"నేను" అనేది నాలుగు తత్త్వాలుగా ప్రస్ఫుటమవుతోంది.
అవే -- మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు.
➡ సంకల్ప వికల్పాలు చేసేటప్పుడు 'మనస్సు'గా
➡ నిత్యానిత్యాలను, మంచి చెడులను చెప్పేటప్పుడు 'బుద్ధి'గా
➡ నిరంతర చింతన చేసేటప్పుడు 'చిత్తం'గా
➡ నేను, నాది అనేటప్పుడు 'అహంకారం'గా
-- ఆత్మ పదార్ధం ప్రస్ఫుటమవుతోంది.
👉 మనస్సుని శుద్ధి చేయవలెనంటే 'కర్మయోగం'
👉 బుద్ధిని సునిశితం చేయవలెనంటే 'జ్ఞానయోగం'
👉 చిత్త వృత్తులను నిరోధించవలెనంటే 'రాజయోగం'
👉 అహంకారాన్ని అంటే నేను, నాది అనే భావాలను పూర్తిగా తుడిచిపెట్టుకు పోవాలంటే 'భక్తియోగమే' మార్గము.
No comments:
Post a Comment