2 రోజుల క్రితం కోమాలో ఉన్న పిల్లాడికి ప్రాణం పోసిన జగన్నాథుడు ,ఇదే సాక్ష్యం/ #hemananduri
https://m.youtube.com/watch?v=cZmRWWHc6QY
Default Title
https://www.youtube.com/watch?v=cZmRWWHc6QY
Transcript:
శ్రీమాత నమః భగవంతుడు పిలిస్తే పలుకుతాడా అంటారు కచ్చితంగా పలుకుతాడు మనకి నమ్మకం ఉండదు అంతే శరణాగతి చేసేసి నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు నువ్వే కదా నన్ను రక్షించాలి అని చెప్పి అడిగారు అనుకోండి పిలిచారు అని అనుకోండి ఆయన వస్తారు గజేంద్రుడు కూడా తనని తాను నమ్ముకుని తన బలాన్ని తను నమ్ముకుని ఎంతో ప్రయత్నం చేశాడు తనకి అహంకారం వచ్చింది ఈ ముసలిని నేను చంపేయగలను అనుకున్నాడు.
ప్రయత్నం చేశాడు అంబల తన ఒంట్లో ఉన్న శక్తి అంతా పోయిన తర్వాత అప్పుడు భగవంతుడు గుర్తుకొచ్చాడు. ఎప్పుడు మన ప్రయత్నం చేస్తూ భగవంతుని కూడా మనం శరణాగతి చేస్తే ఏదైనా సాధించగలం కానీ ఇక్కడ గజేంద్రుడు తన శక్తిని మాత్రమే నమ్ముకున్నాడు భగవంతుని వదిలేసాడు ఒంట్లో శక్తి అంతా పోయిన తర్వాత అప్పుడు గుర్తుకొచ్చాడు. రా ఎక్కడున్నావు రా నా వల్ల కావటం లేదు నన్ను రక్షించు నువ్వు తప్ప నన్ను ఇంకెవరు రక్షిస్తారు అని చెప్పి ఆర్తితో కన్నీళ్లు పెట్టుకుంటే అప్పుడు వచ్చాడండి విష్ణుమూర్తి అన్ని వదిలిపెట్టి తన భక్తుడు కోసం పరిగెత్తుకుంటూ వచ్చేసారు అది కన్నయ్య
ప్రేమ అంటే భగవంతుడు తన భక్తుని ప్రేమించే విధానము తన భక్తుని అనుగ్రహించే విధానం ఇలా ఉంటుంది కానీ మనమే ఆయన్ని అర్థం చేసుకోలేక ఆయన ఏదో మనకి అపకారం చేసేసారని ఆయన ఏదో మనకి కష్టాలు పెట్టేసాడని అనుక్షణం మనకి ఏదైనా చిన్న కష్టం వస్తే దేవుని తిడతాం. సరే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఒక అద్భుతమైన విషయం మనం తెలుసుకోవాలి ఎక్కడో చరిత్రలో ఫలానా చోట ఇలా జరిగిందంట భగవంతుడు ఇలా ప్రత్యక్షమయ్యాడంట అని మనం చదువుకున్నాం కానీ 15 రోజుల క్రితం భగవంతుడు చేసిన అద్భుతాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కన్నా అని పిలిస్తే ఎంతమంది భక్తుల కోసమో కృష్ణయ్య వచ్చి సేవ చేసిన ఎంతమందో జీవిత చరిత్రలు మనం మన ఛానల్లో చెప్పుకుందాం. అలాగే కాలాపాహడ్ అని ఒక రాజు గురించి కూడా మనం వీడియోస్ చేసుకున్నాం. ఈ కాలాపహడ్ గురించి మన ఛానల్ లో ఉంది అది నేను ఇప్పుడు పూర్తిగా చెప్పట్లేదు కానీ ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది.
ఈయన జగన్నాథ స్వామి వారి భక్తుడు అన్నమాట ఈ కాలాపాహడ్డు. అయితే ఈ కాలాపాహని ఎవరు ఎదిరించలేకపోయేవారు పరాయిమతస్తులు ఆయన ఎదురుగుండా ఉండి యుద్ధం చేయటానికి కూడా వాళ్ళ వల్ల అయ్యేది కాదన్నమాట ఇప్పుడు ధైర్యంగా ఎదురుగా ఉండి మనం ఏదైనా చేయలేకపోయాము అని అనుకోండి ఏం చేస్తారు వెనక నుంచి వెన్నుపోటు పొడుస్తారు అలా వెన్నుపోటు పొడిచేసి మనల్ని లోబరుచుకున్నాము అని అనుకుంటారు అలాగే పాపం ఈ కాలాపహడిని కూడా ఏం చేశారు అంటే మతం మార్చేశారు అన్నమాట బలవంతంగా పరాయి మతస్తుల ఆ అమ్మాయిని వివాహం చేసేసారు ఇచ్చి దానికి ఒక కథ ఉంది దాని గురించి నేను వీడియోలో చెప్పాను ఒకసారి చూడండి అయితే
వివాహం అయిపోయింది వివాహం అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి కూడా హిందూ ధర్మంలోకే వచ్చేసిందన్నమాట ప్రతిరోజు జగన్నాథ స్వామి వారిని దర్శించుకోవడం అలవాటు ఉన్న ఈ కాలాపాహడ్డు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా జగన్నాథ స్వామి వారిని దర్శించుకోవడం కోసం వెళ్తే అక్కడ ఉన్నవాళ్ళు అడ్డుకుంటారు నువ్వు భ్రష్టు పట్టుకపోయావు నువ్వు కావాలనే మతం మారిపోయావు అంటే అప్పట్లో పరిస్థితులు అలాగే ఉండేవి కదా మతం మారిపోయేవాళ్ళు కదా అందుకని ఇతను కూడా కావాలనే మతం మారిపోయాడు అని అనుకని లోపలికి రానివ్వలేదు.
జగన్నాథస్వామి వారిని చూడకపోతే ఇతను బ్రతికేలా లేడు ఆర్తిగా ఏడుస్తాడు నన్ను లోపలికి రానివ్వటం లేదు నిన్ను చూడనివ్వటం లేదు ఎలా ఇప్పుడు నా బ్రతుకు ఏంటి నా పరిస్థితి ఏంటి అని కళ్ళనీళ్లు పెట్టుకుంటే తన భక్తుడి కోసం ఆర్తిగా పిలిచినందుకు జగన్నాథ స్వామి వారు గర్భాలయంలో నుంచి బయటిక వచ్చి తూర్పు సింహ ద్వారం దగ్గర వెలిశారు.
తూర్పు సింహ ద్వారం దగ్గర వెలిశారు. ఇప్పటికీ ఈరోజు కూడా మనం ఈ పూరి జగన్నాథ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తే తూర్పు సింహ ద్వారం దగ్గర ఈ కాలాపాహడ్ కోసం జగన్నాథ స్వామి వారు వెలిసిన ఆ మూర్తిని మనం చూడొచ్చు. అంటే భగవంతుడు భక్త సులభుడు నువ్వు ఆర్తితో పిలిస్తే ఆయన వస్తాడు రాలేదు అంటే నువ్వు పిలవడంలో తప్పు ఉందన్నమాట నువ్వు పిలవడంలో ఏదో లోపం ఉందన్నమాట అంతే 15 రోజుల క్రితం ఒక అద్భుతం జరిగింది అదేంటంటే మీరు చూసే ఉంటారు అందరూ ఒక ఆయన ఆయన కొడుకుని చేతిలో పట్టుకుంటూ బహుశా ఎనిమిద ఏళ్ళు ఉంటాయట హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేసాడు అన్నమాట అంటే డాక్టర్స్
చెప్పేసారు ఇంకా నీ కొడుకు ఇంకా చెప్పలేము కోమాలో ఉన్నాడు బయటికి వస్తాడో రాడో తెలియదు కాబట్టి నువ్వు తీసుకువెళ్ళిపో అని దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు చూసారా అది కరెక్ట్ గా ఇక్కడ నిజమైంది. ఆ పిల్లాన్ని తీసుకుని జగన్నాథస్వామి వారి ఆలయానికి వచ్చేసారు వచ్చేసి అక్కడ మెట్ల దగ్గర ముందు పడుకోబెట్టేసాడు.
నా కొడుకుని రక్షించు నా కొడుకుని రక్షించు అని ఏడుస్తుంటే అక్కడ అర్చుకులు అందరూ తిడుతున్నారు తీసుకెళ్ళపో బయటికి తీసుకెళ్ళిపో బయటికి తీసుకెళ్ళిపో అని తిడుతున్నారు ఇతను ఆ అర్చుకుల మీద దాడి చేశాడు నా కొడుకు ఇలా ఉంటే నువ్వు ఏంటి ఇలా అంటున్నావు అనేమో నాకు తెలియదు అది పూర్తిగా క్లియర్ గా నాకు వినపడలేదు అప్పుడు అక్కడ ఉన్న అది ఇప్పుడు తూర్పు సింహ ద్వారం ఉంది కదా ఆ తూర్పు సింహ ద్వారం దగ్గర ఉన్న ఏదైతే జగన్నాథ స్వామి వారి మూర్తి ఉందో అక్కడ పని చేసే అర్చకుడు ఏం చేసాడు అంటే అక్కడ పడుకోపెట్టేసిన ఆ బిడ్డ మీద స్వామి వారి యొక్క తీర్థాన్ని ఇలా చిలకరించాట అప్పటివరకు కోమాలో ఉన్న ఆ
అబ్బాయి ఒక్కసారిగా ఈ తీర్థాన్ని చిలకరించేసరికి కళ్ళు తెరిచి చూసాట అద్భుతం కదా చెప్పండి అది కూడా రికార్డ్ అయింది వీడియోలో అవి కూడా ఒరిస్సాలో ఎంత వైరల్ అవుతున్నాయో ఆ వీడియోస్ అన్ని ఆ అప్పుడు అతను బయటికి స్పృహలోకి వచ్చిన తర్వాత స్వామి వారిని దర్శించుకోవడం కోసం గర్భాలయంలోకి తీసుకువెళ్ళండి అని చెప్పి అక్కడ పోలీసులు అక్కడ ఎవరో ఒక సేవకురాలు ఆవిడ చెప్తున్నారు ఇంకొక ఒక పోలీసు చెప్తున్నారు.
ఇది అద్భుతం కాదంటారా సరిగ్గా 15 రోజుల క్రితం జరిగింది ఇలాంటి అద్భుతాలు ఎన్ని జరిగాయో జగన్నాథ స్వామి వారు వచ్చేస్తారండి భక్తుడు కోసం ఎన్ని లీలలో ఎన్ని అద్భుతాలో కానీ ఇవన్నీ మూర్ఖత్వం అని కొట్టి పాడేసే మనం ఉన్నాం చూసారా మనం మూర్ఖులం మనకంటా మూర్ఖులు ఈ ప్రపంచంలో ఉండనే ఉండరు ప్రతి చిన్న విషయానికి భగవంతుని కలిపేసి దేవుడు లేడు దేవుడు ఉంటే ఇలా చేసేవాడా అంటాం విచిత్రం ఏంటంటే దేవుడు నమ్మేవాడు దేవుడు లేడు అంటాడు అఫ్కోర్స్ నాస్తికులు ఎలాగో దేవుడు లేడు అంటారు కానీ దేవుని అడ్డపెట్టుకొని మాత్రం సినిమాలు తీస్తూఉంటారు అన్నమాట అది వాళ్ళ దౌర్భాగ్యం అనుకోండి
నాస్తికుడు తిడతాడు దేవుని నమ్మే మనం కూడా తిడతాం తిట్టి పాపాన్ని మూట కట్టుకుంటున్నాం సర్వస్య శరణాగతి చేయండి మనం ధర్మ మార్గంలో ఉంటూ నీతిని తప్పకుండా ఉంటే భగవంతుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అనడానికి ఇంతకంట లైవ్ ఎగజాంపుల్ ఇంకోటి ఉంటుందా చెప్పండి నేను చెప్పింది మీకు ఒకవేళ చూడాలి అని అనుకుంటే మీరుయ YouTube లో కొట్టి చూడండి ఎన్ని వీడియోస్ వస్తాయో నేను ఇది కన్ఫర్మ్ కూడా చేసుకున్నాను.
No comments:
Post a Comment