*ఎవరు సంతోషంగా ఉంటారు?’*
తన భోజనాన్ని తాను వండుకునేవారు, అప్పులు లేనివారు, దూరతీరాలకు ప్రయాణించని వారు సంతోషంగా ఉంటారు.
మనిషి ఉన్నంతలో తృప్తిగా జీవిస్తూ ఉండటంలోని ఆనందం మరి దేనిలోనూ రాదు.
పాశ్చాత్యులు అధికంగా సంపాదించడం ద్వారా తమ జీవిత సమస్యలకు పరిష్కారాలు వెదుకుతుంటే, భారతీయులు ఉన్నదానితో సంతృప్తిగా జీవించడంలోనే తమ జీవిత సమస్యలకు పరిష్కారం కనుగొంటున్నారు అంటారు స్వామి వివేకానంద.
సహజంగా మనిషి ఆనందస్వరూపుడు.
అతడికి గతంతోను, భవిష్యత్తుతోను సంబంధం ఉండదు. ఉన్నచోట, ఉన్నక్షణంలో సంపూర్ణంగా జీవించడమే ఆనందానికి మార్గమని గ్రహిస్తాడు.
అతడు వర్తమానంలోని ప్రతి క్షణాన్నీ సంపూర్ణంగా ఆస్వాదిస్తాడు.
ఆనందస్వరూపుడైన వ్యక్తి ఈ సృష్టిలోని ప్రతి వస్తువులోనూ ఏదో ప్రత్యేకత ఉందని తెలుసుకుంటాడు.
అందుకే ప్రతి వస్తువుపట్లా సమభావం, సమదృష్టి కలిగి ఉంటాడు.
మానవ జన్మ లభించడమే ఒక వరం. అలాంటి జన్మను సార్థకం చేసుకోవడానికి మనిషి ప్రయత్నించాలి.
మనిషి లోకోత్తర ధర్మాలైన దానం, పరోపకారం, సేవ వంటి దైవీ గుణాలు అలవరచుకుని ఆర్తులను ఆదుకున్నప్పుడే శాశ్వతమైన ఆనందాన్ని పొందగలుగుతాడు.
మానవసేవ మధురమైన పరిమళం లాంటిది. ప్రతి మనిషీ ఇతరుల వెతలను దూరం చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడు లభించే సంతోషం వర్ణనాతీతం.
ఆ సేవే మనిషికి మరిచిపోలేని అనుభూతిని, ఆనందాన్ని ఇస్తుంది.
మనిషిని మహానుభావుడిని చేస్తుంది!
No comments:
Post a Comment