ప్రయాణం ! చేతులంతా నొప్పి వచ్చాయి, తెల్లవారింది, కాని, పడవ మధుర రేవులోనే ఉంది!*
*తెల్లవారింది కాబట్టి మధుర వాళ్ళంతా వచ్చి నీళ్ళు ముంచుకొని పోతున్నారు...*
*అది చూసి ... ఆశ్చర్యంగా ఏమిట్రా దీనికి కారణం? అని చూసుకుంటే, ఆ పడవ ఒక కఱ్ఱకు కట్టివేయబడి ఉంది,*
*ఆ కఱ్ఱకు కట్టిన త్రాడును వీళ్ళు విప్పలేదు పాపం!*
*అది విప్పకుండా ఎంతసేపు తెడ్లు వేసినా పడవ ముందుకు కదులుతుందా? ఉన్న చోటే ఉంటుంది.*
*"అదేవిధంగా, మనం ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని జపతపాదులు చేసినా అభిమానంతో కట్టిన మనస్సును విప్పకపోతే చేరవలసిన స్థానమును చేరలేము"...*
*"ముందు అహంకార మమకారములనే త్రాడును విప్పాలి, త్యాగం చేయాలి, అన్నివిధాలా బంధవిముక్తి గావించుకున్నప్పుడే పూర్ణమనస్సు ఆవిర్భవిస్తుంది".*
*పూర్ణమనస్సునందు ఎలాంటి దోషములూ కనిపించవు, ఈనాడు మనం దుఃఖానికి గురి అవుతున్నామంటే - ఎవరో దీనికి కారకులు కాదు; మన భావములే కారణం.*
*మన దోషములే మనకు కష్టాల నందిస్తాయి, ఈ సత్యాన్ని గుర్తించాలి, సత్యము, ప్రేమ, సహనము ఇత్యాది సద్భావములను హృదయంలో నింపుకున్నప్పుడు జీవితమే సుందరమైన నందనవనంగా రూపొందుతుంది కాని, దుర్భావములతో నింపుకున్నప్పుడు జీవితము మలమూత్ర దుర్గంధములతో కూడిన "వైతరణీనది” గా ప్రవహిస్తుంది...*
*కనుక, ఎవరికి వారు గుర్తించుకోవచ్చు, “నేను సుందరమైన నందన వనమునా? లేక, వైతరణీ నదినా?" అని.*
*దీనిని పరులెవ్వరికీ గుర్తించడానికి వీలుకాదు, ఎవరిది వారికి మాత్రమే తెలుసు*.
*ఎవరికి వారే సాక్షి, ఇంకొకరి సాక్ష్యం అక్కరలేదు. దీనినే "ఆత్మసాక్షి" అన్నారు. నీవు తప్పు చేసే ఒప్పు చేసినట్లుగా అభినయం చేయవచ్చు.*
*మన అభినయం లోకానికి మంచిగా కనిపించవచ్చుకాని, లోపల దోషం మనలను ఎల్లప్పుడు హింసిస్తుంది...*🕉️🙏
. *🕉️🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*🕉️🙏
*🕉️🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🕉️🙏*
No comments:
Post a Comment