Thursday, May 11, 2023

 బ్రహ్మ జ్ఞానాన్ని కలిగి ఉన్న బ్రహ్మర్షులంతా కూడా "ఈ దృశ్యమాన ప్రపంచం అంతా కూడా నశించిపోయేదే., రకరకాల అనుభవాల ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఇక్కడికి విచ్చేసిన ఆత్మ ఒక్కటే శాశ్వతం" అన్న సత్యాన్ని తెలుసుకుని స్థితప్రజ్ఞులలా జీవిస్తుంటారు.

ఏది తెలుసుకుంటే ఇంకా ఏదో తెలుసుకోవాలని ఆరాటం ఉంటుందో -- అది సాపేక్ష జ్ఞానం (ద్వైతం)
లోకంలో 99.99% సాపేక్ష జ్ఞానాలే.

ఏది తెలుసుకుంటే ఇంక తెలుసుకోవాల్సినది ఏది మిగిలి ఉండదో -- అది నిరపేక్ష జ్ఞానం (అద్వైతం)

[3/29, 19:36] +91 92473 43585: ➡️ అవసరానికి మించి ఆశించడం - మానసిక రోగం
➡️ అవసరానికి మించి అనుభవించడం - శారీరక రోగం
[3/29, 19:50] +91 92473 43585: బండి చక్రం ఎంత పెద్దదైన నిలబడి ఉంటే, నేల మీద ఉండేది ఒక బిందువంతా స్థలంలోనే.

అదేవిధంగా జీవితం ఎంత సుదీర్ఘమైనా, వర్తమానం అనే ఒక ఒకానొక బిందువు మీద మాత్రమే అది నిలిచి ఉంటుంది.

👉 నీ గతాన్ని తెలుసుకోవాలంటే దాని ఫలితమైన వర్తమానాన్ని పరిశీలించు.
👉 నీ భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటే దానికి కారణమైన వర్తమానాన్ని పరిశీలించు.

➡️ "నేను శరీరం" మాత్రమే అనుకుంటే ఆ జీవితం - మహా సంక్షోభం
➡️ "నేను ఆత్మను" అనుకుంటే ఆ జీవితం - మహా సంబరం

[4/1, 19:11] +91 92473 43585: ప్రతి అనుభవము., మన జీవితాన్ని మనకు ఒకానొక ప్రత్యేక కోణంలో చూపిస్తుంది.

ఎన్ని రకాల అనుభవాలు సంపాదిస్తే... అంతటి "సుసంపన్న ఆత్మ" అవుతుంది.
[4/1, 19:26] +91 92473 43585: సుఖంలో కళ్ళు మూసుకుపోతాయి.

దుఃఖంలో కళ్ళు తెరుచుకుంటాయి.


[4/11, 19:33] +91 92473 43585: నిన్నెవరు పట్టించుకోకపోవడం - ఒంటరితనం.

నీవు ఎవరిని పట్టించుకోకపోవడం - ఏకాంతం.
[4/12, 19:41] +91 92473 43585: ➡️ తన మూలం తెలియకపోతే తాను 'బాబు'గా ఉంటాడు. 
➡️ మూలం తెలిస్తే తానే మూలంగా ఉంటాడు.

 ఉపనిషత్తులో చెప్పిన కింద పక్షి - పై పక్షి వలె.

➡️ అమ్మ ప్రసవించక మునుపు తాను తల్లి గర్భంలో ఉంటాడు అద్వైతంగా;
➡️ ప్రసవించిన తర్వాత తాను తల్లి ఒడిలో ఉంటాడు ద్వైతంగా.

➡️ జీవన్ముక్తికి మునుపు ప్రపంచంలో ఉంటాడు ద్వైతంగా.
➡️ జీవన్ముక్తి తర్వాత ప్రపంచానికి అవకాశం గా ఉంటాడు అద్వైతంగా.

[4/17, 19:15] +91 92473 43585: ఉండేది దైవ సంకల్పమే.

మన సంకల్పం కూడా దైవ సంకల్పంలో భాగమే.
[4/20, 19:24] +91 92473 43585: నా పరిమితులు నాకు తెలుసు; 
నా అపరిమితులు నాకు తెలియదు.

➡️ ఇక్కడ (పరిమితులు) తెలియడం జ్ఞానం.
➡️ అక్కడ (అపరిమితం) తెలియకపోవడం  జ్ఞానం.
[4/21, 20:11] +91 92473 43585: మేలుకొన్న తర్వాత స్వప్నం ఉండదు.
మరణం తర్వాత ప్రపంచం ఉండదు.

 ఎవడి కల వాడిదే., ఎవడి లోకం వాడిదే.
[4/24, 19:53] +91 92473 43585: ➡️ జగన్మిథ్య అన్నారు - శంకరాచార్యులు.
➡️ సర్వం ఖల్విదం బ్రహ్మ అన్నారు - వేద ఋషులు. 
రెండింటిలో ఏది సత్యం?

రెండు సత్యమే.
👉 మొదటిది సాధనావస్థలో చెప్పబడింది.
👉 రెండవది సిధ్ధ్యావస్థలో చెప్పబడింది.




ప్రస్థానత్రయం:-

ప్రస్థానత్రయం అనగా బ్రహ్మ విద్యను పొందే త్రివిధ మార్గాలు. మన సనాతన ధర్మంలో ఈ మూడింటిని Supreme Knowledge గా చెప్తారు. అవి
1. భగవద్గీత - చెప్పేవాళ్లు కోకొల్లలు.
2. ఉపనిషత్తులు - వివరించేవాళ్లు కొందరే.
3. బ్రహ్మ సూత్రాలు - వివరించేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు.


➡️ యవ్వన దశలో తన తలపై ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనబడదు.
➡️ కౌమార దశలో ఒక్కో తెల్ల వెంట్రుక కనబడుతూ ఉంటుంది.
➡️ వృద్ధాప్యంలో ఒక్క నల్ల వెంట్రుక కూడా కనబడదు.

ఆధ్యాత్మికంలో కూడా అంతే..
➡️ తొలిదశలో ఒక్క జ్ఞాని కూడా కనబడడు.
➡️ మలిదశలో అక్కడక్కడ జ్ఞానులు కనబడతారు.
➡️ తుది దశలో ఒక్క అజ్ఞాని కూడా కనబడడు.



No comments:

Post a Comment