Thursday, February 5, 2026

When Love Becomes Control: Parenting Mistakes That Ruin Children’s Growth | Telugu Podcast

When Love Becomes Control: Parenting Mistakes That Ruin Children’s Growth | Telugu Podcast

https://m.youtube.com/watch?v=zWJMQBAmQbg


https://www.youtube.com/watch?v=zWJMQBAmQbg

Transcript:
(00:04) కొంతమంది తల్లిదండ్రులకు తమ పిల్లలు రెండు రకాలుగా కనిపిస్తారు. వాళ్ళ మాట వింటే బంగారు కొండలుగా వినకపోతే తలనప్పిగా మారుతారు. అదే పిల్లలు పెరిగి పెద్దయ్యాక నలుగురి కంటే బాగా సంపాదిస్తే ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో మంచు పిల్లలు అవుతారు. అలానే అదే పిల్లలు తమ దారిలో నడిస్తే వాళ్ళ ప్రేమకు శరతులు మొదలవుతాయి. ఇక్కడ పేరెంట్స్ అనుకునేది ఏమిటంటే మన పిల్లలు మన సొంతం అనుకుంటారు.
(00:32) కానీ నిజంగా పిల్లలను కంట్రోల్ చేయగలరా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు పొలం దున్ని విత్తనం వేసి నీళ్లు పెడతాడు. కానీ వర్షం పడుతుందా లేదా పంట ఎలా పెరుగుతుంది? ఎంత దిగుబడి వస్తుంది అనేవి రైతు చేతుల్లో ఉండవు. అతను ఆ పంట నా సొంతం నేను పండించాను గనుక నేను చెప్పినట్టే పెరగాలి అని చెప్పగలడా? అలానే తల్లిదండ్రులు పిల్లలకు ఒక శరీరాన్ని క్రియేట్ చేసి ఇస్తారు.
(00:59) ఈ ప్రాసెస్ లో x క్రోమోజోమ్స్ y క్రోమోజోమ్స్ కలిస్తేనే ఈ పిల్ల అనే శరీరం పుట్టడం స్టార్ట్ అవుతుంది. ఆ క్షణంలో ఏ తల్లిదండ్రులైనా పుట్టబోయే బేబీ కోసం కలవరు. ఆ టైం కి జీవితం వలన ఒక మార్గంగా ఉపయోగిస్తుంది. సో తల్లిదండ్రులు ఆ ప్రక్రియలో పాల్గొనేవారు మాత్రమే దాని ఫలితమే బేబీ కానీ ఇక్కడ ఒక ఆడదాని కంటే మగాడు మాత్రం లైఫ్ లో ఏదో సాధించాడు అనే గొప్ప ఫీలింగ్ లో ఉంటాడు.
(01:26) అదేంటో దానికి నేనే కారణం నా వల్లే జరిగింది అని. బట్ రియాలిటీ ఏంటంటే నాకు మీలాగానే ఇంటిమేట్ అయ్యాను ఒక మగాడిని అని నిరూపించుకోవడానికి. అదే ఇప్పుడు ఇద్దరిలో ఎవరికో ఒకరికి ప్రాబ్లం ఉంటే సిచువేషన్ చాలా డల్ గా మారిపోతుంది. దీనిని అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమందే గిబ్రాన్ చెప్పినట్టు పిల్లలు మీ ద్వారా వస్తారు కానీ మీ వాళ్ళు కాదు.
(01:52) పట్టణాలకు దూరంగా ఒక గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు. అతని పేరు ఎవ్వరికీ గుర్తుండేది కాదు కానీ అతన్ని అందరూ విల్లు తయారీదారుడు అని పిలిచేవారు. అయితే అతని గొప్పతనం ఏమిటంటే అతని చేతుల నుంచి వచ్చిన విల్లు చాలా ప్రత్యేకంగా ఉండేది. ప్రతి విల్లు తయారు చేసే ముందు చెట్టుతో మాట్లాడేవాడు. అలానే అతనికి ఒక అలవాటు ఉంది.
(02:15) అతను తయారు చేసిన ప్రతి విల్లును కొన్ని రోజులు తన దగ్గరే ఉంచుకొని దాన్ని గమనించేవాడు. దాని ఒంపు దాని బలం దాని సహనం ఇలా అన్నీ అతనికి తెలియాల్సిందే విల్లు బలంగా ఉండాలి కానీ గట్టిగా కాదు బంగాలి కానీ విరగకూడదు అని అనుకునేవాడు. అతని జీవితంంతా ఇలానే గడిచింది. ప్రేమ, సహనం, శ్రమ వాటితోనే అయితే ఒకరోజు ఎప్పుడూ చేసేదానికంటే కొంచెం గొప్పగా ఒక విల్లును చేసి మురిసిపోయాడు.
(02:42) ఆ విల్లు కోసం ఒక బాణాన్ని కూడా రెడీ చేశాడు. అది సూటిగా మరి పదునుగా ఉంది. ఆ విల్లు ఆ బాణాన్ని చూసి అనుకుంది నువ్వు నావల్లే ఉన్నావు నాతో ఉంటేనే నీకు వాల్యూ ఉంటుంది అని అలా కొన్ని రోజులు గడిచాక ఒక వేటగాడు వచ్చి అతని విల్లును పట్టుకొని బాణాన్ని ఎక్కించాడు. లక్ష్యం చాలా దూరంలో ఉంది. ఆ క్షణంలో విల్లు భయపడింది.
(03:05) నేను వదిలేస్తే బాణం నన్ను వదిలి వెళుతుంది అని కానీ వేటగాడు వెనక్కి తగ్గలేదు. బాణాన్ని వదిలాడు. బాణం గాలిలోకి దూసుకెళ్ళింది. దూరంగా ఉన్న లక్ష్యాన్ని తాకింది. అప్పుడు ఆ విల్లు ఖాళీగా మారింది. అప్పుడే వేటగాడు అన్నాడు నేను వదులకపోతే అది తన గమ్యాన్ని చేరేది కాదు. నువ్వు బలంగా లేకపోతే అది ఎంత దూరం వెళ్లేది కూడా కాదు అని ఆ మాటలు విన్న విల్లు నిజాన్ని అర్థం చేసుకుంది.
(03:31) తన పని పట్టుకొని ఉంచడం కాదు వదిలే అంత బలంగా ఉండడం అని అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ కథలో విల్లు తల్లిదండ్రులు అయితే బాణం పిల్లలు అన్నమాట. తల్లిదండ్రుల ప్రేమ ఎక్కువగా భయంతోనే కలిసిపోతుంది. నా మాటే వినాలి నా దారిలోనే నడవాలి అనే భ్రమ ప్రేమలా కనిపిస్తుంది. కానీ పిల్లలు బాణాల లాంటివారు ముందుకు వెళ్ళడానికి పుట్టారు ఆగిపోవడానికి కాదు.
(03:58) గిబ్రాన్ ఆన్ చిల్డ్రన్ లో చెప్పింది కూడా ఇదే. పిల్లలు మన ద్వారా ఈ లోకానికి వస్తారు. కానీ మన సొంతం కాదు. వాళ్ళ ఆలోచనలు మనవిగా ఉండకపోవచ్చు. వాళ్ళ కలలు మనకు అర్థం కాకపోవచ్చు. కానీ వాటిని ఆపే హక్కు మనకు లేదు. మన పని వాళ్ళను బలంగా చేయడం మాత్రమే శారీరకంగా కాదు భావోద్వేగంగా ఆలోచనల్లో అంటే పేరెంట్స్ విల్లు లాంటివారు వాళ్ళు ఎంత బలంగా ఉంటే పిల్లలు అంతే దూరం వెళ్ళగలరు.
(04:27) కానీ ఆ బలం కంట్రోల్ లోనో ఆపేయడంలోనో కాదు ఒక సపోర్ట్ గైడెన్స్ ను ఉంటుంది. పిల్లలను మన భయాలకు కట్టి పడేయడం వాళ్ళను రక్షించడం కాదు అది ఒక రకంగా వాళ్ళ ఎగిరే రెక్కలను కత్తరించినట్టే దీనిని ప్రేమ గారాబో అని చెప్పుకుంటూ బ్రతికేదాన్ని ప్రేమ అని అనరు. నిజమైన ప్రేమ దానికి స్వేచ్ఛ దొరికే సరైన సమయానికి వదిలేయడమే. ఈ కథలో చివరికి ఏమైంది విల్లు తన బాధను వదిలేసింది అర్థం చేసుకుంది.
(04:56) బాణం ఎంత దూరంగా వెళ్ళడం తన ఓటమి కాదు అది విజయం అనుకుంది. అదేవిధంగా పిల్లలు తమ జీవితాల్లో ముందుకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులకు ఒక ఎంటీ వస్తుంది. అది నిజానికి ఒక గర్వంగా మారాలి. నేను నా పని చేశాను అని అనుకోగలిగితే అదే నిజమైన తల్లిదండ్రత్వం. మన లైఫ్ లో ఎవరో ఒకళ్ళు మన దగ్గర నుంచే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లలు శిష్యులు మనం ప్రేమించే వాళ్ళు అని బట్ మన కర్తవ్యం ఏంటి వీలైనంతవరకు సపోర్ట్ ఇస్తూ బలంగా తయారు చేసి వదిలేయడమే.

No comments:

Post a Comment