Thursday, February 5, 2026

 యోగం

చంద్రుడు నక్షత్రంతో కలిసి ఉన్న కాలాన్ని యోగం అంటాము. వీటిని సాధించే ప్రక్రియే కరణం. హిందూ జ్యోతిష శాంస్త్రంలో పంచాంగంలో ఒక అంశం యోగం. పంచాంగం అనగా తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం - ఈ ఐదు భాగముల కలయిక. పంచాంగం దుర్ముహూర్తములు, శుభముహూర్తములు తెలుపుతుంది. పంచాంగములు రెండు రకములు. చాంద్రమాన పంచాంగం (చంద్రుని సంచరణతో అనుసంధానమైనది), సూర్యమాన పంచాంగం (సూర్యుని సంచరణతో అనుసంధానమైనది). తెలుగువారు చంద్రమానాన్నే అనుసరిస్తారు.
పంచాంగం ప్రకారం యోగ నామములు: 27. 27

యోగాల్లో కొన్ని శుభ ఫలితాలకు, మరికొన్ని అశుభఫలితాలకు కారణమవుతాయి. ఆయుష్మాన్ అనేది వీటిలో చాలా మంచి యోగం.

1. విష్కంభము
2. ప్రీతి
3. ఆయుష్మాన్
4. సౌభాగ్యము 
5. శోభనము
6. అతిగండము
7. సుకర్మము
8. ధృతి
9. శూలము
10. గండము = గండ యోగం
11. ລ້
12. ధ్రవము
13. వ్యాఘాతము
14. హర్షణము
15. వజ్రము
16. సిద్ధి= సిద్ధి యోగం
17. వ్యతీపాతము
18. పరియాన్ == పరీయాన్
19. పరిఘము = పరిఘ
20. శివము
21. సిద్ధము
22. సాధ్యము
23. శుభము
24. శుక్రము == శుక్లము
25. బ్రహ్మము
26. ఐంద్రము
27. వైదృతి

No comments:

Post a Comment