Thursday, February 5, 2026

 ```
311f6;
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀మహానుభావుల బాట - శ్రీ చాగంటి వారి మాట - ```


             *శ్రీ అంబేడ్కర్ గారు*
                   ➖➖➖✍️
```
ఎందరో మహానుభావుల జీవితములు మనకు మార్గదర్శనములు, నిరంతర స్ఫూర్తిదాయకములు. అటువంటి ఎన్నో విషయములు పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డా॥చాగంటి కోటేశ్వరరావు గారి మాటలలో...

2017 మే లో కాకినాడలోని శ్రీమతి ఆకొండి లక్ష్మి స్మారక గోశాలలో...  "శ్రీ చాగంటి సత్సంగము" ఆధ్వర్యములో పూజ్య గురువులు "వ్యక్తిత్వ వికాసము" అను అంశముపై విద్యార్థులను ఉద్దేశ్యించి చేసిన ప్రసంగములో శ్రీఅంబేడ్కర్ గారి గురు భక్తి, దార్శనికత గురించిన విశేషములు...

డా॥బీ.ఆర్.అంబేడ్కర్...అంబేడ్కర్ గా ప్రఖ్యాతి గాంచిన వీరికి తల్లి తండ్రులు పెట్టిన పేరు “భీమ రావు రాంజీ.” వారు విద్యాభ్యాసము చేస్తున్న రోజులలో వారికి అంబేడ్కర్ అని పేరు గల ఒక ఉపాధ్యాడు ఉండేవారు. 

ఆయన భీమరావు గారికి విద్య పట్ల కల శ్రద్ధాసక్తులు చూచి, ఎంతో ప్రేమతో చదువు నేర్పటమే కాకుండా తాను తెచ్చుకున్న భోజనములో కొంత భాగము పెట్టి ఆదరించారు. 

తాను బారిష్టరు పూర్తి చేసిన తరువాత కూడా తనకు విద్య నేర్పిన గురువు వలననే తాను ఈ స్థితిలో ఉన్నాను అని తన పేరులో చేర్చబడిన గురువు గారి పేరైన "అంబేడ్కర్" ను అలానే ఉంచుకున్నారు. 
అదీ వారి గురు భక్తి..!

శ్రీ అంబేడ్కర్ గారు ఒక నిరుపేద కుటుంబములో పుట్టి, త్రాగటానికి మంచి నీరు కోసం చాలా దూరం ప్రయాణించవలసిన పరిస్థితులలో నుంచి గొప్ప విద్యాభ్యాసము చేసారు. 

ఆ రోజులలో సమాజములో ఉన్న వివక్ష వలన తన చిన్నతనము నుండి ఆయన మరిన్ని ఇబ్బందులు పడ్డారు. వారు పడ్డ కష్టాలను గురించి తెలుసుకుంటే ఆ సామాజిక వివక్ష పట్ల మనకే రోత కలుగుతుంది. అటువంటి ఇబ్బందులు అనుభవించీ కూడా తాను గొప్ప దీక్ష, పట్టుదలతో విద్యాభ్యాసము చేసి, న్యాయ శాస్త్రములో గొప్ప పరిఙ్ఞాము సంపాదించుకున్నారు. తాను స్వతంత్ర భారత దేశములో న్యాయ శాఖామాత్యులుగా ఉన్నా, దేశ రాజ్యాంగ నిర్మాణలో క్రియాశీల పాత్ర పోషించినా, దేశ రాజ్యాంగ నిర్మాతగా కీర్తిగాంచినా, తన జీవిత పర్యంతమూ తాను అనుభవించిన వివక్ష సమాజములో మరెవరూ అనుభవించకూడదు అనే దిశగానే శ్రమించి, ఎన్ని కోట్ల మందో సంతోషముగా ఉండటానికి కారణమయ్యారు. ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా, "నేను ఏమివ్వగలను" అన్న ఆలోచన ఎవరియందు అంతర్లీనముగా ఉంటుందో, అటువంటి వారు ఎప్పటికీ కొనియాడబడతారు. దార్శనికుడై, దేశకాలములతో సంబంధము లేకుండా కీర్తింపబడతారు. ప్రజలు వారిని స్మరిస్తూనే ఉంటారు. అటువంటి దార్శనికుడు శ్రీ భీమ రావు రాంజీ అంబేడ్కర్ గారు.✍️```
.      *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                    🌷🙏🌷```
 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
          ➖▪️➖
ఇలాంటి మంచి విషయాలకోసం…
“భగవంతుని విషయాలు గ్రూప్”లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏```

No comments:

Post a Comment