*"అమ్మ"*
అందరికి ఒక ప్రశ్న...రెండు కిలోల రాయిని నడుముకు కట్టుకుని ఓ వారం ఉండగలరా..?
రెండు నుంచి మూడు కిలోల పసికందును కడుపులో పెట్టుకుని తొమ్మిది నెలలు మోస్తుంది అమ్మ.
*ఆమెను మించిన శ్రామికులెవరు..?*
శరీరం 45 డెల్ (నొప్పికి కొలత) యూనిట్ల నొప్పినే భరించగలదు...మరి 57 డెల్ యూనిట్ల నొప్పిని భరించగలరా ఎవరైనా..? భరించలేరు...
20 ఎముకలు ఒకేసారి విరిగితే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పిని పురిట్లో భరిస్తుంది అమ్మ.
*ఆమెను మించిన కార్మికులెవరు..?*
ఇంట్లో చిన్న చిన్న పనులు చేయమంటేనే వేలకు వేలు డబ్బులడుగుతారు...లాలపోసి... సాంబ్రాణి వేసి... బట్టలు తొడిగి... ఊయల ఊపి... జోల పాటతో నిద్రపుచ్చేది అమ్మ.
*ఆమెను మించిన శ్రమ జీవులెవరు..?*
రైల్వేస్టేషన్లో లగేజీని కొద్దిదూరం మోయమంటేనే రూ. వందలు అడుగుతారు కూలీలు...
అలాంటిది,
270 రోజులు కడుపులో...
1095 రోజులు భుజాల మీద...
బతికినన్ని రోజులు మనల్ని గుండెల్లో...
*ప్రేమతో* మోసేదే అమ్మ..!
*ఆమెను మించిన కూలీలెవరు..?*
కార్మికుడు...రక్తాన్ని స్వేదంగా మలిచి సమాజాభివృద్ధికి కృషి చేస్తే...
అమ్మ...రక్తాన్ని పాలగా మలిచి ఆ సమాజాన్నే తయారు చేస్తుంది...
ఏమిచ్చినా సరితూగని ప్రేమ
సాయం చేయమంటే ! ఎవరో ఒకరు చేయొచ్చు...ఏదో ఒకటి ఆశించవచ్చు... మన కోసం బాధను భరించమంటే మాత్రం ఎవరూ ముందుకు రారు...అమ్మ అలా కాదు... మనల్ని ఈ లోకంలోకి తేవడానికి ఎంత బాధ పడుతుందో తెలుసా ? కడుపులో నలుసు పడ్డప్పటి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటుంది.
ఏమి తిన్నా వాంతులు...నీరసం అయినా ఆనందంగానే సహిస్తుంది... కడుపులో బిడ్డ కాస్త కుదుట పడ్డాక...దాదాపు ఆరు నెలల పాటు కంటి మీద కునుకు లేక, కంటి నిండా నిద్రపోక ఎంతగానో ఇబ్బంది పడుతుంది...బిడ్డ కలలతోనే సంతోషం పొందుతుంది... ఆపైన పురిటి నొప్పులు, బాలింత కష్టాలు...అన్నీ మన కోసమే.
మనం పుట్టడం కోసమే...మరి వీటన్నింటినీ ఎంత జీతమిస్తే చేయించుకోగలం ? ఆమె అడిగే జీతం ప్రేమ.
*వెలకట్టలేని శ్రమ*
సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేయడానికి వేలకు వేలు డబ్బులడుగుతారు...మరి మన మలమూత్రాలను ఎత్తేయమంటే ఎవరైనా చేస్తారా ? ఎంత కూలీ ఇచ్చినా ఈ పనికి ఎవరైనా అంగీకరిస్తారా ? అమ్మ ఇవన్నీ చేస్తుంది...మనం పాడుచేసే దుస్తులన్నింటినీ ఉతుకుతుంది... మనకు ఆరోగ్యం బాగోలేకపోతే తల్లి మనసు తల్లడిల్లిపోతుంది...మనకు గాయమైతే తను ఏడుస్తుంది...నిద్ర రాకపోతే జోలపాటవుతుంది...మనం ఆడుకోవడానికి మోకాళ్ల మీద గుర్రం అవుతుంది...మనతో చిన్నపిల్లలా తోడు పరుగెడుతుంది... ఏడిస్తే ఓదారుస్తుంది... నవ్వితే సంతోషిస్తుంది...
ఇన్ని పనులకు ఎంత కూలీ ఇస్తే చేస్తారు ?
ఆమె అడిగే కూలీ *"ఆప్యాయత"*
*స్వేదామృతం*
మనకు అన్నం తినిపించడానికి ఎన్ని గంటలు ఎత్తుకొని నిలబడుతుందో అమ్మ...నడిపించడానికి ఎన్నిసార్లు వడివడిగా నడుస్తోందో..?పరిగెడుతుందో..?వచ్చీరాని మన మాటలకు దుబాసీలా మారి ప్రపంచానికి చెబుతుంది... ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుంది...
బడిలో విడిచి వెళ్లడానికి ఆమెగుండె ఎన్ని సార్లు పగిలిపోతుందో ?
ఎక్కడికైనా వెళ్లి ఆలస్యంగా వస్తే,
ఎన్నిసార్లు ఆ కళ్లు గడియారాన్ని చూస్తాయో ?
ఆ మనసు ఎంతగా నిరీక్షిస్తుందో ?
పరీక్ష పాసైతే పండగ చేసేది...
ఉద్యోగం తెచ్చుకుంటే విజయ పతాకం ఎగరవేసేది... అమ్మ...కన్నీళ్లు వస్తే కొంగుతో తుడుస్తుంది...
తప్పు చేస్తే కొంగుచాటున దాస్తుంది...
తన ఆయుష్షూ మనమే పోసుకోవాలని జీవితాంతం దీవిస్తుంది.
*"ఇంతటి స్వేదజీవికి ధన్యజీవికి ఎంత వేతనం ఇవ్వాలి"..?*
❤️ ❤️ ❤️ ❤️ ❤️
*"ఆమె మనస్సుతో కోరే వేతనం...మన ఎదుగుదల"*👍
అందుకే... *"అమ్మ"* కు పాదాభివందనం.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment