*తనకు తానే సమస్య అయిన మనస్సు*
మనస్సు అనేక పనులు చేస్తుంది. ఉదా.. గ్రహిస్తుంది, గమనిస్తుంది, గుర్తిస్తుంది. ఇంద్రియాల ద్వారా ఆయా విజ్ఞానాలు పొందుతుంది.
అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, ఎదురైన ప్రేరణను బట్టి, పనులను ఎరుక తో చేస్తుంది.
. మనస్సు పనులు చేసి ఊరుకోదు. నేను చేసానంటుంది. మనస్సు పని చేసి ఊరు కోదు. ఆ పనిని ఇష్ట పడుతుంది. మనస్సు పని చేసి ఊరుకోదు. నేను సరిగ్గా చేసానా?, ఇంకా చేయనా ? అంటుంది.
సమస్య పనులు చేయడం కాదు. ఇవన్నీ నేను నాది ,నా అనుకోవడం. ఇలా అనుకోవడానికి మనస్సు తాను చేసే పనులు ఆపి తాను మనస్సుగా కాక చేసిన పనిగా మారి , తిరిగి మనస్సు గా మారుతుంది.
ఇలా మనస్సు తన స్వరూపాన్ని మార్చుకోనుటే సమస్య. ఎరుకను కోల్పోయి, మారి, పర్యవసానాలు ఎదుర్కొని, దుఃఖించి, తనకు తానే సమస్య అయినది. ధ్యానం మనస్సుని మారనివ్వదు.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment