*ॐశ్రీవేంకటేశాయ నమః*
💝 *త్రిమూర్తులు తమకు భోజనం వడ్డించే స్త్రీ వివస్త్రగా ఉండాలన్నప్పుడు సతీ అనసూయ ఏం చేసిందో మనకు తెలుసు.*
💖 *గోత్రాల్లో “ఆత్రేయ గోత్రం”అని వింటుంటాం. అది అత్రి మహర్షి నుంచి వచ్చిందే. అత్రి మహర్షి బ్రహ్మమానసపుత్రుల్లో మొదటివాడు. బ్రహ్మదేవుడు ఈయన్ని సృష్టికార్యంలో సహాయంగా ఉండేందుకు సృష్టించాడు. ఈయన తనకు అనుకూలమైన స్థానాన్ని చూసుకుని ఘోరమైన తపస్సు చేయటం ప్రారంభించగా అతని కళ్ళల్లోంచి ఒక తేజస్సు బయటకి వచ్చి అది భూమి ఆకాశాలు మొత్తం వ్యాపించిపోయింది.*
💓 *ఆ తేజస్సుని భూమీ ఆకాశాలూ తట్టుకోలేకపోవటంతో సముద్రంలో కలిసిపోయిందది. ఇది తెలుసుకున్న బ్రహ్మ దేవుడు అత్రి మహర్షికి పెళ్లయ్యాక ఆ తేజస్సులో కొంత భాగంతో చంద్రుడు తనకు కుమారుడై పుడతాడని, మిగిలిన తేజస్సు సముద్ర మథన సమయంలో వచ్చి చంద్రుడిని చేరుతుందని వరమిచ్చాడు.*
💖 *అత్రి మహర్షికి కర్దమ ప్రజాపతి కూతురు అనసూయతో వివాహం జరుగింది. ఆమె అత్రి మహర్షికి నిత్యం సేవలు చేస్తూ ఎంతో గొప్ప పతివ్రతగా పేరుతెచ్చుకుంది. ఒక రోజు త్రిమూర్తులామె పాతివ్రత్యాన్ని పరీక్షించటానికి అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆతిధ్యం స్వీకరించటానికి వచ్చామని చెప్పగా అత్రి మహర్షి ఎంతో ఆనందంతో వారికి సకల మర్యాదలు చేసి భోజనానికి కూర్చోమని ప్రార్థించాడు.*
💕 *త్రిమూర్తులు తమకు భోజనం వడ్డించే స్త్రీ వివస్త్ర అయ్యి ఉండాలనే షరతు విధించారు. అనసూయాదేవి అంగీకారంతో అత్రి మహర్షి సరేనన్నాడు. వాళ్ళు భోజనం నిమిత్తం కూర్చోగానే అనసూయ వాళ్లమీద మంత్రజలంచల్లి చంటి పిల్లలుగామార్చి, వారి ఆకలినితీర్చి ఉయ్యాలలో పడుకోబెట్టింది*
💖 *విషయం తెలుసుకున్న త్రిమూర్తుల భార్యలు అత్రి ఆశ్రమానికి వచ్చి అతనినీ, అనసూయాదేవిని వేడుకుని ఆ పసిపిల్లల్ని మళ్లీ త్రిమూర్తులుగా పొందారు. ఆ త్రిమూర్తులప్పుడు ‘మా ముగ్గురి అంశతో మీకు సంతానంగా పుడతాం’ అని చెప్పి వెళ్లిపోయారు.*
💞 *చాలాకాలంగా తమకు సంతానం కలుగకపోవటంతో అత్రి మహర్షి భార్యతో కలిసి వంద సంవత్సరాలు తపస్సు చేశాడు. తత్ఫలితంగా అత్రి మహర్షి కంటిలోంచి చంద్రుడూ, అనసూయా దేవి గర్భంలోంచి దత్తాత్రేయుడూ, దూర్వాసుడూ జన్మించారు. ఆ తర్వాత “మళ్లీ తపస్సుచేసుకోటానికి వెళుతున్నాను. నువ్వువస్తావా?”అని తన భార్యని అడిగాడు అత్రి మహర్షి. అనసూయ “పిల్లలు చిన్నవాళ్ళు కదా. వాళ్ళు కాస్త పెద్దయ్యాకా వెళదాం” అన్నది.*
💖 *జీవించడానికి ధనం అవసరమవడంతో అత్రి మహర్షి పృధు చక్రవర్తి దగ్గరకు వెళ్లాడు. అప్పుడు అశ్వమేథ యాగం చేస్తున్న పృథు చక్రవర్తి ఆ గుఱ్ఱాన్ని రక్షించటానికి తన కొడుకుతో వెళ్ళమని అత్రి మహర్షిని అడుగ్గా వాళ్ళ వెంట వెళ్లాడు. పృథుచక్రవర్తి వైభవాన్ని చూడలేక ఇంద్రుడా గుఱ్ఱాన్ని దాచేయగా అత్రిమహర్షి తన దివ్యదృష్టితో చూసి ఆ విషయాన్ని పృథుచక్రవర్తి కొడుక్కి చెప్పగా అతడు ఇంద్రుణ్ణి జయించి అశ్వాన్ని తెచ్చాడు.*
💖 *అశ్వమేథ యాగమయ్యాక పృథుడిచ్చిన ధనాన్ని తీసుకెళ్ళి తన పిల్లలకిచ్చేసి అత్రి మహర్షి అనసూయదేవితో కలిసి తపస్సు చేసుకోవటానికి వెళ్ళాడు.*
💞 *అత్రి మహర్షి రచించిన ఆత్రేయ ధర్మశాస్త్రంలో దాన ధర్మాలూ, జపతపాలూ, పూజా విధానాలూ, దేవతాప్రతిష్ఠ వంటి విషయాల వివరణలున్నాయి.* 💓 *”దత్తపుత్ర స్వీకరణ” అనే విషయాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టింది అత్రి మహర్షే. సప్తఋషుల్లో ఒకరైన అత్రి మహర్షీ, ఆయన భార్య అనసూయాదేవిల పేర్లు కలకాలం నిలుస్తాయని మనం చెప్పుకోవచ్చు.*
❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
*~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*
No comments:
Post a Comment