Thursday, February 5, 2026

 *తీర్థంలో తుల‌సి ద‌ళం ఎందుకు వేస్తారో తెలుసా....?*

🌿భగవంతుని ప్రసాదం అంటే తీర్థం. దీనిలో తులసీదళం లేకుండా అది అసంపూర్ణం అవుతుందంటారు. అయితే తీర్థంలో తులసి ఆకులను ఎందుకు వేస్తారో తెలుసా?

🌸హిందూ ధ‌ర్మంలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. తులసి మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీమాతతో పాటు విష్ణుమూర్తి కూడా కొలువైవుండి, వారి ఆశీస్సులు అందిస్తార‌ని చెబుతారు.

 🌿హిందూ విశ్వాసాల ప్రకారం రాగి లేదా ఇత్తడి పాత్రలో స్వ‌చ్ఛ‌మైననీటిని తీసుకుని, దానికి గంగాజలం, తులసి దళాన్ని జోడించాక ఆ నీరు అమృతం వలె పవిత్రంగా, మ‌రింత‌ స్వచ్ఛంగా మారుతుంది.

🌸విష్ణువు అవతారమైన శ్రీ కృష్ణునికి తులసి చాలా ప్రియమైనది. అందుకే తీర్థంలో అందుకే తులసి దళాన్ని వేస్తారు? పంచామృతంలో కూడా తుల‌సి ద‌ళాన్నివేస్తారు. 

🌿తీర్థంలో తులసి దళాన్ని వేయ‌డానికి ఇదే కారణం. కాగా సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా తులసి ఆకులను ముట్టకూడదంటారు.

🌸 తులసి మాతకు పరిశుభ్రత అంటే చాలా ఇష్టమనే విష‌యాన్ని గుర్తుంచుకోండి. తుల‌సిని స‌రిగా సంర‌క్షించ‌క‌పోతే తుల‌సి ఆకులు ఎండిపోతాయి. 

🌿మంగళ, ఆదివారాల్లో తులసి ఆకులను కోయ‌కూడ‌దు. హిందూమతంలో తులసికి తల్లి ప్రత్యేక స్థానం సనాతన ధర్మంలో తులసి మహిమ అపారమైనది. 

🌸పూజా పాత్ర‌, ప్రసాదంలో తులసి దళానికి ప్ర‌త్యేక స్థానం ఉంది...

No comments:

Post a Comment