గంగాధరుని ఫాలభాగంపై విబూధి రేఖలు జీవాత్మ, ఆత్మ, పరమాత్మలకు సంకేతాలు. జీవాత్మ తనలోని ఆత్మ స్వరూపాన్ని తెలుసుకుని పరమాత్మతో కూడి ఉండాలన్నదానికి నిదర్శనం. జీవాత్మేపరమాత్మ అన్న సత్యాన్ని,
జ్ఞానాన్ని తెలియజేసేదే త్రినేత్రం. అది మనపాలిట జ్ఞాననేత్రం. వేదములు, పురాణ ములు ఏకకంఠముతో విభూతి మహిమను చాటి చెబుతాయి. భస్మస్నానము చేసినవారు సర్వతీర్ధ దర్శనం చేసినవారితో సమానం. భస్మధారణ చేసిన వారిని దుష్ట గ్రహములు, పిశాచములు, సర్వరోగములు, పాపములు సమీపించవు. ధర్మబుద్ధి కలుగుతుంది. బాహ్య ప్రపంచజ్ఞానము కలుగుతుంది. ఏ విధంగా అర్చించినా, ఏ రీతిగా అలంకరించినా, పరతత్వం ఒకటే. అందుకే లింగమూర్తికి అవయవాలు లేవు. ఈ సత్యాన్ని తెలియజేసే తత్వస్వరూపమే 'లింగ స్వరూపం
No comments:
Post a Comment