Thursday, January 1, 2026

వేల ఏళ్ల ముందే మోడర్న్ టెక్నాలజీ.. ప్రాచీన భారత అద్భుతాలు Ancient India Facts #facts #factsintelugu

వేల ఏళ్ల ముందే మోడర్న్ టెక్నాలజీ.. ప్రాచీన భారత అద్భుతాలు Ancient India Facts #facts #factsintelugu

 https://youtu.be/JNrjjGV7ffw?si=n34zYhN_FtCVEHO8


https://www.youtube.com/watch?v=JNrjjGV7ffw

Transcript:
(00:00) ఈ వీడియోలో వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉన్న టెక్నాలజీ గురించి తెలుసుకోబోతున్నారు. ప్రాచీన భారతదేశం అంటే కేవలం రాజులు రాజ్యాలు మాత్రమే కాదు అది ఒక అత్యాధునిక విజ్ఞాన కేంద్రం. ఈరోజు మనం మోడరన్ అనుకునే అనేక టెక్నాలజీలు వేల సంవత్సరాల క్రితమే భారతదేశంలో ఉన్నాయి. ఈ వీడియో మన చరిత్రపై మనం గర్వపడేలా చేస్తుంది.
(00:26) ఎందుకంటే ఇందులో మనం తెలుసుకోబోయేది 1600 సంవత్సరాలుగా తుప్పుపట్టని ఢిల్లీ ఐరన్ పిల్లర్ రహస్యం ప్రపంచాన్ని మార్చేసిన జీరో ఆవిష్కరణ కొన్ని వేల ఏళ్ల ముందే జరిగిన ప్లాస్టిక్ సర్జరీ కంటి ఆపరేషన్లు [సంగీతం] ఖగోళ శాస్త్రంలో భారతీయుల అద్భుత లెక్కలు హరప్ప మొహంజదారో లాంటి నగరాల అద్భుత పట్టణ ప్రణాళిక ఇంకా ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన ఊడ్స్ స్టీల్ గురించి హలో ఫ్రెండ్స్ మీకు తెలుసా ఢిల్లీలో ఉన్న ఒక ఇనుప స్తంభానికి 1600 సంవత్సరాలుగా తుప్పు పట్టలేదు.
(01:00) వర్షానికి [సంగీతం] తడిచిన ఎండకి ఎండిన కాలుష్యం కమ్మేసిన ఇలాంటి అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా దానికి కొంచెం కూడా తుప్పు పట్టలేదు. ఈ కాలం శాస్త్రవేత్తలు ఇది చూసి [సంగీతం] ఆశ్చర్యపోతున్నారు. ఇంత పర్ఫెక్ట్ గా మెటలర్జీని ఆధునిక యంత్రాల సహాయం లేకుండా అప్పట్లో ఎలా సాధించారని నివ్వెరపోతున్నారు.
(01:23) 23 అడుగుల ఎనిమిది అంగుళాలు ఉండే ఈ ఇనుప స్తంభాన్ని భారతదేశాన్ని పాలించిన గుప్త రాజవంశానికి చెందిన చంద్రగుప్త ద సెకండ్ ఢిల్లీలో ఉన్న మెహరోలీలో ప్రతిష్టించారు. మీకు తెలుసా మన దేశంలో వేల ఏళ్ల క్రితమే ప్లాస్టిక్ సర్జరీ జరిగిందని ఈరోజు మనకి ప్లాస్టిక్ సర్జరీ అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ గుర్తుకు వస్తాయి. కానీ మన దేశంలో 200 సంవత్సరాల క్రితమే సుశృతుడు ముక్కు శస్త్ర చికిత్స చేశాడు.
(01:52) ఆయన రాసిన సుశృత సంహితలో 300కు పైగా సర్జికల్ ప్రొసీజర్లు 120 కి పైగా శస్త్ర చికిత్స పరికరాలు కంటి ఆపరేషన్స్ గురించి వివరించారు. అంతేకాకుండా ప్రాచీన కాలం నుంచి మన దేశంలో పేరుగాంచిన ఆయుర్వేదం సైన్స్ తో కూడిన వైద్యం. ఆయుర్వేదం అంటే కేవలం మూలికలు కాదు డోసేజ్ డైజెషన్ శరీర నిర్మాణం దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణ ఇవన్నీ ఆయుర్వేదంలో శాస్త్రీయంగా వివరించారు.
(02:24) మీకు ఇది తెలుసా? జీరో సంఖ్య సున్నా కనిపెట్టకపోయి ఉంటే [సంగీతం] మనం ఇప్పుడు మొబైల్ కంప్యూటర్స్ ఇవన్నీ వాడలేకపోయేవాళ్ళం. ఈ జీరో కాన్సెప్ట్ భారతదేశంలోనే పుట్టింది. దీని వెనుక మన భారతదేశానికి చెందిన గణిత పితామహుడు ఆర్యభట్ట మేదస్సు ఉంది. అయితే ఫ్రాన్స్ దేశానికి చెందిన గణిత పితామహుడు జార్జెస్ [సంగీతం] ఇఫ్రా ప్రకారం ఆర్యభట్ట జీరో ని ఎక్కడా ఉపయోగించలేదు.
(02:51) కాకపోతే ఆర్యభట్ట రూపొందించిన ప్లేస్ వాల్యూ సిస్టం లో జీరో యొక్క కాన్సెప్ట్ గురించి ప్రస్తావించాడు. ఇప్పుడు [సంగీతం] ఇస్రో నాసా ఇలాంటి స్పేస్ ల్యాబ్లు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రాచీన కాలంలోనే బ్రహ్మగుప్తుడు గ్రహాల యొక్క షేప్ గ్రావిటీ గురించి వాటి యొక్క గమనం గురించి ఒక సంవత్సరానికి పట్టే సమయం గురించి ఖచ్చితంగా లెక్కించాడు.
(03:16) మీకు వేల సంవత్సరాల క్రితమే హరప్ప మహంజదారో నాగరికతలో పర్ఫెక్ట్ గ్రిడ్ రోడ్లు ప్రతి ఇంటికి నీటి సదిపాయం పర్ఫెక్ట్ డ్రైనేజ్ సిస్టం [సంగీతం] ఇలాంటివన్నీ ఉన్నాయని తెలుసా హరప్ప మొహంజిదారో నాగరికతల్లో ఉన్న నగరాల్లో అప్పట్లోనే అద్భుతమైన టౌన్ ప్లానింగ్ చేశారు. ఆ టౌన్ ప్లానింగ్ ఇవాళ మనం నిర్మించుకుంటున్న స్మార్ట్ సిటీస్ కి ఎంతో ఆదర్శం.
(03:41) మీకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డమాస్కస్ వర్డ్స్ తయారీకి అవసరమయ్యే టెక్నాలజీ ఎక్కడ ఆవిర్భవించిందో తెలుసా ఆ ఖడ్గాల తయారీకి అవసరమయ్యే ప్రత్యేకమైన స్టీల్ ఉత్పత్తి [సంగీతం] మన భారతదేశంలోనే జరిగింది. ఈ ప్రత్యేకమైన స్టీల్ ని ఊడ్స్ స్టీల్ అంటారు. దీని తయారీ [సంగీతం] క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో ప్రధానంగా నేటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు ప్రాంతాల్లో ప్రారంభమైంది.
(04:07) ఈ వుడ్ స్టీల్ తో తయారు చేసిన కత్తులు అత్యంత పదునుగా ఉండేవి. [సంగీతం] ఎంత పదును అంటే ఒక పట్టు వస్త్రాన్ని గాలిలో వేస్తే అది కత్తి పైన పడగానే రెండు ముక్కలు అయ్యేంత పదును వీటికి ఉండేది. ఈ స్టీల్ లో కార్బన్ శాతం చాలా ఎక్కువగా ఉండేది. చూసారా ఫ్రెండ్స్ ప్రాచీన భారతదేశం అంటే కేవలం గతం కాదు. అది మన భవిష్యత్తుకు మార్గదర్శకం.
(04:32) మన పూర్వీకుల విజ్ఞానం ఈరోజు మోడర్న్ టెక్నాలజీకి ప్రేరణగా నిలుస్తుంది. దురదృష్టం ఏమిటంటే మన ఘనమైన విజ్ఞానాన్ని చరిత్రను మనమే పట్టించుకోవట్లేదు. [సంగీతం] ఈ వీడియో మీకు మన చరిత్ర విజ్ఞానం పట్ల ఆసక్తి కలిగించిందని ఆశిస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. [సంగీతం] మీరు చేసే లైక్స్ ఇలాంటి తెలుగు ఫాక్ట్స్ మరియు నాలెడ్జ్ వీడియోస్ ని 10 మందికి చేరవేసేలా సహాయపడతాయి.
(05:01) ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం.

No comments:

Post a Comment