Tuesday, October 10, 2023

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *’క్యారెక్టర్’ ను సైతం “కరెన్సీ” బాగా ప్రభావితం చేసే రోజులివి. మనిషి సంపద కోసం  మృగంగా మారే కాలమిది.*
💖 *”ఏది మంచి? ఏది చెడు?” ‘ఇది ధర్మం’ ‘ఇది అధర్మం’ అని తెలుసుకునే విచక్షణ ఎలా ? సన్మార్గమేదో, దుర్మార్గమేదో  ఎలా  గుర్తించాలి?” వంటి ప్రశ్నలు  మనిషిలో ఉత్పన్నమైతే  సమాధానం  దొరుకుతుంది.* 💖 *వ్యవస్థలు మారాలంటే వ్యక్తులు మారాలి. వారిలో మనమూ ఉండాలి*
💝💝 *నిన్ను అర్థం చేసుకోవాలి  అని ఎప్పుడు అనుకోకు. ఎందుకంటే… నువ్వొక నడిచే పుస్తకానివి. నిన్నొక్కొక్కరు ఒక్కోలా  అర్థం చేసుకుంటారు. ఒకరు నిన్ను పొగిడితే  ఇంకొకరు నిన్ను  తిడతారు. నువ్వు వాళ్లకు అర్థం కాకపోయినా ఫరవాలేదు. కానీ   నీకు నువ్వు అర్థం  కాకపోతేనే  అసలు సమస్య మొదలౌతుంది* 💝💝 *ఓ చిన్న అబద్ధంలా అనిపించే నిజం చెబుతాను. నేనేదో ఒక పోస్ట్  పెడుతూనే  ఉంటాను. ఎందుకంటే “మంచినెప్పుడూ వాయిదా వేయకూడదు”. ఎందరు చదివి ఆకళింపు చేసుకుంటున్నారో తెలియదు. ప్రయత్నంచేయడం తప్పు కాదు కదా.*
💞 *నేనీ శరీరంలో ఉంటున్నందుకు నేను కడుతున్న అద్దె ఈ నా కార్యక్రమం. “అద్దెకట్టకుండా మనమీ శరీరాల్లో ఉండడం సబబు కాదు” అనేది నా నిశ్చితాభిప్రాయం. చేతనైనంత సహాయసహకారాలను తోటి ప్రాణులకు అందించడమే మనం కట్టే అద్దె.*

💝💝 *జీవితంలో ఆనందం కలిగినపుడు  ఎవరు పైవాడిని  ప్రశ్నించరు. “ఎందుకు నాకీ ఆనందాన్నిచ్చావు దేవుడా”అని. కష్టం కలిగినపుడు మాత్రం దేవుణ్ణి కడిగిపారేస్తారు. ఇదే మానవ నైజం. విచిత్రంగా యీ రెండూ మనతో శాశ్వతంగా ఉండేవి కానేకావు.*
💝💝 *కష్టాలు అన్ని వైపుల నుండీ రౌండప్చేసి  confuse  చేస్తాయి. పరుగెత్తే  ఆప్షన్ని ఇవ్వనే ఇవ్వవు. పరిగెత్తే  ఆప్షన్  ఇస్తే ఎప్పుడు పోరాడే  ఆప్షన్ ఎంచుకోవు కనుక.*
💝💝 *పదిమందిని  మోసం చేసి బ్రతకాలంటే  ముందు మనల్ని మనమే  మోసం చేసుకోవాలి. అంటే  మన అంతరాత్మ గొంతును మనమే  మూయడమన్న మాట. ఈ ఒక్క లాజిక్ నిజంగా  అర్థమైతే ఇక ఈ లోకంలో “మోసం” అనే కాన్సెప్టే ఉండదు.*
 💝💝 *మన కాళ్ళపైన మనం నిల్చోవడమే ప్రధానం. ఇతరుల కాళ్ళకు అడ్డంపడకుండా జీవించడం అంతకన్నా ప్రధానం.*
💝💝 *మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేం. ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే.. విజయం సాధించలేం. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలు పెట్టాలి.*
💝💝 *విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నీవేంటో తెలుస్తుంది, అపజయం పొందితే నీ శ్రేయోభిలాషులెవరో నీకు తెలుస్తుంది. ఈ రహస్యం తెలుసుకుంటే జీవితం సజావుగా సాగిపోవడం తథ్యం.*

*~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

No comments:

Post a Comment