Thursday, February 5, 2026

 ```
ప్రతిరోజూ…
శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…
296d2;311f2; నడిచే దేవుడు…
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀    🌼P0475.పరమాచార్య పావన గాధలు…```


         *మండుటెండ - మజ్జిగ*
                  ➖➖➖✍️

```
కంచి మఠం ముందర మజ్జిగ అమ్మే ఒక పాట్టి(అవ్వ)ని మహాస్వామివారు పిలిచారు. 

ఒక పెద్ద పాత్ర నిండుగా చల్లని మజ్జిగను తయారుచెయ్యమని చెప్పారు. 

అలాగే వాటిలో వాడాల్సిన పదార్థాలను కూడా చెప్పారు. ఇంగువ,కరివేపాకు, పచ్చి మిరపకాయలు, అల్లం, ఆవాలు అన్నీ వేసి తయారుచెయ్యమని చెప్పారు. 

అదంతా వింటున్న భక్తులు ఆశ్చర్యపోయారు. కాని సాధారణ రోజులలో మఠానికి అంతమంది భక్తులు రారు. మరి ఇంత మజ్జిగ ఎవరికోసం.

అది మే నెల మొదటివారం. సూర్యుడు ప్రచండమైన వేడితో వెలుగుతున్నాడు. 

కంచిలో కచ్చపేశ్వర దేవాలయం ముందు ఏదో రాజకీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వారంతా నాస్తికులు. దాదాపు ఒక 200 మంది ఉన్నారక్కడ. పెద్ద పెద్ద స్పీకర్లలో నుండి భావావేశంతో కూడుకున్న మాటలు వినిపిస్తున్నాయి. వారికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి మొత్తం దేవాలయాలను నిర్మూలించి పరిశ్రమలు కట్టి యువతకు ఉపాధి ఇస్తామని ఆవేశంతో మాట్లాడుతున్నాడు.

ఇంతలో ఆ నాస్తిక సమావేశాలు పూర్తయ్యి ఆవేశంగా మాట్లాడిన 
ఆ నాయకుడు కారు ఎక్కి చక్కా పోయాడు. 

అక్కడ చేరినవారందరూ బస్సు ఎక్కడానికి కంచి మఠం దగ్గరకి వచ్చారు. 

అక్కడ మజ్జిగ అమ్ముతున్న పాట్టిని చూశారు. అంతే! కేవలం పది నిమిషాల్లో అండా నిండుగా ఉన్న మజ్జిగ ఖాళీ అయిపోయింది.

అప్పుడు వారిలో ఒకడు, “మఠం లోపలికి వెళ్ళి సామి దర్శనం చేసుకుందామా?” అని అన్నాడు. 

అందరికి వెళ్ళాలనే ఉంది కాని ఇతరులు తమను తిడతారనే భయంతో ఊరకుండిపోయారు. 

సరిగ్గా అప్పుడే గంగై కొండన్ మండపంలో ఉన్న ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్ళడానికని స్వామి వారే బయటకు వచ్చారు. 

ఒక్కసారిగా మొత్తం అక్కడున్నవారంతా కాంచిపురంలోని మేనెల ఎండలతో వేడెక్కిన ఆ ఇసుకలోనే నేలపై పడి స్వామికి సాష్టాంగం చేశారు.

గంగై కొండన్ మండపంలోకి వెళ్తున్న స్వామివారు ఒక్కక్షణం ఆగి, “అందరికి తాగడానికి మజ్జిగ దొరికింది కదా?” అని అడిగారు.

భగవంతుని కరుణకు అంతు ఉంటుందేమో కాని పరమాచార్య స్వామివారి కరుణకు అంతు, ఎల్లలు ఉండవు. 
అపార కరుణా స్వరూపులు వారు.✍️
```
*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥*
```
#KanchiParamacharyaVaibhavam # “కంచిపరమాచార్యవైభవం”🙏
.     సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
            🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

No comments:

Post a Comment