Thursday, February 5, 2026

 *Health: ఈ మొక్క ఆంజనేయస్వామి తెచ్చిన సంజీవనితో సమానం.. మీ ఇంట్లో ఉంటే డాక్టర్ పనే ఉండదు*

 *Ajwain Plant: మన ఇంటి చుట్టూ లేదా కిచెన్ గార్డెన్‌లో సులభంగా పెరిగే వాము మొక్క ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. సాధారణంగా వాము గింజల గురించి చాలామందికి తెలుసు.*

 *కానీ వాము ఆకుల్లో కూడా అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయని చాలామందికి తెలియదు. ఈ ఆకులు మందపాటి గా, పచ్చగా ఉండి ప్రత్యేకమైన సువాసనను కలిగి ఉంటాయి. ఆయుర్వేదంలో వామాకు ఆకులను ఎన్నో రకాల వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.* 

 *వామాకు ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి రక్షిస్తాయి. వాతావరణం మారినప్పుడు తరచూ వచ్చే శ్వాసకోశ సమస్యలకు వామాకు మంచి సహజ ఔషధంగా పనిచేస్తుంది. కషాయం రూపంలో తీసుకుంటే ఊపిరితిత్తులు శుభ్రపడటానికి సహాయపడుతుంది.* 

 *వాము కషాయం:* 

 *దగ్గు, జలుబు, గొంతు నొప్పి, బ్రాంకైటిస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు వామాకు కషాయం ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. ఆకులను నీటిలో మరిగించి తాగితే శరీరానికి వేడి చేరి, శ్లేష్మం బయటకు వస్తుంది. దీని వల్ల శ్వాస తీసుకోవడం సులభంగా మారుతుంది. చిన్న పిల్లలకు జలుబు వచ్చినప్పుడు వామాకు రసం కొద్దిగా తేనెతో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుందని పెద్దలు చెబుతారు.* 

 *మూత్రం సరిగ్గా రావడం లేదా:* 

 *మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా వామాకు ఉపయోగపడుతుంది. మూత్రం సరిగ్గా పోకపోవడం, రాళ్ల సమస్యలు ఉన్నవారికి ఇది సహాయపడుతుందని నమ్మకం. ఇది సహజంగా మూత్ర విసర్జనను పెంచి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. అలాగే కడుపు నొప్పి, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలకు వామాకు ఉపశమనాన్ని ఇస్తుంది. అల్లంతో కలిపి తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.* 

 *పాలిచ్చే తల్లులకు దివ్య ఔషధం:* 

 *పాలిచ్చే తల్లులకు వామాకు ఆకులు మేలు చేస్తాయని ఆయుర్వేదంలో చెప్పబడింది. ఇవి తల్లి శరీరాన్ని బలంగా ఉంచడమే కాకుండా పాలు పడటానికి సహాయపడతాయి. అలసట, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.* 

 *గుండె ఆరోగ్యానికి ముఖ్యం:* 

 *గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో వామాకు పాత్ర ఉందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో అదనంగా ఉన్న నీటిని తగ్గించి వాపు సమస్యలను తగ్గిస్తుంది.* 

 *చర్మ సమస్యల నివారణ:* 

 *చర్మ సమస్యలకు కూడా వామాకు మంచి ఔషధం. గాయాలు, పుండ్లు, దురద ఉన్న చోట వామాకు ముద్ద పెట్టుకుంటే త్వరగా నయం అవుతుంది. తలనొప్పి ఉన్నప్పుడు నుదిటిపై ఆకులు ఉంచితే ఉపశమనం లభిస్తుంది. కళ్ల చుట్టూ వాపు లేదా కంటి కలక ఉన్నప్పుడు కూడా వామాకు ఉపయోగకరంగా ఉంటుంది.* 

 *అందువల్ల రోజువారీ జీవనంలో వామాకు ఆకులను సరైన మోతాదులో ఉపయోగించుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే అధికంగా వాడకుండా, అవసరాన్ని బట్టి తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో ఒక వాము మొక్కను పెంచుకోవడం ద్వారా సహజంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.*

*మీ*                                      
*ఇందుకూరిసీతారామరాజు (చిన్నబాబు)వైస్ ఎం.పి.పి*
*పోడూరు-534327*
*పోడూరు మండలం* 
*ఆచంట నియోజకవర్గం*
*వెస్ట్ గోదావరి జిల్లా*
*ఆంధ్రప్రదేశ్*

No comments:

Post a Comment